మా బడిలో చేరితే ఉచిత క్షవరం | If the free hair cutting our school | Sakshi
Sakshi News home page

మా బడిలో చేరితే ఉచిత క్షవరం

Published Sun, Jun 28 2015 8:21 AM | Last Updated on Sun, Sep 3 2017 4:28 AM

మా బడిలో చేరితే ఉచిత క్షవరం

మా బడిలో చేరితే ఉచిత క్షవరం

వరంగల్ జిల్లా ఉప్పుగల్లు ప్రభుత్వ పాఠశాల వినూత్న కార్యక్రమం
జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో చేరితే.. మీరు ఇక క్షవరానికి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా క్షవరం చేసే ఆఫర్ ప్రకటించారు ఇక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు. అనుకున్నదే తడవుగా శనివారం పాఠశాలలో చేరిన 15 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణుడు తిప్పారపు రాజుతో క్షవరం చేయించారు.

అయితే, తిప్పారపు రాజు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి శని వారం ఉచిత క్షవరం చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదెపాక చిరంజీవి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గాదెపాక భాస్కర్, ప్రధానోపాధ్యాయులు ఎల్. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మండలంలోని తిడుగు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం టీచర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement