Free Gas Connection scheme
-
ఏపీలో ఉచితం వంకతో వీర బాదుడు.. ఒక్క గ్యాస్ సిలిండర్ భారమే 14వేల కోట్లు!!
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు, పవన్ దీపావళి బాదుడు మామూలుగా లేదు.. వీరబాదుడు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్. కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పవన్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుందని చెప్పుకొచ్చారు.తాజాగా పోతిన మహేష్ ట్విట్టర్లో వీడియోలో మాట్లాడుతూ.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద మూడు సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూ 20 సిలిండర్ల డబ్బులు మహిళల దగ్గర ముక్కుపిండి వసూలు చేస్తున్నారు.కరెంటు బిల్లు పెంచం అని వాగ్దానాలు చేసి, సంపద సృష్టిస్తాం అని అరచేతిలో వైకుంఠం చూపించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఇప్పుడు కరెంటు బిల్లు పెంచి పేదవాళ్లకు కరెంటు షాక్ కొట్టిస్తున్నారు.మూడు ఉచిత సిలిండర్లకు కూటమి ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ రూ.2685 కోట్లు. ఎడమ చేత్తో సబ్సిడీ ఇచ్చి, కుడి చేత్తో విద్యుత్ చార్జీలు పెంచి బ్యాలెన్స్ చేసే ప్రతిభ చంద్రబాబుకే సొంతం. యూనిట్ రేటు పెంపు వలన ఇదే నవంబర్ ఒకటో తేదీ నుంచి రాష్ట్ర ప్రజలపై పడుతున్న భారం 17,072 కోట్లు.సూపర్ సిక్స్‌లోని ఒక పథకం అమలు చేస్తూ ప్రజలపై వేసిన అదనపు భారం 14,378 కోట్లు. ఎలాగంటే..(విద్యుత్ చార్జీల పెంపు, సర్దుబాటు వలన అదనపు భారం 17,072 కోట్లు-రూ.2685కోట్లు=14,378 కోట్లు)రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డుల సంఖ్య సుమారు కోటి యాభై లక్షలు. కానీ, ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నది మాత్రం తెల్ల రేషన్ కార్డులున్న పది లక్షల కుటుంబాలలోపు మాత్రమే.. ఇది మహిళల్ని మోసం చేయడం కాదా? దగా చేయడం కాదా? వెన్నుపోటు కాదా? చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి.కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజల ఇళ్లలో దరిద్ర దేవత తాండవిస్తుంటే అధికారంలోకి వచ్చిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందరేశ్వరి ఇంట్లో మాత్రం లక్ష్మీ దేవత తాండవిస్తుంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గార్ల దీపావళి బాదుడు మామూలు బాదుడు కాదు ఇది వీరబాదుడు.@JaiTDP @JanaSenaParty@BJP4India దీపావళి కొత్త వెలుగులు నింపకపోగా కూటమి ప్రభుత్వం 1 కోటి 40 లక్షల కుటుంబాల జీవితాలలో కారు చీకట్లు నింపుతున్నారు.సబ్సిడీ మీద 3 సిలిండర్లు ఇస్తున్నామని గొప్పలు… pic.twitter.com/n44gAeFrCz— Pothina venkata mahesh (@pvmaheshbza) October 31, 2024 -
ఆ పథకం ‘గ్యాసే’నా!
సాక్షి, సిటీబ్యూరో: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ పథకం అర్హులైన నిరుపేద కుటుంబాలకు సైతం అందని ద్రాక్షగానే తయారైంది. ఒక కుటుంబం రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌కు అర్హత సాధించినా.. వంట గ్యాస్ సబ్సిడీ మాత్రం వర్తించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. లబి్ధదారులు కలెక్టరేట్ ప్రజాపాలన కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేసి దరఖాస్తులు సవరించుకున్నప్పటికీ ఫలితం మాత్రం దక్కడం లేదు. ఇటు పౌరసరఫరాల శాఖ కానీ, అటు ఆయిల్ కంపెనీల గ్యాస్ ఏజెన్సీలు కూడా దీనిపై స్పష్టత ఇవ్వడం లేదు. ఫలితంగా నిరుపేదలు నిరాశకు గురవుతూ.. ఎప్పటి మాదిరిగానే బహిరంగ మార్కెట్ ధర చెల్లించి వంట గ్యాస్ సిలిండర్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజాపాలనలో.. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల వర్తింపు కోసం సరిగ్గా తొమ్మిది నెలల క్రితం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించి బీపీఎల్ కుటుంబాలను గుర్తించింది. అన్ని పథకాలకు తెల్లరేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకున్నారు. అర్హత సాధించిన కుటుంబాలకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కు గ్యాస్ సిలిండర్ వర్తింపజేశారు. కానీ, సగానికి పైగా కుటుంబాలు కేవలం ఉచిత విద్యుత్ వర్తింపునకు పరిమితమయ్యాయి. సబ్సిడీ గ్యాస్ మాత్రం అందడం లేదు. ఇదీ పరిస్థితి గ్రేటర్ హైదరాబాద్ అర్బన్ పరిధిలో అధికారికంగా గృహోపయోగ వంటగ్యాస్ కనెక్షన్ కలిగిన కుటుంబాలు 30.18 లక్షలకు పైనే ఉన్నాయి. అందులో 20 శాతం మినహా మిగతా 80 శాతం కుటుంబాలు మ హాలక్ష్మి పథకం కింద రూ. 500కు వంట గ్యాస్ సిలిండర్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. అందులో కనీసం పది శాతం దరఖాస్తుదారులకు కూడా గ్యాస్ సబ్బిడీ వర్తించలేదు. పరిష్కారమేదీ? గృహజ్యోతి, మహాలక్ష్మి పథకాల ఫలాలు వర్తించని కుటుంబాల కోసం దరఖాస్తు సవరణ (ఎడిట్) కోసం కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన సేవా కేంద్రాలు సమస్యకు పరిష్కారం చూపడం లేదు. ఈ కేంద్రాల్లో పథకాలు వర్తించని దరఖాస్తుదారులు రేషన్ కార్డు, ఆధార్ కార్డు గ్యాస్కనెక్షన్ నెంబర్, ఎల్పీజీ కస్టమర్ ఐడీ, మొబైల్ నెంబర్లను సవరించుకునే వెసులుబాటు ఉంది. దీంతో సేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులను సవరించుకుంటున్నా.. సమస్యకు పరిష్కారం లభించడం లేదని నిరుపేదలు వాపోతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి గ్యాస్ సబ్సిడీ వర్తింపజేయాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
వట్టి గ్యాసేనా..
మంజూరైన ఉచిత కనెక్షన్లు 1.20లక్షలు పంపిణీ చేసింది కేవలం 1,866 {పారంభమే కాని దీపం కనెక్షెన్ల పంపిణీ రెగ్యులేటర్లు లేవంటూ చేతులెత్తేసిన ఆయిల్ కంపెనీలు గాల్లో మేడలు కట్టడం..అరచేతిలో వైకుంఠం చూపడం మన నేతలకు వెన్నతో పెట్టిన విద్య. వాస్తవికతను పట్టించుకోకుండా వారు చెప్చే ప్రతీ దానికి తానా తందానా అంటూ తలలూపడం మన అధికారులకు అలవాటు. నేతల హామీలు..అధికారుల ప్రకటనలను నమ్మి మోసపోవడం సామాన్యుల వంతవుతోంది. తాజాగా ఆ కోవకే చేరింది ఉచిత గ్యాస్ కనెక్షన్ల పథకం. నిజంగా ఇదంతా వట్టిగ్యాసే అన్న విషయం మరోసారి సుస్పష్టమవు తోంది. విశాఖపట్నం: సామూహిక సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద డిపాజిట్ లేకుండా గ్యాస్కనెక్షన్లు ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ముందుకొచ్చాయి. గతేడాది డిసెంబర్లో జిల్లాకు లక్షా 20వేల కనెక్షన్లు మంజూరయ్యాయి. ఇంకేముంది ఆ క్రెడిట్ మాదంటే మాదంటూ గొప్పలు చెప్పు కునేందుకు కేంద్ర,రాష్ర్టప్రభుత్వాల పెద్దలు పోటీపడ్డారు. గ్యాస్ కనెక్షన్ లేని నిరుపేదలకు ఈ ఉచిత గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఇందుకోసం పారదర్శకత పేరుతో సామాన్యులకు కనీస అవగాహన లేని ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరణకు అధికారులు శ్రీకారం చుట్టారు. మరొక పక్క మా కార్యకర్తల పరిస్థితి ఏమిటంటూ అధికార టీడీపీ, బీజేపీ నేతలు పోటీపడి మరీ తమ అనుచరులచే దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టించారు. మార్చి31లోగా వీటి పంపిణీ పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికోసం 1,31,518 దరఖాస్తులు ఆన్లైన్లో వచ్చాయి. వీటిలో సుమారు లక్షా 20వేల మందికి అర్హత ఉన్నట్టుగా నిర్ధారించారు. వీరిలో ఏఎస్‌వోలు, సీఎస్డీటీలు అప్రూవ్ చేసిన 75,111(ఏజెన్సీలో 15,735, జీవీఎంసీ, ఇతర మున్సి పాల్టీలతో సహా మిగిలిన గ్రామీణ జిల్లాలో 59,376)లో తొలి విడతగా కనీసం 36,503 మందికి మార్చి31 కల్లా గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేయాలని అధికారులు తలపోశారు. ఆ మేరకు ఆయా గ్యాస్ కంపెనీల వారీగా మంజూరైన జాబితాలను సైతం పంపించారు. కానీ కంపెనీలు మాత్రం కేవలం 1866 కనెక్షన్లను మాత్రమే పంపిణీ చేయగలిగారు. ఏమిటని ఆరా తీస్తే అసలు విషయం తెలిసింది. ఒకేసారి లక్షన్నరకు పైగా గ్యాస్కనెక్షన్లు మంజూరు చేసినా ఆ స్థాయిలో ఒకేసారి రెగ్యులేటర్లు, సిలెండర్లు సరఫరా చేయడం సాధ్యం కాదని ఆయిల్ కంపెనీలు చేతులెత్తేశాయి. ఈవిషయంలో ఇటీవలే విశాఖ, అనకాపల్లి ఎంపీలు జి.హరిబాబు, ఎం.శ్రీనివాసరావులు ఆయిల్ కంపెనీల ప్రతినిధులు,గ్యాస్ డీలర్లతో నిర్వహించిన సమావేశంలో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పంపిణీ చేయలేనప్పుడు అన్ని కనెక్షన్లు ఇచ్చేందుకు ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ఈ విషయాన్ని ఢిల్లీలోనే తెల్చుకుంటామని తీవ్ర స్థాయిలోనే హెచ్చరించారు. ఏది ఏమైనా దశల వారీగా మంజూరు చేస్తామే తప్ప ఒకేసారి సరఫరా చేయడం మా వల్ల కాదని కంపెనీలు తేల్చి చెప్పడంతో లబ్ధిదారులు నిజంగా ఇదంతా వట్టి ‘గ్యాసే’ అంటూ నిట్టూరుస్తున్నారు. ఉచిత కనెక్షన్ల పరిస్థితి ఇలా ఉంటే.. ఇక దీపం కనెక్షన్లు పంపిణీ కూడా వీటికి ఏ మాత్రం తీసిపోని రీతిలోనే ప్రహసనంగా సాగుతోంది. జిల్లాకు తొలుత 25వేల దీపం కనెక్షన్లను మంజూరయ్యాయి. ఆ తర్వాత మరో 9,500 కనెక్షన్లు ఇచ్చారు. ఎంపిక బాధ్యత పేరుకు ఎంపీడీవోలకు అప్పగించినప్పటికీ పెత్తనమంతా జన్మభూమి కమిటీల చేతుల్లో పెట్టారు. మార్చి రెండోవారానికే అధికారులు అర్హులై జాబితాలను సిద్ధం చేసినా అవి మళ్లీ జన్మభూమి కమిటీల ఆమోదం కోసం ఎదురు చూస్తున్నాయి. తమ అనుచరులకు కట్టబెట్టేందుకు ఎమ్మెల్యేల సమక్షంలో తుదిజాబితాలు తయారు చేస్తున్నారని చెబుతున్నారు. రెగ్యులేటర్లు, సిలెండర్ల కొరత ‘దీపం’కు కూడా శాపంగా తయారైంది. ఈ కారణంగానే వీటి ఎంపికలో జాప్యం జరుగుతున్నదని చెబుతున్నారు. -
పేదల కోసం ఉచిత గ్యాస్ పథకం
కొత్తవలస(లక్కవరపుకోట): దారిద్య్ర రేఖ దిగువన ఉన్న కు టుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్ వ ర్తింపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం రూపొందించిందని విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు కె.హరిబాబు తెలి పారు. కొత్తవలస మండలంలో ఆది వారం జరిగిన ఓ కార్యక్రమంలో పా ల్గొన్న ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఈ ఉచిత గ్యాస్ పథకం రా ష్ర్టంలోని 13 జిల్లాల వారికి వర్తిస్తుందని అన్నారు. పథకం ప్రకారం గ్యాస్ కనెక్షన్ పొందేందుకు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నట్లు తెలిపే ధ్రువీకరణ పత్రం, ఆధార్, రేషన్ కార్డు జిరాక్సులు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలను సమీపంలోని గ్యాస్ డీలర్లకు అందించాలని సూచిం చారు. పథకం గురించి గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని స్థానిక ఎమ్మెల్యే లలితకుమారి, టీడీపీ, బీజేపీ నాయకులకు సూచించారు. ఆడపిల్లలను చదివించండి వేములాపల్లి(శృంగవరపుకోట): ఆడపిల్లలను ఉన్నత విద్యావంతుల్ని చేయాలని విశాఖ ఎంపీ హరిబాబు కోరారు. వేములాపల్లి గ్రామంలో ఆదివారం ‘మన విలే జెస్’ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల్లో స్వచ్ఛ భారత్ నిర్వహించాలని, మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. ఐఎస్ఎల్ నిర్మాణానికి రూ.1000ల ఆర్థిక సాయం అందిస్తామని సంస్థ ప్రతినిధులు చేసిన ప్రకటనపై ఎంపీ స్పందిస్తూ ఆర్థిక పరిస్థితి గుర్తించి ఆ మొత్తాన్ని పెంచాలని కోరా రు. గ్రామంలో పన్నెండేళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ జన్‌ధన్‌యోజన ఖాతాలు తెరవాలని అధికారులను కోరారు. గ్యాస్ కనెక్షన్లు లేని వారికి తెల్లరంగు రేషన్‌కార్డు ఉన్నవారికి ప్రభుత్వం పూర్తి ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తుందని ప్రకటించారు. కార్యక్రమంలో ఎస్.కోట నియోజక వర్గ బీజేపీ ఇన్చార్జి రఘురాజు, మన విలేజెస్ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు డా క్టర్ బురిడి నాగభూషణం, డాక్టర్ జి.పద్మ సంపూర్ణ కళ్యాణి, డాక్టర్ జి.కాశీపతిరాజు, తహశీల్దార్ రాములమ్మ, ఎంపీడీఓ గౌరీశంకర్ తదితరులు మాట్లాడారు. అనంతరం సంస్థ సభ్యులు ఏర్పా టు చేసిన దుప్పట్లు, దుస్తులు గ్రామస్తులకు ఎంపీ అందించారు. అనంతరం పలువురు నేతలను సత్కరించారు. ‘ఆంధ్రను అగ్రరాష్ట్రం చేస్తాం’ శృంగవరపుకోట : ఆంధ్ర రాష్ట్రాన్ని అన్నింటా అగ్రగామిగా చేస్తామని విశాఖ ఎంపీ హరిబాబు అన్నారు. ఆదివారం సాయంత్రం స్థానిక గౌరీ సేవా సంఘం కల్యాణ మండపంలో బీజేపీ ఎస్.కోట నియోజకవర్గ ఇన్చార్జ్ రఘురాజు అధ్యక్షతన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హరిబాబు ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వాలను సమీక్షించారు. బీజేపీని అతిపెద్ద పార్టీగా నిలబెట్టేందుకు కృషి చేయాలన్నారు. పోలవరం ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకించినా ప్రధాని భాద్యతీ తీసుకుని క్లియరెన్స్ ఇచ్చారన్నారు. రాష్ట్రానికి ఐఐటీ, ఎ.ఐ.ఎం.ఎస్, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థలు కేటాయించారని తెలిపారు. అలాగే జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తామన్నారు. లక్కవరపుకోటను దత్తత తీసుకుని స్మార్ట్ విలేజ్‌గా అభివృద్ధి చేస్తామని తెలిపారు.