Free heart surgery
-
AB-PMJAY: 70 ఏళ్లు పైబడిన వారందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా
న్యూఢిల్లీ: డెబ్భై ఏళ్లు, ఆ పైబడిన వృద్ధుల ఆరోగ్య సంక్షేమానికి పెద్దపీట వేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదాయంతో నిమిత్తం లేకుండా వృద్ధులందరికీ ఆయుష్మాన్ భారత్ ప్రధాన్‌మంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) కింద రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమాకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ పలు ప్రతిపాదనలను ఆమోదించింది. అర్హులైన లబి్ధదారులకు త్వరలో కొత్త కార్డులు మంజూరు చేయనున్నట్లు తెలిపింది.కుటుంబసభ్యులు ఏబీపీఎంజేఏవై కింద లబ్దిదారులుగా ఉన్నా 70 ఏళ్లు, ఆపై వయసు సీనియర్ సిటిజన్లకు విడిగా ఏటా రూ.5 లక్షల ఆరోగ్యబీమా కల్పించనున్నారు. వృద్ధులు ప్రైవేట్ ఆరోగ్య బీమా పాలసీలు, ఈఎస్ఐ పథకంలో ఉన్నా ఈ పథకం వర్తిస్తుంది. కేంద్రప్రభుత్వ ఆరోగ్య పథకం(సీజీహెచ్ఎస్), మాజీ సైనికుల కంట్రిబ్యూటరీ హెల్త్ స్కీమ్ (ఈసీహెచ్ఎస్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ (సీఏపీఎఫ్) పథకాల లబ్ది పొందుతున్న వాళ్లు మాత్రం వాటినో, ఏబీపీఎంజేఏవైనో ఏదో ఒకదానినే ఎంచుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 4.5 కోట్ల కుటుంబాల్లోని వృద్ధులకు మేలు చేకూరనుంది. ఏబీపీఎంజేఏవై ప్రపంచంలోనే ప్రభుత్వరంగంలో అమలవుతోన్న అతిపెద్ద ఆరోగ్యబీమా పథకమని కేంద్రం తెలిపింది. 12.34 కోట్ల కుటుంబాల్లోని 55 కోట్ల మందికి ఈ పథకం లబ్దిచేకూరుస్తుందని కేంద్రం పేర్కొంది. వయసుతో సంబంధంలేకుండా కుటుంబంలోని అందరికీ ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథం కింద ఇప్పటికే 7.37 కోట్ల మంది ఆస్పత్రిలో వైద్యసేవలు పొందారు. వీరిలో 49 శాతం మంది మహిళలే ఉన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చుచేసింది. తొలినాళ్లలో జనాభాలో దిగువ తరగతి 40 శాతం మంది ఈ పథకాన్ని వినియోగించుకున్నారు. తర్వాత 2022 జనవరిలో లబ్దిదారుల సంఖ్యను 12 కోట్ల కుటుంబాలకు పెంచింది. తర్వాత 37 లక్షల ఆశా/అంగన్వాడీ/ఏడబ్ల్యూహెచ్ఎస్లకూ వర్తింపజేశారు. 31వేల మెగావాట్ల హైడ్రో ప్రాజెక్టులకూ గ్రీన్ సిగ్నల్ రూ.12,461 కోట్ల వ్యయంతో మొత్తంగా 31,350 మెగావాట్ల సామర్థ్యంతో జలవిద్యుత్ ప్రాజెక్టులకూ కేబినెట్ ఓకే చెప్పింది.→ పీఎం గ్రామ్ సడక్ యోజన–4 కింద అదనంగా 62,500 కి.మీ. మేర రోడ్ల నిర్మాణానికి కేబినెట్ సరేనంది. కొత్తగా 25వేల జనావాసాలను కలుపుతూ ఈ రోడ్లను నిర్మించనున్నారు. ఈ మార్గాల్లో వంతెనలనూ ఆధునీకరించనున్నారు. → విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్, పీఎం–ఈబస్ సేవా–పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకాల అమలు కోసం రూ.14,335 కోట్లు కేటాయించేందుకు కేంద్రం అనుమతి ఇచి్చంది. విద్యుత్ ద్విచక్ర, త్రిచక్ర, అంబులెన్స్, ట్రక్కు, ఇతర వాహనాలపై రూ.3,679 కోట్ల మేర సబ్సిడీ ప్రయోజనాలు పౌరులకు కలి్పంచనున్నారు. → ముందస్తు వాతావరణ అంచనా వ్యవస్థలను మరింత బలోపేతం చేయనున్నారు. రెండేళ్లలో రూ.2,000 కోట్ల వ్యయంతో ‘మిషన్ మౌసమ్’ను అమలుచేయనున్నారు. భారత వాతావరణ శాఖతో పాటు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రోపికల్ మెటరాలజీ, నేషనల్ సెంటర్ ఫర్ మీడియం రేంజ్ వెదర్ ఫోర్కాస్టింగ్ విభాగాల ద్వారా ఈ మిషన్‌ను అమలు చేయనున్నారు. -
నిమ్స్‌లో చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
లక్డీకాపూల్: గుండె సమస్యలతో బాధపడే చిన్నారులకు నిమ్స్‌లో ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తెలిపారు. నవజాత శిశువులు మొదలు ఐదేళ్లలోపు చిన్నారుల గుండె వ్యాధులకు చికిత్స అందిస్తామని ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. బ్రిటన్‌లోని ఆల్డర్ హే చిల్డ్రన్స్ హాస్పిటల్ కార్డియాక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ రమణ దన్నపునేని ఆధ్వర్యంలోని 10 మంది సర్జన్ల బృందం నిలోఫర్ సర్జన్లు, నిమ్స్ కార్డియోథొరాసిక్ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు, ఇతర వైద్య బృందంతో కలసి నిమ్స్‌లో ఈ శస్త్రచికిత్సలు చేపట్టనున్నట్లు వివరించారు. ‘హీలింగ్ లిటిల్ హార్ట్స్ చార్లీస్ హార్ట్ హీరోస్ క్యాంప్’లో భాగంగా ఉచిత శస్త్రచికిత్సలు జరగనున్నాయని బీరప్ప పేర్కొన్నారు. తమ చిన్నారులకు ఆపరేషన్లు అవసరమైన తల్లిదండ్రులు మరిన్ని వివరాలకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య 040–23489025 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
సునీల్ గావస్కర్ నయా ఇన్నింగ్స్..
చికాగో: ఇప్పటివరకు క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ప్రముఖ మాజీ క్రికెటర్, పద్మభూషణ్ సునీల్ గావస్కర్.. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. అందులో భాగంగా సెప్టెంబర్ 15న చికాగోలోని బెన్సన్విల్లీ మహాలక్ష్మీ హాల్, మానవ్ సేవా మందిర్‌లో నిర్వహించిన గ్రీట్&మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గావస్కర్ మట్లాడుతూ.. చిన్న పిల్లలకు ఉచిత గుండె ఆపరేషన్లు నిర్వహించడానికి తను హార్ట్టుహార్ట్ ఫౌండేషన్ కృషి చేస్తోందని తెలిపారు. ఈ ఫౌండేషన్ సాయి సంజీవని హాస్పిటల్స్ భాగస్వామ్యంతో ఇప్పటికీ 775 సర్జరీలు చేసిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ ఏడాదిలో 5000, వచ్చే రెండేళ్లలో పదివేల మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో అమెరికా తెలుగు అసోసియేషన్ ప్రతినిధులు, ప్రవాస భారతీయులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించాలని ప్రవాస భారతీయులను గావస్కర్ కోరారు. కాగా, సునీల్ గావస్కర్ వెస్టిండీస్‌పై ఒకే టెస్టు సిరీస్‌లో 774 పరుగులు సాధించారు. దీన్ని 50 సంవత్సరాల తర్వాత తాజాగా ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్‌స్మిత్ యాషెస్ సిరీస్‌లో 774 పరుగులు సాధించి ఆ రికార్డును సమం చేశాడు. అయితే స్మిత్ రికార్డు అందుకున్న రోజే హార్ట్టుహార్ట్ విత్ గావస్కర్ పౌండేషన్ 775 ఉచిత సర్జరీలు పూర్తవడంతో గావస్కర్ తన రికార్డును తానే తిరగరాశాడని పలువురు సరదాగా పేర్కొంటున్నారు. -
గావస్కర్ నయా రికార్డ్!
చికాగో: లిటిల్ మాస్టర్ సునీల్ గావస్కర్ సరికొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇప్పటివరకు క్రికెటర్‌గా, వ్యాఖ్యాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఈ చాంపియన్ ప్లేయర్.. ఇప్పుడు నిరుపేద కుటుంబాలకు చెందిన పిల్లలకు ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఉన్నాడు. దీనిలో భాగంగా హార్ట్ టు హార్ట్ ఫౌండేషన్‌తో చేతులు కలిపాడు. దీనిలో భాగంగా ఇప్పటివరకు 775కు పైగా చిన్నారులకు ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు చేయించాడు. అతిత్వరలోనే హృదయ సంబంధ లోపాలతో జన్మించే వెయ్యి మంది పిల్లలకు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలనే లక్ష్యంతో ఈ ఫౌండేషన్ ఉంది. అంతేకాకుండా ఈ ఏడాదిలో 5000, వచ్చే రెండేళ్లలో పదివేల మంది చిన్నారులకు ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న గావస్కర్.. చికాగోలోని మానవ్ సేవ్ మందిర్‌ను దర్శించాడు. ఈ సందర్భంగా భారత్‌లో నిరుపేద చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించాలని సాయి సంజీవని ఆస్పత్రి యాజమాన్యాన్ని కోరాడు. ఇక తన బ్యాటింగ్ మెరుపులతో గావస్కర్ టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. అందులో ముఖ్యంగా వెస్టిండీస్‌పై టెస్టుల్లో అరంగేట్రం చేసిన గావస్కర్ తన తొలి సిరీస్‌లోనే రెచ్చిపోయాడు. ఏకంగా అరంగేట్రపు టెస్టు సిరీస్‌లో 774 పరుగులు సాధించి అప్పట్లో సంచలనం సృష్టించాడు. అయితే తాజాగా ఆసీస్ మాజీ సారథి స్టీవ్ స్మిత్ యాషెస్ సిరీస్‌లో తన అద్బుత ఫామ్‌తో 774 పరుగులు సాధించి గావస్కర్ సరసన చేరాడు. అయితే స్మిత్ రికార్డు అందుకున్న రోజే హార్ట్ టు హార్ట్ విత్ సునీల్ గావాస్కర్ ఫౌండేషన్ 775 మంది చిన్నారులకు ఆపరేషన్లు పూర్తి చేసింది. దీంతో గావస్కర్ తన రికార్డును తానే బ్రేక్ చేసుకున్నాడని పలువురు ప్రశంసిస్తున్నారు. (చదవండి: పిల్లల ఆపరేషన్లకు ఎన్ఆర్ఐల భారీ విరాళం) -
చిన్నారి గుండెకు భరోసా
లబ్బీపేట(విజయవాడతూర్పు): పుట్టుకతోనే చిల్లుపడిన పసిహృదయాలకు యూకే వైద్యులు ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇక్కడి వైద్యులకు సాధ్యం కానీ అత్యంత క్లిష్టతరమైన కాంప్లెక్స్ సర్జరీలను సైతం విజయవంతంగా నిర్వహిస్తూ చిన్నారులకు పునర్జన్మను ప్రసాదిస్తున్నారు. రెండున్న సంవత్సరాలుగా 13 ప్రత్యేక క్యాంపులు నిర్వహించి 274 మంది చిన్నారులకు ఉచిత శస్త్ర చికిత్సలు నిర్వహించారు. అందులో భాగంగా ఈనెల 18 నుంచి నిర్వహిస్తున్న క్యాంపులో తొమ్మిది మంది ఇంగ్లాండ్‌కు చెందిన వైద్య నిపుణులు పాల్గొని 22 మంది చిన్నారులకు విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ఆంధ్రా హాస్పటల్ పిడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు చెప్పారు. శుక్రవారం ఆంధ్రా హార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆధునిక సదుపాయాలతోనే ఆంధ్రాహాస్పటల్స్లో ఆధునిక సదుపాయాలు అందుబాటులో ఉండటం వల్ల క్లిష్టతరమైన సమస్యలకు సైతం విజయవంతంగా శస్త్ర చికిత్సలు నిర్వహించగలుగుతున్నామని హీలింగ్ లిటిల్ హార్ట్స్ ఫౌండర్ డాక్టర్ సంజీవ్ నిచానీ చెప్పారు. తమ చారిటీ ఆధ్వర్యంలో ప్రపంచ వ్యాప్తంగా వెయ్యి మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, అందులో భాగంగా ఆంధ్రా హాస్పటల్స్‌లో 274 మందికి విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో ఆంధ్రా హాస్పటల్ పిడియాట్రిక్ కార్డియాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ కుడుముల, కార్డియాలజిస్ట్ డాక్టర్ జె శ్రీమన్నారాయణ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ దిలీప్, అనస్థీషియన్ డాక్టర్ రమేష్‌లతోపాటు, యూకే వైద్యులు పాల్గొన్నారు. సాక్షి కథనంతో... మా పాప తేజశ్వినికి ఐదేళ్లు. పుట్టుకతోనే గుండెకు రెండు రంథ్రాలతో పాటు, వాల్వ్‌లు లీకవుతున్నట్లు నిర్ధారించారని వైఎస్సార్ కడప జిల్లా కడపకు చెందిన నరసారెడ్డి చెప్పారు. వైద్యం కోసం ఎక్కడకు వెళ్లినా ఇంకా వయస్సు పెరగాలని చెబుతుండేవారని పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబరు 9న సాక్షిలో ప్రచురితమైన కథనం చూసి ఆంధ్రా హాస్పటల్స్‌లో సంప్రదించామని, ఇప్పుడు తమ పాపకు ఉచితంగా ఆపరేషన్ చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇలా అనేక మంది సాక్షి కథనాలతో తమ పిల్లలకు పునర్జన్మను ప్రసాదించినట్లు పేర్కొన్నారు. -
17మంది చిన్నారులకు ఉచిత గుండె ఆపరేషన్లు
విజయవాడ (కృష్ణా జిల్లా) : విజయవాడలోని ఆంధ్రా హాస్పిటల్స్‌లో వివిధ జిల్లాలకు చెందిన 17 మంది చిన్నారులకు ఉచిత గుండె శస్త్రచికిత్సలు నిర్వహించారు. ప్రముఖ సినీనటి సమంత నేతృత్వం వహిస్తున్న ప్రత్యూష సపోర్టు ట్రస్టు సహకారంతో ఆంధ్రా హాస్పిటల్స్ మదర్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ చారిటీ ఆధ్వర్యంలో యూకేకు చెందిన 11మంది పిల్లల గుండె వైద్యుల బృందం ఈ శస్త్రచికిత్సలు చేసింది. నవంబరు 29 నుంచి ప్రారంభమైన ఉచిత శస్త్రచికిత్సల శిబిరం శుక్రవారం వరకు కొనసాగింది. వీరందరికీ పుట్టుకతోనే సమస్య ఉందని వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆంధ్రా హాస్పటల్స్ మేనేజింగ్ డెరైక్టర్ డాక్టర్ పీవీ రమణమూర్తి, పీడియాట్రిక్ చీఫ్ డాక్టర్ పీవీ రామారావు, ఇంగ్లాండ్ వైద్య బృందంలోని డాక్టర్లు సంజీవ్, విక్రమ్, రమణ తదితరులు పాల్గొన్నారు.