వివిధ రంగాల్లో మహిళల నైపుణ్యాలని వెలికి తీసి, వారి ప్రతిభకి మరింత మెరుగు పెట్టే ప్రయత్నమిది. వేలుపట్టి నడిపించే కార్యక్రమం కాదు, వారి వెన్నంటి ప్రోత్సహించే సౌహార్ద్ర సన్నాహం. మహిళల ప్రతిభని గుర్తించి, వారి ఆకాంక్షలకి అద్దం పట్టి, వారి అభివృద్ధికి దోహదపడే మైత్రిపూర్వకమైన యత్నం.
ఇందులో, వంట, హస్త కళలు, వ్యాపారం, వ్యక్తిత్వ వికాసం,స్వయం సహాయక గ్రూపులు... వంటి వివిధ రంగాలకు చెందిన మహిళల సాధికారతను నిజం చేసే ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. కాలంతో పాటు వడివడిగా స్త్రీ అడుగులు పడేందుకు సాక్షి తన వంతుగా ఈ కార్యక్రమాలని రూపొందించింది. రేపటి సవాళ్లని ఆడవారు మరింత ధైర్యంగా, ఇంకా సమర్థవంతంగా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొనేలా సాక్షి మైత్రి మహిళ చేయూతనిస్తుంది.
పదహారేళ్లు దాటిన మహిళ ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఈ దిగువ లింకు ద్వారా ఫారం డౌన్‌లోడ్ చేసుకొని వారి ఫొటో ఐడెంటిటీ కార్డు (ఆధార్, ఓటర్ ఐడీ, లేదా రేషన్ కార్డు) జిరాక్స్ జత చేసి సాక్షి కార్యాలయాల్లో నవంబర్ 10 లోపు అందించాల్సి ఉంటుంది.
మరిన్ని వివరాలకు 040 23356138, 040-23256139 నంబర్ల ద్వారా సమాచారం పొందవచ్చు.