fourth marriage
-
నాలుగు కాదు.. 40 పెళ్లిళ్లు చేసుకుంటా : వనితా విజయ్‌కుమార్
Vanitha Vijayakumar: వివాదాస్పద నటి వనితా విజయ్‌కుమార్ ఇటీవలె తరుచూ వార్తల్లో నిలుస్తున్నారు. సీనియర్ యాక్టర్స్ విజయ్-మంజుల కూతురే వనిత. 'చంద్రలేఖ' చిత్రం ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఆమె తమిళ బిగ్‌బాస్ షోలోనూ పాల్గొని తరచూ వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో బోలెడంత పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత గతేడాది జూన్‌లో పీటర్ పాల్ అనే వ్యక్తిని మూడో వివాహం చేసుకొని విమర్శలపాలైంది. వీరి వివాహం సినీ వర్గాల్లో పెద్ద చర్చకే దారి తీసింది. అయితే ఆ వివాహ జీవితం కూడా ఎంతో కాలం సజావుగా సాగలేదు. వివాహం అయిన కొద్దిరోజుల్లోనే ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో విడిపోయారు. అలా మూడో పెళ్లి పెటాకులైన వనితా విజయ్ తాజాగా పవర్ స్టార్ శ్రీనివాసన్‌తో పెళ్లి ఫోటో షేర్ చేసి అందరికి షాకిచ్చింది. ఇద్దరూ పూలదండలు మార్చుకుంటున్న స్టిల్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ లవ్ సింబల్‌ను జోడించింది. దీంతో వనితా విజయ్‌కుమార్ నాలుగో పెళ్లి చేసుకుందంటూ నెటిజన్లు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. గతంలో ఓ జ్యోతిష్యుడు వనితాకు నాలుగో పెళ్లి జరుగుతుందంటూ చెప్పిందే నిజమైందంటూ జోకులు పేల్చారు. ఇక వీరిద్దరరి పెళ్లి ఫోటో నెట్టింట ఎంతగా వైరల అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కరల్లేదు. దీంతో తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చిన వనితా విజయ్‌కుమార్ స్పందించింది. ఇది నిజమైన పెళ్లి కాదని, ‘పికప్ డ్రాప్’ అనే చిత్రానికి సంబంధించిన ఫొటోలని వివరణ ఇచ్చింది. అంతేకాకుండా పెళ్లి గురించి తనపై వచ్చిన విమర్శలపై మాట్లాడుతూ.. 'ఇద్దరు నటీనటులు కలిసి ఫోటోలు తీసుకుంటే అది నిజమైన పెళ్లి అయిపోతుందా? దానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరం ఏముంది? నా స్థానంలో ఒక మగవాడు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా పట్టించుకోని జనాలు ఆ పని ఒక మహిళ చేస్తే మాత్రం తప్పుపడుతున్నారు. నాలుగు కాదు..40 పెళ్లిళ్లు చేసుకుంటాను. అది నా వ్యక్తిగత విషయం. అయినా నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు' అని స్పష్టం చేసింది. -
నాలుగో పెళ్లికి రెడీ..
ఇప్పటికే ముగ్గురిని పెళ్లి చేసుకున్న ఓప్రభుద్ధుడు నాలుగో పెళ్లికి సిద్ధపడ్డాడు. ఏవేవో కారణాలు చెప్పి ఇద్దరు భార్యలకు విడాకులిచ్చాడు. యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఇతగాడి బాగోతం తెలుసుకున్న మూడో భార్య.. ఆదివారంనగరంలోని భర్త ఇంటి ఎదుట నిరసన దీక్షకు దిగింది. హైదరాబాద్, లింగోజిగూడ: ముగ్గురిని పెళ్లి చేసుకుని 4వ పెళ్లికి సిద్ధపడ్డాడో ప్రబుద్ధుడు. విషయం తెలుసుకున్న మూడో భార్య.. భర్త ఇంటి ముందు ఆదివారం నిరసన దీక్ష చేపట్టింది. బాధితురాలు,కాలనీ వాసులు తెలిపిన మేరకు.. లింగోజిగూడ డివిజన్ పరిధిలోని భాగ్యనగర్‌కాలనీ రోడ్ నెం–7లో నివాసముండే శ్రీనివాస్ యాదాద్రి జిల్లా భువనగిరిలో నీటి పారుదల శాఖలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఇతనికి ఇద్దరు మహిళలతో పెళ్లి జరుగగా విడాకులు తీసుకున్నాడు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి పట్టణం శ్రీరమణకాలనీకి చెందిన అనూష అనే మహిళను పెద్దల సమక్షంలో మే 23, 2014న పెళ్లి చేసుకున్నాడు. వివాహ సమయంలో అనూష కుటుంబీకులు శ్రీనివాస్‌కు రూ. 5 లక్షలతో పాటు 15 తులాల బంగారు ఆభరణాలను కట్న కానుకల కింద ఇచ్చి పెళ్లి ఘనంగా జరిపించారు. రెండు సంవత్సరాల పాటు కాపురం సాపీగా సాగగా ఆ తరువాత అనూషకు వేధింపులు మొదలయ్యాయి. అత్తగారింటి వేధింపులకు తట్టుకోలేక కొంత కాలం నుంచి అనూష పుట్టింటి వద్దే ఉంటోంది. 4వ పెళ్లికి సిద్ధపడ్డాడని తెలిసి... గతంలో జరిగిన పెళ్లిళ్లను దాచి అనూషను పెళ్లి చేసుకుని ఈమెను కూడా వదిలించుకోవడానికి విడాకుల నోటీసులు పంపించాడు. అంతేగాకుండా ఈ నెల 25న మరో మహిళతో 4వ పెళ్లికి సిద్ధపడినట్లు తెలుసుకుని అనూష ఆదివారం హైదరాబాద్‌కు వచ్చి సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అనంతరం భాగ్యనగర్ కాలనీలో అత్తగారింటికి వెళ్లగా ఇంటికి తాళం వేసి ఉంది. ఆందోళనకు గురైన అనూష అక్కడే నిరసన దీక్ష చేపట్టింది. అత్త, భర్త, ఆడపడుచు, ఆమె భర్త చిత్ర హింసలు పెట్టేవారని ఆవేదన వ్యక్తం చేసింది. -
నాలుగోసారి... పెళ్ళిపీటలపై కబీర్‌బేడీ
గుబురు గడ్డం... గుర్తుపట్టే రూపం... గంభీరమైన స్వరం... కబీర్ బేడీని చూడగానే ఇవన్నీ బొమ్మ కడతాయి. ఆరడుగుల అందగాడు, ఆజానుబాహుడైన కబీర్ బేడీ అనగానే, అప్పట్లో ప్రసిద్ధమైన దుస్తుల అడ్వర్టైజ్మెంట్స్ గుర్తొచ్చేవి. ప్రముఖ నటి పూజా బేడీ తండ్రి అయిన కబీర్ బేడీ తన 70వ పుట్టినరోజు సందర్భంగా ఇప్పుడు మళ్ళీ వార్తల్లో వ్యక్తి అయ్యారు. చిరకాలంగా తన స్నేహితురాలైన 40 ఏళ్ళ పర్వీన్ దుసంజ్ను తన పుట్టినరోజైన శనివారం నాడు అగ్నిసాక్షిగా వివాహం చేసుకొని, పార్టీకి వచ్చిన బంధుమిత్రుల్నీ, అతిథుల్నీ ఆశ్చర్యపరిచారు. కబీర్ బేడీకి ఇది నాలుగో పెళ్ళి. నిజానికి, పర్వీన్, కబీర్ బేడీలు గడచిన పదేళ్ళుగా కలిసి ఉంటున్నారు. కబీర్ బేడీ కుమార్తె పూజా బేడీ కన్నా పర్వీన్ నాలుగేళ్ళు చిన్న. ఈ పెళ్ళి విషయం తండ్రి తనకు ముందుగా చెప్పలేదని ఆరోపించిన పూజా బేడీకి సహజంగానే ఈ వివాహం నచ్చలేదు. ‘ప్రతి అద్భుత జానపద గాథలో ఒక మంత్రగత్తె కానీ, దుష్టురాలైన సవతి తల్లి కానీ ఉంటుంది. నాకిప్పుడు అలాంటి ఆవిడ వచ్చింది! పర్వీన్ దుసంజ్ను కబీర్ బేడీ పెళ్ళి చేసుకున్నారు’ అని పూజాబేడీ ఆదివారం ట్వీట్ చేశారు. అయితే, ఆ తరువాత ఆ ట్వీట్‌ను తానే తొలగించారు! ముంబయ్‌లో జరిగిన పుట్టినరోజు పార్టీకి అమెరికా, బ్రిటన్, దుబాయ్, మలేసియా, ఐరోపా తదితర దేశాల నుంచి మిత్రుల్ని కబీర్ బేడీ ఆహ్వానించారు. ‘కబీర్ బేడీ, పర్వీన్ దుసంజ్ల సంయుక్త ఆహ్వానం’ అని ఆహ్వానపత్రికలోనే పేర్కొన్నారు. తండ్రీ కూతుళ్ళ మధ్య విభేదాలను బహిర్గతం చేసిన ఆ పాత ట్వీట్ సంచలనం రేపడంతో, దాన్ని తొలగించిన పూజా బేడీ కొత్తగా మరో ట్వీట్ చేశారు. ‘‘మా నాన్న గారి నాలుగో పెళ్ళి గురించి చేసిన గత ట్వీట్‌ను తొలగించాను. అంతా సానుకూలంగా చూద్దాం. ఆయనకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా’’ అని ఆ ట్వీట్లో పూజా బేడీ పేర్కొన్నారు. అతిథులతో సహా ఎవరికీ ముందుగా సమాచారం లేని ఈ పెళ్ళికి పూజ గైర్హాజరవడం గమనార్హం. కాగా, ఈ విషయమై ఆమె వివరణనిస్తూ, ‘‘గడచిన రెండు మూడేళ్ళుగా నాకూ, మా నాన్న గారికీ మధ్య కొన్ని వ్యక్తిగత తగాదాలున్నాయి. వాటిని పరిష్కరించుకోవచ్చు. కానీ, నాకూ, పర్వీన్‌కూ మధ్య ఉన్న శత్రుత్వం వల్ల ఆ తగాదాలు పెరిగిపోయాయి. నన్ను వాళ్ళ పెళ్ళికి పిలవలేదు’’ అని చెప్పారు. ప్రసిద్ధ ఒడిస్సీ నర్తకి అయిన మొదటి భార్య ప్రతిమా బేడీ ద్వారా కబీర్ బేడీకి కలిగిన సంతానం - నటి పూజా బేడీ. ఆ తరువాత ఆయన సుసాన్ హమ్‌ఫ్రేస్, నిక్కీ బేడీలను వివాహం చేసుకున్నారు. ఆ బంధాలన్నీ విచ్ఛిన్నమయ్యాక పర్వీన్‌కు దగ్గరైన కబీర్ సుదీర్ఘ కాలం సహజీవనం తర్వాత ఇప్పుడు ఆమెను పెళ్ళి చేసుకున్నారు. నాన్న చేసుకున్న కొత్త పెళ్ళితో సహజంగానే కుమార్తె అలిగినట్లుంది. -
ఆయనకు 84.. ఆమెకు 59.. మళ్లీ పెళ్లి!
అమెరికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, చైనా దేశాల్లో వేల కోట్ల రూపాయల ఆస్తులు కలిగిన 'న్యూస్ కార్పొరేషన్' ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రూపర్ట్ ముర్దోక్ తన 84వ ఏట మళ్లీ పెళ్లి చేసుకుంటున్నారు. ముగ్గురు భార్యలతో ఇప్పటికే ఆరుగురు పిల్లలున్న ముర్దోక్.. ఇప్పుడు నాలుగో పెళ్లిగా నలుగురు పిల్లలున్న 59 ఏళ్ల జెర్రీ హాల్‌ను పెళ్లి చేసుకోబోతున్నారు. వందల కోట్ల రూపాయల భరణాన్ని చెల్లించి తన ముగ్గురు భార్యలకు ముర్దోక్ విడుకులివ్వగా, 'రోలింగ్ స్టోన్' రాక్ ట్రూప్‌లో ఫ్రంట్ మేన్ మిక్ జాగర్ 1990లో పెళ్లి చేసుకొని 1999లో ఆయనకు విడాకులు ఇచ్చిన జెర్రీ హాల్.. 16 ఏళ్ల తర్వాత రెండో పెళ్లి చేసుకుంటున్నారు. గత అక్టోబర్ నెల నుంచి డేటింగ్ చేస్తున్న ముర్దోక్, జెర్రీహాల్ ఇద్దరూ బెవర్లీ హిల్టన్‌లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో రెడ్ కార్పెట్‌పై చేతులో చెయ్యేసి నడవడంతో హాలీవుడ్ సెలబ్రెటీలలో గుసగుసలు ప్రారంభమయ్యాయి. వాటిని నిజంచేస్తూ తాము త్వరలో ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నామంటూ 'ది టైమ్స్' పత్రికలో ఓ వాణిజ్య ప్రకటన ఇచ్చారు. 'ప్రుడెన్స్, ఇలిసాబెత్, లచ్లాన్, జేమ్స్, గ్రేస్, క్లో ముర్దోక్లకు తండ్రైనా రూపర్ట్ ముర్దోక్, ఎలిజబెత్, జేమ్స్, జార్జియా, గాబ్రియెల్ జాగర్లకు తల్లైనా జెర్రీ హాల్ ఎంగేజ్మెంట్ నిశ్చయమైందని చెప్పడానికి సంతోషిస్తున్నాం' అని ఆ క్లాసిఫైడ్ యాడ్‌లో ప్రకటించారు. 'ది టైమ్స్' పత్రికను 'న్యూస్ కార్పొరేషన్' సంస్థ వెలువరిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా నుంచి పలు పత్రికలను ప్రచురిస్తున్న ఈ సంస్థ వందకుపైగా టీవీ ఛానళ్లను కూడా నడుపుతోంది. సంపాదనపరంగా న్యూస్ కార్పొరేషన్ నాలుగో అతిపెద్ద మీడియా సంస్థ. హాలీవుడ్లో అతి పెద్ద నిర్మాణ సంస్థల్లో ఒకటైన 'ట్వంటీ ఫస్ట్ సెంచరీ ఫాక్స్' సంస్థ కూడా ఈ మీడియా సంస్థలో భాగమే. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరుక్కోవడం వల్ల ఇదే సంస్థ నుంచి వెలువడుతున్న 'న్యూస్ ఆఫ్ ది వరల్డ్' అనే పత్రికను మూసివేయాల్సి వచ్చింది. అక్టోబర్‌లో డేటింగ్ మొదలుపెట్టిన ముర్దోక్, జెర్రీ హాల్ అదే నెలలో జరిగిన న్యూజిలాండ్, ఆస్ట్రేలియా రగ్బీ వరల్డ్ కప్ ఫైనల్లో పబ్లిక్‌గా మొదటిసారి కనిపించారు. రెండోసారి గోల్డెన్ గ్లోబ్ పోటీల్లోనే కనిపించారు. వారిద్దరు పీకలోతు ప్రేమలో మునిగిపోయారని, వారు పెళ్లి చేసుకోవడం పట్ల తమకు ఏ మాత్రం అభ్యంతరం లేదని ముర్దోక్ పిల్లలు, జెర్రీ హాల్ పిల్లలు మీడియా ముందు వ్యాఖ్యానించారు. తాము కూడా ఇక జీవితంలో స్థిరపడాలని కోరుకుంటున్నట్లు కొత్త జంట ప్రకటించింది. జీవితంలో స్థిరపడటం అంటే వారి ఉద్దేశం ఏంటో! ఇద్దరు వేర్వేరుగా పలువురితో ఇంతకాలం జరిపిన ప్రణయ పురాణాలకు స్వస్తి చెప్పడమేమో!!