four young men
-
సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతు
సాక్షి, శ్రీకాకుళం: కవిటి మండలం పుక్కళ్లపాలెంలో విషాదం చోటు చేసుకుంది. సముద్రస్నానానికి వెళ్లి నలుగురు యువకులు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతులను బొర్రపుట్టుగ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పెదపులిపాకలో విషాదం కృష్ణా జిల్లా పెదపులిపాకలో విషాదం చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురు యువకులు మృతి చెందారు. మృతులు సాయి శ్రీనివాస్(25), గోవింద్(22), సతీష్(22)లుగా పోలీసులు గుర్తించారు. చదవండి: Guntur : పీకల వాగులో పడి బాలుడు మృతి గెయిల్ గ్యాస్ విస్పోటనానికి ఎనిమిదేళ్లు -
విషాదం: పెన్నానదిలో నలుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి యువకులు ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కడపలోని బెల్లంమండి వాసులుగా గుర్తించారు. చదవండి: మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం -
నలుగురి కథ
నలుగురు యువకులు ఓ లక్ష్యంతో హైదరాబాద్లో అడుగుపెడతారు. డబ్బు సంపాదన కోసం వారు ఎలాంటి మార్గం ఎంచుకున్నారు? సరైన దారిలో నడిచారా? లేదా? అనే కథాంశంతో తెరకెక్కుతోన్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. ప్రత్యూష్ వి.ఆర్, హర్షితా పన్వర్, కిషన్ కన్నయ్య కె.కె, సాత్విక్, సిరికొమ్ము ప్రధాన పాత్రల్లో ప్రభాస్ నిమ్మలను దర్శకత్వంలో మహేశ్ కన్నా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ప్రారంభోత్సవం హైద రాబాద్లో జరిగింది. దర్శకుడు సముద్ర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత మల్కాపురం శివకుమార్ కెమెరా స్విచాన్ చేయగా, తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి క్లాప్ ఇచ్చారు. నిర్మాతలు బి. కాశీవిశ్వనాథం, తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘మా చిత్ర దర్శకుడు, సముద్ర గారి వద్ద పనిచేశాడు. తను రాసుకున్న కథ నచ్చడంతో నిర్మిస్తున్నాం’’ అని మహేశ్ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: అడుసుమిల్లి విజయకుమార్, సహ నిర్మాతలు: ఎస్.మంగారావు-చలపతి, కథ,-స్క్రీన్ప్లే-సంగీతం-మాటలు-దర్శకత్వం: ప్రభాస్ నిమ్మల.