Frank-Walter Steinmeier
-
జర్మనీ అధ్యక్షునిగా మళ్లీ స్టెయిన్మెయర్
బెర్లిన్: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్మెయర్ (66) మరో ఐదేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. పార్లమెంటు ఆదివారం ప్రత్యేకంగా సమావేశమై ఆయన్ను మరోసారి అధ్యక్షునిగా ఎన్నుకుంది. అధికార పక్షంతో పాటు అత్యధిక విపక్షాలు కూడా ఆయన అభ్యర్థిత్వానికి మద్దతు పలికాయి. మాజీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ హయాంలో స్టెయిన్మెయర్ రెండుసార్లు విదేశాంగ మంత్రిగా పని చేశారు. జర్మనీలో అధ్యక్ష పదవి లాంఛనప్రాయమైనది. -
జర్మనీ అధ్యక్షుడితో మోదీ చర్చలు
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్తో భారత ప్రధాని మోదీ విస్తృత చర్చలు జరిపారు. ఐదు రోజుల భారత పర్యటనలో ఉన్న వాల్టర్ను ఢిల్లీలోని సుందర్ నర్సరీలో మోదీ కలిశారు. ‘సుందర్ నర్సరీకి జర్మనీ అధ్యక్షుణ్ని తీసుకెళ్లే గౌరవం నాకు దక్కింది. అనేక అంశాలపై మేం విస్తృత చర్చలు జరిపాం’ అని తర్వాత మోదీ ట్వీట్ చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు ఉన్న మార్గాలపై మోదీ, వాల్టర్లు చర్చించారు. అంతకు ముందు వాల్టర్ ఉప రాష్ట్రపతి వెంకయ్య, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సమస్యలపై భారత్, జర్మనీల వైఖరి ఒకేలా ఉందని వెంకయ్య అన్నారు. వెంకయ్యను కలవడానికి ముందు రాష్ట్రపతి భవన్లో వాల్టర్కు ఘన స్వాగతం లభించింది. గురువారం భారత పర్యటనను ప్రారంభించిన వాల్టర్ ఆదివారం చెన్నైలోని మద్రాస్ ఐఐటీలో వాణిజ్య వేత్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. సోమవారం మహాబలిపురం ఆలయాన్ని సందర్శిస్తారు. -
మోడీతో జర్మనీ మంత్రి భేటీ
న్యూఢిల్లీ: జర్మనీ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టీన్మీయెర్ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమయ్యారు. భారత పర్యటనకు వచ్చిన ఫ్రాంక్ వాల్టర్ సోమవారమిక్కడ మోడీతో పాటు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ను కలిశారు. వాణిజ్యం, పెట్టుబడి, సాంకేతిక, పునరుత్పాదక శక్తి రంగాల్లో పరస్పర సహకారం గురించి చర్చించినట్టు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ఆయన వెంట ఉన్నత స్థాయి వ్యాపారవేత్తల బృందం కూడా వచ్చింది. జర్మనీ మంత్రి మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి స్మృతి ఇరానీ, పట్టాణిభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా సమావేశంకానున్నారు.