Free hair cutting
-
ఫ్రీ హెయిర్ కటింగ్
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సెలూన్ అనగానే మంగళవారం సెలవు. ఆ రోజు ఎక్కడా షాప్ తెరవరు. ఆ రోజు సెలూన్ నిర్వాహకులందరికీ హాలీడే.. జాలీడే.. కానీ ఇబ్రహీంపటా్ననికి చెందిన రాకేశ్ చేరియాలకు మాత్రం ఆ రోజు అత్యంత బిజీడే.. ఆ రోజున పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ శరణాలయాల్లోని పిల్లలు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు ఉచితంగా కటింగ్ చేస్తున్నాడు. వారికి చేతనైనంత ఆహారం తయారుచేసి వారి కడుపు నింపుతున్నాడు. నలుగురికి సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. డబ్బుతో సంబంధం లేకుండా ఎంతోమందికి కళ్లలో ఆనందం చూడొచ్చు అని నిరూపిస్తున్నాడు. అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది మరికొందరు ఆయన బాటలో నడుస్తున్నారు. దాదాపు 35 మంది ఆయనతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు. ఆ సంఘటనతో కదిలి.. మనం ఎలాంటి పరిసరాల్లో ఉంటే అలాంటి అలవాట్లే వస్తాయంటారు పెద్దలు. ఇంటి ముందు ఓ పెద్దాయన తనకు వచ్చే రేషన్ బియ్యంలో మిగిలినవి సమీపంలోని అంధుల వసతి గృహంలో ఇచ్చేవాడట. ఈ విషయం గమనించిన రాకేశ్.. తాను కూడా ఏదో ఒకవిధంగా వారికి సేవ చేయాలనే ఆలోచన వచి్చంది. అలా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్లగా, అక్కడున్న పిల్లలు తమకు స్టైల్ హెయిర్ కటింగ్ చేయించాలని అడిగారట. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఆ వసతి గృహానికి వెళ్లి అవసరం ఉన్న వారికి కటింగ్ చేస్తున్నాడు.రాకేశ్‌ను చూసి మరో నలుగురు.. రాకేశ్ చేస్తున్న సేవలు చూసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, అరుణ్, శ్రవణ్ అనే నలుగురు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. కొంతకాలానికి ఇంకొందరు వీరితో జాయిన్ అయ్యారు. ఇలా ఇప్పుడు దాదాపు 35 మంది కలిసి పలు అనాథాశ్రమాల్లో పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వారికి కటింగ్ చేయడంతో పాటు వారికి ఆహారం అందజేస్తున్నారు. ఫేస్బుక్, వాట్సాప్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని అవసరమైన వాళ్ల సమాచారం షేర్ చేసుకుంటున్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు అక్కడికి వెళ్లి కటింగ్ చేస్తున్నారు. ఇలా వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్ పేరుతో రాకేశ్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అలాగే తలసేమియా బాధితులకు కూడా అప్పుడప్పుడూ క్యాంపు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.ఉచితంగా హెయిర్ కటింగ్, చేతనైనంత ఆహారం వీ ఫర్ ఆర్ఫన్స్ పేరుతో సేవాభావం చాటుతూ.. -
Lok sabha elections 2024: ఓటేస్తే డిస్కౌంట్... ఫ్రీ హెయిర్ కట్!
ప్రజాస్వామ్యంలో ఓటే వజ్రాయుధం! మన రాత మారాలన్నా, నేతల తలరాతలు మార్చాలన్నా మన చేతుల్లోనే ఉంది. అందుకే ప్రతి ఓటరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ఎన్నికల సంఘం కోడై కూస్తోంది. అయినా కొందరిలో మాత్రం చలనం శూన్యం. అందుకే, ఈ ఓట్ల జాతరలో దుమ్మురేపేందుకు మేము సైతం అంటున్నారు కొందరు ఔత్సాహిక వ్యాపారులు. అటు ఓటింగ్ శాతం, ఇటు తమ వ్యాపారం పెరిగేలా బంపర్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ‘ఓటేసి వేలిపై సిరా చుక్క చూపండి, డిస్కౌంట్ పొందండి’ అంటూ ఓటర్లను ఊరిస్తున్నారు. ఉత్తరాఖండ్ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్ తాజాగా ఆఫర్ ప్రకటించింది. రాష్ట్రంలో 19న శుక్రవారం ఒకే విడతలో లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. పోలింగ్ ముగిసిన తర్వాత నుంచి 20వ తేదీ సాయంత్రం దాకా తమ హోటళ్లు, రెస్టారెంట్లలో ఏం తిన్నా బిల్లులో 20 శాతం డిస్కౌంట్ ఇస్తామని తెలిపింది. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని, వేలిపై సిరా గుర్తు చూపి డిస్కౌంట్ పొందచ్చొని అసోసియేషన్ ప్రెసిడెంట్ సందీప్ సాహ్ని చెబుతున్నారు. శుక్రవారమే రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ జరగనున్న తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లాలో కూడా ఓటేసిన వారికి పోలింగ్ రోజు హోటళ్లు, ఫుడ్ స్టాల్స్, బేకరీలు.. ఇలా ఎక్కడ ఏం తిన్నా 5 శాతం తగ్గింపు లభిస్తుంది. ఓటర్లను ప్రోత్సహించేందుకే ఈ చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ ఎస్.అరుణ్ రాజ్ చెప్పారు. ఇక కాంచీపురం కలెక్టర్ కలైసెల్వి మోహన్ వాటర్ బాటిళ్లపై పోలింగ్ సంబంధ పోస్టర్లను అతికించడం ద్వారా ఓటర్లలో చైతన్యం నింపుతున్నారు. ఏప్రిల్ 26న రెండో విడతలో పోలింగ్ జరిగే మహారాష్ట్రలోని అకోలాకు చెందిన అనంత కౌల్కర్ అదిరిపోయే ఆఫరిచ్చాడు. ఓటేసి సిరా గుర్తు చూపిన వారికి తన సెలూన్లో ఫ్రీగా హెయిర్ కట్ చేస్తాననంటూ షాపు ముందు బోర్డు పెట్టేశాడు. మే 25న ఆరో విడతలో పోలింగ్ జరగనున్న జంషెడ్‌పూర్‌లో కూడా ఓటేసిన వారికి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్, కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు డిస్కౌంట్ ఇచ్చేలా ఈసీ అధికారులు ఒప్పించారు. గత నవంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బైక్ ట్యాక్సీ సంస్థ ర్యాపిడో 2,600 పై చిలుకు పోలింగ్ బూత్‌లకు ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేయడం తెలిసిందే. ఈసారి సార్వత్రిక ఎన్నికలు ఏడు విడతల్లో జూన్ 1 దాకా సుదీర్ఘంగా జరగనున్న నేపథ్యంలో ఆఫర్ల జోరు కూడా పెరిగేలా కనిపిస్తోంది! -
మా బడిలో చేరితే ఉచిత క్షవరం
వరంగల్ జిల్లా ఉప్పుగల్లు ప్రభుత్వ పాఠశాల వినూత్న కార్యక్రమం జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో చేరితే.. మీరు ఇక క్షవరానికి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా క్షవరం చేసే ఆఫర్ ప్రకటించారు ఇక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు. అనుకున్నదే తడవుగా శనివారం పాఠశాలలో చేరిన 15 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణుడు తిప్పారపు రాజుతో క్షవరం చేయించారు. అయితే, తిప్పారపు రాజు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి శని వారం ఉచిత క్షవరం చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదెపాక చిరంజీవి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గాదెపాక భాస్కర్, ప్రధానోపాధ్యాయులు ఎల్. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మండలంలోని తిడుగు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం టీచర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.