four years old
-
లాక్‌డౌన్‌తో మానసిక స్థితి కోల్పోయి..
జోగిపేట: లాక్డౌన్ కారణంగా ఉపాధి లభించకపోవడంతో మానసిక స్థితి కోల్పోయిన ఓ తండ్రి కన్న కూతురునే కడతేర్చాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం గొంగ్లూర్ తండాలో చోటుచేసుకుంది. సీఐ బుర్రి శ్రీనివాస్ కథనం ప్రకారం.. గొంగ్లూర్ తండాకు చెందిన రమావత్ జీవన్ దంపతులకు ముగ్గురు సంతానం. గురువారం రాత్రి కుటుంబ సభ్యులు ఇంటి ఎదుట నిద్రించారు. అందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో రమావత్ జీవన్ మానసిక స్థితి కోల్పోయి కూతురు అవంతిక (4)ను కత్తితో గొంతు కోసి చంపాడు. ఏమి తెలియనట్లు భార్యను లేపి బిడ్డకు ఏదో అయింది చూడు అని చెప్పాడు. అప్పటికే పాప మరణించింది. కూతురును తన భర్తే హత్య చేశాడని భార్య పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. కూతురును హత్య చేసింది తానేనని, ఎందుకు ఇలా చేశానో అర్థం కావడం లేదని పోలీసుల ఎదుట వాపోయాడు. అయితే ఇంట్లో ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో కొన్ని రోజులుగా భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని, జీవన్ మానసిక పరిస్థితి సరిగా ఉండటం లేదని పోలీసుల విచారణలో తేలినట్లు సమాచారం. -
వావ్..నాలుగేళ్లకే అమ్మ ప్రాణం నిలబెట్టాడు
వరిసి(ఇటలీ): తల్లిదండ్రులను కాపాడుకునే అవకాశం అందరికీ ఉన్నా ఈ రోజుల్లో ఆ పని చాలా తక్కువమంది చేస్తారు. కొంతమందికి కాపాడుకునే స్తోమత ఉన్నప్పటికీ ఆ సమయంలో పక్కన లేకపోవడంతో వారిని కోల్పోవాల్సి ఉంటుంది. కానీ, ఇటలీలో మాత్రం ఓ నాలుగేళ్ల బాలుడు తనకు వచ్చిన అవకాశాన్ని క్షణాల్లో ఉపయోగించుకున్నాడు. అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైన తన తల్లిని రక్షించుకొని అందరితో మంచి కొడుకు అనిపించుకుంటున్నాడు. వైద్యులంతా ఆ బాలుడు చేసిన పనికి ముగ్దులై పోతున్నారు. ఇటలీలో ఓ తల్లి తన నాలుగేళ్ల కుమారుడితో కలిసి కారులో వెళుతుండగా ఆమెకు గుండె నొప్పి మొదలైంది. వెంటనే కారు ఆపి ఆమె కుప్పకూలిపోవడంతో వెంటనే స్పందించిన ఆ నాలుగేళ్ల బాలుడు కారు దిగి రోడ్డుపై పోయేవాళ్లను ఆపాడు. తన తల్లికి ఏదో అయిందని వెంటనే ఎమర్జెన్సీకి ఫోన్ చేయాలని కోరాడు. దీంతో బాటసారులు అత్యవసర నెంబర్ కు ఫోన్ చేయడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ఐసీయూలోకి తీసుకెళ్లిన వైద్యులు ఆమెకు చికిత్స చేయడంతో ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఆమెను ఈ రోజు డిశ్చార్జి చేస్తారు. సకాలంలో ఆ బాలుడు తెలివిగా స్పందించడం వల్లే ఆమె ప్రాణాలు కాపాడగలిగామని వైద్యులు తెలిపారు. -
అప్పుడే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది!
పెళ్లి గురించి అడిగితే కొంతమందికి కోపం వస్తుంది. ప్రియాంకా చోప్రా మాత్రం చాలా కూల్‌గా సమాధానం చెబుతారు. ఇప్పటివరకూ తన మనసుకి నచ్చిన వ్యక్తి తారసపడలేదనీ, ఇక పెళ్లెలా చేసుకోననీ అన్నారు ప్రియాంక. పెళ్లయితే చేసుకోలేదు కానీ.. ఇప్పటివరకూ లెక్కలేనన్ని సార్లు పెళ్లి కూతురయ్యానని ప్రియాంకా చోప్రా చెబుతూ -‘‘మీకో గమ్మత్త యిన విషయం చెబుతా. నాలుగేళ్ల వయసులోనే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. బోల్డంత మంది పిల్లలు కావాలనిపించింది. అప్పుడు నాకు పెళ్లంటే ఏంటో తెలియదు. కానీ, ఒక్కటి మాత్రం తెలుసు. అదేంటంటే.. పెళ్లప్పుడు బాగా అలకరించుకుంటారు కదా. అందుకే, పెళ్లి చేసుకోవాలనుకున్నా. స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్లంటే చాలు.. పెళ్లి కూతురి వేషమే వేసేదాన్ని. కలర్‌ఫుల్ గాగ్రా, చోళీ, నుదుట ఎరుపు రంగు బొట్టు బిళ్ల, చేతి నిండా గాజులు, డిజైనర్ నెక్లెస్.. ఇలా ఓ రేంజ్లో ముస్తాబయ్యి, మురిసిపోయేదాన్ని. ఇక, నిజంగా ఎప్పుడు పెళ్లి కూతురవుతాననేది కాలమే చెప్పాలి’’ అన్నారు.