రాష్ట్రాన్ని నాల్గో పార్టీగా చేర్చాలి
కృష్ణా జల వివాదంపై సీపీఎం
హైదరాబాద్: కృష్ణా జలాల వివాదం లో తెలంగాణను నాలుగవ పార్టీగా చే ర్చాలని, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునల్ తీర్పును పునఃపరిశీలించి రాష్ట్రానికి నీటి కేటాయింపులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీపీఎం విజ్ఞప్తి చేసింది. మహబూబ్నగర్, నల్లగొండ జిల్లాలు వర్షాభావం వల్ల తీవ్రకరువుకు గురవుతున్న విషయాన్ని గమనంలోకి తీసుకోకుండా తీర్పునివ్వడంవల్ల నికరజలాలు, మిగులు జలాల్లో తెలంగాణకు నష్టం జరుగుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. కాగా, గురువారం దేశవ్యాప్తంగా జరగనున్న రవాణా సమ్మెకు సీపీఎం మద్దతు ప్రకటించింది.
ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజులు పెంచొద్దు
రాష్ర్టంలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఫీజుల పెంపుదలను ఆమోదించవద్దని సీఎం కేసీఆర్కు సీపీఎం విజ్ఞప్తిచేసింది. ఈ మేరకు తమ్మినేని వీరభద్రం ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు.