అనాథ పిల్లలకు.. వృద్ధాశ్రమాలకు వెళ్లి సేవలు..
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా సెలూన్ అనగానే మంగళవారం సెలవు. ఆ రోజు ఎక్కడా షాప్ తెరవరు. ఆ రోజు సెలూన్ నిర్వాహకులందరికీ హాలీడే.. జాలీడే.. కానీ ఇబ్రహీంపటా్ననికి చెందిన రాకేశ్ చేరియాలకు మాత్రం ఆ రోజు అత్యంత బిజీడే.. ఆ రోజున పెద్దఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. అనాథ శరణాలయాల్లోని పిల్లలు, వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు ఉచితంగా కటింగ్ చేస్తున్నాడు. వారికి చేతనైనంత ఆహారం తయారుచేసి వారి కడుపు నింపుతున్నాడు. నలుగురికి సాయం చేయాలన్న ఆలోచన ఉంటే చాలు.. డబ్బుతో సంబంధం లేకుండా ఎంతోమందికి కళ్లలో ఆనందం చూడొచ్చు అని నిరూపిస్తున్నాడు. అతడు చేస్తున్న సేవా కార్యక్రమాలతో స్ఫూర్తి పొంది మరికొందరు ఆయన బాటలో నడుస్తున్నారు. దాదాపు 35 మంది ఆయనతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు.
ఆ సంఘటనతో కదిలి..
మనం ఎలాంటి పరిసరాల్లో ఉంటే అలాంటి అలవాట్లే వస్తాయంటారు పెద్దలు. ఇంటి ముందు ఓ పెద్దాయన తనకు వచ్చే రేషన్ బియ్యంలో మిగిలినవి సమీపంలోని అంధుల వసతి గృహంలో ఇచ్చేవాడట. ఈ విషయం గమనించిన రాకేశ్.. తాను కూడా ఏదో ఒకవిధంగా వారికి సేవ చేయాలనే ఆలోచన వచి్చంది. అలా ఒకరోజు ఆ పాఠశాలకు వెళ్లగా, అక్కడున్న పిల్లలు తమకు స్టైల్ హెయిర్ కటింగ్ చేయించాలని అడిగారట. అప్పటి నుంచి ప్రతి మంగళవారం ఆ వసతి గృహానికి వెళ్లి అవసరం ఉన్న వారికి కటింగ్ చేస్తున్నాడు.
రాకేశ్‌ను చూసి మరో నలుగురు..
రాకేశ్ చేస్తున్న సేవలు చూసి ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు దుర్గాప్రసాద్, శ్రీకాంత్, అరుణ్, శ్రవణ్ అనే నలుగురు తోటి స్నేహితులు ముందుకొచ్చారు. కొంతకాలానికి ఇంకొందరు వీరితో జాయిన్ అయ్యారు. ఇలా ఇప్పుడు దాదాపు 35 మంది కలిసి పలు అనాథాశ్రమాల్లో పిల్లలకు, వృద్ధాశ్రమాల్లోని వారికి కటింగ్ చేయడంతో పాటు వారికి ఆహారం అందజేస్తున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో గ్రూపులు ఏర్పాటు చేసుకుని అవసరమైన వాళ్ల సమాచారం షేర్ చేసుకుంటున్నారు. ఎవరు అందుబాటులో ఉంటే వాళ్లు అక్కడికి వెళ్లి కటింగ్ చేస్తున్నారు. ఇలా వీ ఫర్ ఆర్ఫన్స్ ఫౌండేషన్ పేరుతో రాకేశ్ సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు. అలాగే తలసేమియా బాధితులకు కూడా అప్పుడప్పుడూ క్యాంపు ఏర్పాటు చేసి రక్తదానం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు.
ఉచితంగా హెయిర్ కటింగ్, చేతనైనంత ఆహారం
వీ ఫర్ ఆర్ఫన్స్ పేరుతో సేవాభావం చాటుతూ..
Comments
Please login to add a commentAdd a comment