innovative program
-
టెంపాలో నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కు విశేష స్పందన
టెంపా: ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం(నాట్స్) ఈ సారి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 'భాషే రమ్యం.. సేవే గమ్యం' అనే నినాదంతో తన సేవాపథంలో భాగంగా టెంపాలో క్యాన్డ్‌ఫుడ్ డ్రైవ్ నిర్వహించింది. అన్నార్థుల ఆకలి తీర్చే లక్ష్యంతో చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌కు స్థానిక తెలుగువారి నుంచి విశేష స్పందన లభించింది. రెండు వారాల సమయంలోనే 1000ఎల్బీల ఫుడ్ క్యాన్స్‌ను తెలుగువారు విరాళంగా అందించారు. విరాళాల రూపంలో సేకరించిన ఫుడ్ క్యాన్స్‌ను స్థానిక ఫీడింగ్ అమెరికా టెంపా డౌన్ టౌన్‌కు నాట్స్ నాయకత్వ బృందం అందించింది. పేదలకు ఉచితంగా ఫీడింగ్ టెంపాబే సంస్థ ఆహారాన్ని అందిస్తుంది. నాట్స్ చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్‌పై ఫీడింగ్ టెంపాబే సంస్థ ప్రశంసల వర్షం కురిపించింది. పేదలకు ఆకలి తీర్చడంలో నాట్స్ కూడా తన వంతు పాత్ర పోషించినందుకు ప్రత్యేక అభినందనలు తెలిపింది. నాట్స్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండ, నాట్స్ జాతీయ నాయకులు ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ టెంపాబే చాప్టర్ కోఆర్డినేటర్ రాజేశ్ కాండ్రులు ఫుడ్ క్యాన్స్‌ను ఫీడింగ్ టెంపాబే సంస్థకు అందించడంతో పాటు అమెరికాలో నాట్స్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించిన శ్రీనివాస్ అచ్చి, శ్రీనివాస్ బైరెడ్డి, సతీశ్ పాలకుర్తి, శ్రీధర్ గౌరవెల్లి, శ్రీనివాస్ మల్లాది, ప్రసాద్ కొసరాజు, సుథీర్ మిక్కిలినేని, రమ కామిశెట్టి తదితరులను నాట్స్ ప్రత్యేకంగా అభినందించింది. -
నెట్వర్క్ మెరుగుకు సమాచారం ఇవ్వండి..
- కాల్ డ్రాప్స్ లేకుండా చేస్తాం... - కస్టమర్లకు ఎయిర్టెల్ ఎండీ గోపాల్ విఠల్ లేఖ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టెలికం రంగ దిగ్గజం ఎయిర్టెల్.. భారత్‌లో తొలిసారిగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కస్టమర్లకు మరింత మెరుగైన, నాణ్యమైన నెట్వర్క్ అందించేందుకు నేరుగా రంగంలోకి దిగింది. కాల్ డ్రాప్స్ సమస్యలు ఉంటే తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఎయిర్టెల్ ఇండియా, సౌత్ ఆసియా ఎండీ, సీఈవో గోపాల్ విఠల్ స్వయంగా కస్టమర్లకు ఈ-మెయిల్ ద్వారా లేఖ పంపారు. ‘నెట్‌వర్క్‌ను మెరుగు పరిచేందుకు ఎయిర్‌టెల్‌కు సహాయం చేయండి. మీకు సహాయం చేసేందుకు కంపెనీకి వీలు కల్పించండి’ అంటూ తన లేఖలో కోరారు. కాగా, కస్టమర్లు లేఖలో ఉన్న లింక్‌పై క్లిక్ చేసి తాము ఉండే ప్రాంతం పేరు నిర్దేశిస్తే చాలు. కంపెనీ సిబ్బంది రంగంలోకి దిగి సమస్యను పరిష్కరిస్తారు. -
మా బడిలో చేరితే ఉచిత క్షవరం
వరంగల్ జిల్లా ఉప్పుగల్లు ప్రభుత్వ పాఠశాల వినూత్న కార్యక్రమం జఫర్‌గఢ్: వరంగల్ జిల్లా జఫర్‌గఢ్ మండలం ఉప్పుగల్లు ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో చేరితే.. మీరు ఇక క్షవరానికి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా క్షవరం చేసే ఆఫర్ ప్రకటించారు ఇక్కడి ఉపాధ్యాయులు, గ్రామస్తులు. అనుకున్నదే తడవుగా శనివారం పాఠశాలలో చేరిన 15 మంది విద్యార్థులకు గ్రామానికి చెందిన నాయీ బ్రాహ్మణుడు తిప్పారపు రాజుతో క్షవరం చేయించారు. అయితే, తిప్పారపు రాజు ఈ పాఠశాలలో చదివే విద్యార్థులకు ప్రతి శని వారం ఉచిత క్షవరం చేస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో సర్పంచ్ గాదెపాక చిరంజీవి, గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్ గాదెపాక భాస్కర్, ప్రధానోపాధ్యాయులు ఎల్. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, మండలంలోని తిడుగు ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం టీచర్లు ఉచిత బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. -
‘మీలో ఎవరు చరిత్ర ఎక్స్పర్ట్’..
‘కౌన్‌బనేగా కరోడ్‌పతి’ మాదిరిగా వినూత్నకార్యక్రమం సాక్షి, ముంబై : బోరివలిలోని వాజే-కేల్కర్ కళాశాలకు చెందిన ఓ ప్రొఫెసర్ విద్యార్థులకు పాఠ్యాంశాల పట్ల ఆసక్తి కలిగించేందుకు ఓ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చరిత్ర విభాగం బోధించే ప్రొఫెసర్ రవి కుమార్ చందుపట్ల తనకున్న పరిజ్ఞానంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కళాశాల విద్యార్థుల కోసం ’కౌన్ బనేగా కరోడ్ పతి’ మాదిరిగానే కాలేజీ ఆడిటోరియంలో ‘మీలో ఎవ్వరు చరిత్ర ఎక్స్పర్ట్’ అనే పేరుతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కాలేజీ ప్రధానాచార్యులు డాక్టర్ బిబి శర్మ ప్రారంభించారు. కాలేజీ ప్రిన్స్‌పల్ విద్యాధర్ జోషి పర్యవేక్షించారు. 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశంలోని ప్రశ్నలను ఆధారంగా నిర్వహించారు. ఓ చిత్రాన్ని చూపించి నాలుగు జవాబులు (ఆప్షన్స్) ఇచ్చారు. జవాబు చెప్పేందుకు 45 సెకన్ల సమయం ఇచ్చారు. విజేతలకు బహుమతులు ఇచ్చారు. విద్యార్థుల మంచి స్పందన లభించింది. ఇక మీదట 11వ తరగతి పుస్తకాలను కేబీసీ మాదిరిగా తయారు చేయాలన్నదే తన ఉద్దేశమని ప్రొఫెసర్ రవికుమార్ చందుపట్ల పేర్కొన్నారు. ఈ పోటీలను పలు కాలేజీలు, పాఠశాలలో ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులల్లో చదువ పట్ల ఆసక్తి పెరుగుతోందని అన్నారు. -
ఆకాశమే హద్దుగా సాక్షి మైత్రి మహిళ
స్త్రీ అంటే ఆకాశంలో సగం అన్న ఆదర్శం మరింత సాకారం చేసి, ఆకాశమే హద్దుగా ఎదిగే ఆత్మవిశ్వాసం ఆమెలో నింపేందుకు సాక్షి చేపట్టిన ఒక విన్నూత్న కార్యక్రమమే సాక్షి మైత్రి మహిళ. మహిళా సాధికారత కాగితాలకే పరిమితం కాకూడదన్న సదాశయంతో, మెరుగైన జీవితాన్ని పొందటానికి ఒక కొత్త నమ్మకాన్ని అందించే ప్రయత్నమే సాక్షి మైత్రి మహిళ. వివిధ రంగాల్లో మహిళల నైపుణ్యాలని వెలికి తీసి, వారి ప్రతిభకి మరింత మెరుగు పెట్టే ప్రయత్నమిది. వేలుపట్టి నడిపించే కార్యక్రమం కాదు, వారి వెన్నంటి ప్రోత్సహించే సౌహార్ద్ర సన్నాహం. మహిళల ప్రతిభని గుర్తించి, వారి ఆకాంక్షలకి అద్దం పట్టి, వారి అభివృద్ధికి దోహదపడే మైత్రిపూర్వకమైన యత్నం. ఇందులో, వంట, హస్త కళలు, వ్యాపారం, వ్యక్తిత్వ వికాసం,స్వయం సహాయక గ్రూపులు... వంటి వివిధ రంగాలకు చెందిన మహిళల సాధికారతను నిజం చేసే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కాలంతో పాటు వడివడిగా స్త్రీ అడుగులు పడేందుకు సాక్షి తన వంతుగా ఈ కార్యక్రమాలని రూపొందించింది. రేపటి సవాళ్లని ఆడవారు మరింత ధైర్యంగా, ఇంకా సమర్థవంతంగా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా సాక్షి మైత్రి మహిళ చేయూతనిస్తుంది. పదహారేళ్లు దాటిన మహిళ ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ దిగువ లింకు ద్వారా ఫారం డౌన్లోడ్ చేసుకొని వారి ఫొటో ఐడెంటిటీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, లేదా రేషన్ కార్డు) జిరాక్స్ జత చేసి సాక్షి కార్యాలయాల్లో నవంబర్ 10 లోపు అందించాల్సి ఉంటుంది. ఫారం డౌన్లోడ్ కోసం క్ల్లిక్ చేయండి.... మరిన్ని వివరాలకు 040 23356138, 040-23256139 నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చు.