free cots
-
ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం
-
ఫ్రీగా మంచాలు ఇస్తారనే వెళ్లాం
మళ్లీ అదే సీన్ రిపీటైంది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో రాహుల్ గాంధీ బహిరంగ సభ అలా ముగిసిందో లేదో.. వచ్చినవాళ్లంతా మంచాల కోసం కొట్టుకున్నారు. కొద్ది సెకండ్లలోనే అక్కడ వేసిన మంచాలన్నీ మాయమైపోయాయి. 'మంచాలు అక్కడే వదిలేసి వెళ్లండి' అంటూ మైకులలో ప్రకటించినా.. ఎవరూ వినిపించుకోలేదు. అసలు తమకు ఉచితంగా మంచాలు ఇస్తామని చెప్పడం వల్లే మీటింగుకు వచ్చామని కైలాష్ నాథ్ కేసరి అనే పెద్దాయని చెప్పారు. ఈ సమావేశానికి హాజరైతే చాలు.. ఉచితంగా మంచాలు ఇస్తారని కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు తమకు చెప్పారని ఆయన మీడియాతో అన్నారు. అయితే, తనకు మాత్రం మంచం ఇవ్వలేదు గానీ.. చేతిలో ఈ జెండా పెట్టి పోయారని కాంగ్రెస్ జెండాను చూపించారు. మీర్జాపూర్ నుంచి రెండోదశ కిసాన్ యాత్రను ప్రారంభించిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మదీహాన్ అనే ప్రాంతంలో ఖాట్ సభ ఏర్పాటుచేశారు. బుధవారం నాడు ఆయన మొత్తం 164 కిలోమీటర్ల మేర యాత్ర సాగిస్తారు. ఇది మీర్జాపూర్, భదోహి, అలహాబాద్ జిల్లాల్లో జరుగుతుంది. వీటిలో కొన్ని ఖాట్ సభలు, మరికొన్ని బహిరంగ సభలు ఉంటాయి. యూపీలో మొత్తం 2,500 కిలోమీటర్ల మేర యాత్రను రాహుల్ తలపెట్టిన విషయం తెలిసిందే. -
రాహుల్ మీటింగులో మంచాలు ఫ్రీనా?
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల సమావేశం నిర్వహించారు. చాలామంది జనం వచ్చారు. అంతవరకు బాగానే ఉంది.. జనం కూర్చోడానికి మామూలుగా అయితే ఫైబర్ కుర్చీలు వేస్తారు. కానీ రాహుల్ సభ కదా కాస్త గ్రాండ్‌గా ఉండాలని నులక మంచాలు వేశారు. సభ ఇలా ముగిసిందో.. లేదో, జనమంతా ఆ మంచాలు తీసుకుని పరుగులు తీశారు. రుద్రపూర్ జిల్లాలోని దేవరియాలో జరిగిన రాహుల్ సభ కోసం ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా వెయ్యి మంచాలు ఏర్పాటుచేశారు. వాటిని జనానికి పంచిపెట్టేందుకే తెచ్చారా.. కాదా అనే విషయమై కాంగ్రెస్ పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన లేదు. ఈ వ్యవహారం కాస్తా నెటిజన్లకు మంచి పండగలా మారింది. దేవరియా తర్వాత కుషీనగర్‌లో మరో ఖాత్ సభ నిర్వహించనున్నారు. దాంతో అక్కడ కూడా మళ్లీ మంచాలు వేస్తారా.. వాటిని తీసుకెళ్లచ్చా అంటూ ట్విట్టర్లో వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. 'రీప్లేస్ మూవీనేమ్స్ విత్ ఖాత్స్' అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండవుతోంది. గ్రామస్తులు మంచాలు తీసుకెళ్తున్న ఫొటోలను కూడా జనం షేర్ చేస్తున్నారు.