Freedom brand
-
నెంబర్‌వన్ బ్రాండ్‌గా ఫ్రీడమ్ రిఫైండ్
హైదరాబాద్: సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగం అమ్మకాల్లో ‘ఫ్రీడమ్’ రిఫైండ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ దేశంలోనే అగ్రగామి బ్రాండ్‌గా నిలిచింది. రాజీలేని నాణ్యత, ఉత్పత్తిలో స్థిరత్వం, విస్తృతస్థాయి పంపిణీ నెట్వర్క్, ఫ్రీడమ్ బ్రాండ్ల పట్ల కస్టమర్లకు ఉన్న నమ్మకంతోనే ఈ ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. ‘‘సన్‌ఫ్లవర్ ఆయిల్ విభాగపు మార్కెట్లో 20.5శాతం వాటాను సొంతం చేసుకొని దేశంలోనే నెంబర్ వన్ బ్రాండ్‌గా నిలువడం సంతోషంగా ఉంది’’ అని జెమినీ ఎడిబుల్స్ అండ్ ఫ్యాట్స్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రదీప్ చౌదరి తెలిపారు. రాబోయే ఐదేళ్లలో ఫ్రీడమ్ బ్రాండ్‌ను దేశమంతా విస్తరించేందుకు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. గత దశాబ్ద కాలంగా కస్టమర్లు చూపుతున్న విశ్వాసం, అందిస్తున్న మద్దతు, ప్రోత్సాహానికి ఆయిల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, సేల్స్ అండ్ మార్కెటింగ్ శ్రీ పీ చంద్రశేఖర రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. -
తెలంగాణలో జెమిని ఎడిబుల్స్ రిఫైనరీ
తొలి దశలో 100 కోట్ల పెట్టుబడి ⇒ డిసెంబరుకి ఉత్పత్తి ప్రారంభం ⇒ కంపెనీ ఎండీ ప్రదీప్ చౌదరి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడమ్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) తెలంగాణలో రిఫైనరీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం 30 ఎకరాల స్థలం కావాలంటూ తెలంగాణ ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకుంది. అనుమతులు రాగానే 9 నెలల్లో ప్లాంటు నిర్మాణం పూర్తి చేయాలని కృతనిశ్చయంతో ఉన్నట్టు జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సానుకూలంగా ఉందని, త్వరలోనే తీపి కబురు వస్తుందని వివరించారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు, విద్యుత్ సరఫరా సమస్యలు లేకపోవడం, మార్కెట్ అవకాశాల దృష్ట్యా ప్లాంటును ఇక్కడ నెలకొల్పుతున్నట్టు పేర్కొన్నారు. హైదరాబాద్ సమీపంలో నెలకు 10,000 టన్నుల సామర్థ్యంతో ఇది రానుందని పేర్కొన్నారు. తొలి దశలో రూ.100 కోట్ల పెట్టుబడి పెడతామని వెల్లడించారు. ప్లాంటు అందుబాటులోకి వస్తే 600 మందికి కొత్తగా ఉపాధి లభిస్తుందని చెప్పారు. మార్కెట్‌కు దగ్గరగా.. ప్రస్తుతం జెఫ్‌కు ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. విదేశాల నుంచి ముడి నూనెలు దిగుమతి చేసుకుని శుద్ధి చేయడానికి వీలుగా వీటిని తీర ప్రాంతంలో నెలకొల్పింది. అయితే కంపెనీకి మార్కెట్ పరంగా తెలంగాణలో ప్లాంటు అనువైనదని భావిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె అమ్మకాల్లో ఫ్రీడమ్ బ్రాండ్ తెలంగాణలో 35 శాతం వాటాతో టాప్–1గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 50 శాతం, ఒరిస్సాలో 50 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. కొత్త ప్లాంటులో సన్‌ఫ్లవర్‌తోపాటు ఇతర నూనెల శుద్ధి, ప్యాకింగ్ చేస్తారు. ఇక రైస్ బ్రాన్ ఆయిల్ అమ్మకాలు ఈ రాష్ట్రాల్లో వేగం పుంజుకుంటున్నాయి. అలాగే తెలంగాణలో ముడి సరుకు లభ్యత ఎక్కువే. అందుకే రిఫైనరీ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు ప్రదీప్ చౌదరి వెల్లడించారు. ఆరోగ్య కారణాలరీత్యా రైస్ బ్రాన్, సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం భవిష్యత్తులో గణనీయంగా ఉంటుందని అన్నారు. లక్ష్యం 20 శాతం వృద్ధి..: జెమిని ఎడిబుల్స్ 2016–17లో రూ.3,500 కోట్ల టర్నోవర్ అంచనా వేస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా చేసుకుంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ విక్రయాల్లో దేశంలో నంబర్–2 స్థానంలో నిలిచామని జెఫ్ సేల్స్, మార్కెటింగ్ వైస్ ప్రెసిడెంట్ పి.చంద్రశేఖర రెడ్డి తెలిపారు. మార్కెట్లో కొన్ని నెలల వరకు వంట నూనెల ధరలు స్థిరంగా ఉంటాయని వివరించారు. కస్టమర్లు బ్రాండెడ్ ఆయిల్స్ వైపుకు మళ్లుతున్నారని చెప్పారు. -
కొత్త విభాగాల్లోకి జెమిని ఎడిబుల్స్
ఏడాదిలో రెడీ టు ఈట్, స్పైసెస్ 2016లో కొత్తగా మరో రిఫైనరీ ‘సాక్షి’తో కంపెనీ ఎండీ {పదీప్ చౌదరి వ్యాఖ్య... హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడమ్ బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) ఆహారోత్పత్తుల విభాగంలోకి ప్రవేశిస్తోంది. రెడీ టు ఈట్, మసాలా దినుసులు, బేకరీ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురావాలని చూస్తోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనెల మార్కెట్లో జెఫ్ నంబర్ వన్ స్థానంలో ఉంది. అలాగే ఆహారోత్పత్తులు, బేకరీ, బిస్కట్స్, చాకొలేట్ తయారీ సంస్థలకు నూనెలు, ఫ్యాట్స్ కూడా కంపెనీ సరఫరా చేస్తోంది. నూతన విభాగాల్లోనూ విజయవంతం కావడానికి బ్రాండ్ ఇమేజ్ దోహదం చేస్తుందని విశ్వసిస్తున్నట్టు జెఫ్ వ్యవస్థాపకుడు, ఎండీ ప్రదీప్ చౌదరి చెప్పారు. ఆసియాలో వంట నూనెల రంగంలో ఇచ్చే ప్రతిష్టాత్మక గ్లోబ్ ఆయిల్ ఇండియా-2015 మ్యాన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు అందుకున్న సందర్భంగా ఆయన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ఏడాదిలోగా కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెస్తామన్నారు. వివిధ అంశాలపై ఆయనేమన్నారంటే... బ్లెండెడ్ ఆయిల్స్‌లోకి... ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌తో సన్‌ఫ్లవర్, సోయా నూనె... ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌తో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఈ నెల్లోనే రైస్ బ్రాన్ ఆయిల్‌ను మార్కెట్లోకి తేబోతున్నాం. అలాగే బ్లెండెడ్ ఆయిల్స్‌లోకి నవంబరులో అడుగుపెడుతున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సాలో కలిపి నెలకు 10,000 టన్నుల సన్‌ఫ్లవర్ నూనె విక్రయిస్తున్నాం. కర్ణాటకలో పెద్ద ఎత్తున విస్తరించాలని చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ నెలకు 500 టన్నుల నూనె విక్రయిస్తున్నాం. దీన్ని ఏడాదిలో 1,500 టన్నులకు చేర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. జెఫ్‌లో మెజారిటీ వాటాను ఇండోనేసియాకు చెందిన అంతర్జాతీయ వ్యవసాయ దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్‌కు విక్రయించాం. మరో రిఫైనరీ... ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణపట్నం, కాకినాడ వద్ద కంపెనీకి రిఫైనరీలున్నాయి. రెండు ప్లాంట్ల సామర్థ్యం రోజుకు 1,150 టన్నులుంది. ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తున్నందున మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌లోని ఏదైనా పోర్టు సమీపంలో మరో రిఫైనరీని రూ.250 కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ఏడాదిన్నరలో ఈ కొత్త రిఫైనరీని ఏర్పాటు చేస్తాం. 2014-15లో కంపెనీ రూ.1,800 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,500 కోట్లు లక్ష్యంగా చేసుకున్నాం. వంట నూనెల పరిశ్రమ ఏటా 5 శాతం వృద్ధి చెందుతోంది. మేమైతే 20 శాతం వృద్ధి నమోదు చేస్తున్నాం. వచ్చే మూడేళ్లూ ఈ వృద్ధిని కొనసాగిస్తామనే విశ్వాసం ఉంది. దేశంలో ఈ రంగంలో జెఫ్ టాప్-4 స్థానంలో ఉంది. కర్ణాటక మార్కెట్లో పట్టు సాధిస్తే టాప్-3 స్థానానికి చేరుకుంటాం. -
రెండేళ్లలో దేశవ్యాప్తంగా ‘ఫ్రీడం’ ఆయిల్
సాక్షి ఇంటర్వ్యూ ⇒ జెమిని ఎడిబుల్స్ ఎండీ ప్రదీప్ చౌదరి ⇒ త్వరలో మార్కెట్లోకి రైస్ బ్రాన్ ఆయిల్ ⇒ ప్లాంట్ల ఆధునీకరణకు రూ. 35 కోట్లు ⇒ పశ్చిమ తీరంలో రూ. 250 కోట్లతో రిఫైనరీ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఫ్రీడం బ్రాండ్‌తో వంట నూనెల తయారీలో ఉన్న జెమిని ఎడిబుల్స్, ఫ్యాట్స్ ఇండియా (జెఫ్) దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో తొలి స్థానం కైవసం చేసుకున్న ఈ సంస్థ.. ఇప్పుడుఛత్తీస్గఢ్, కర్ణాటక, తమిళనాడు మార్కెట్‌పై దృష్టిసారించింది. ఫ్రీడ ంను రెండేళ్లలో దేశవ్యాప్త బ్రాండ్‌గా తీర్చిదిద్దుతామని అంటున్నారు జెఫ్ వ్యవస్థాపకులు, ఎండీ ప్రదీప్ చౌదరి. జెఫ్‌లో అంతర్జాతీయ అగ్రి దిగ్గజం గోల్డెన్ అగ్రి రిసోర్సెస్ వాటా కైవసం చేసుకోవడం బూస్ట్‌నిచ్చిందని సాక్షి బిజినెస్ బ్యూరోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. 2016-17లో రూ.2,000 కోట్ల టర్నోవర్‌కు చేరతామన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కంపెనీ విస్తరణ, మార్కెట్ తీరుతెన్నులపై ఆయనేమన్నారంటే.. మూడు నెలల్లో రైస్బ్రాన్లోకి.. ప్రస్తుతం ఫ్రీడం బ్రాండ్‌లో సన్‌ఫ్లవర్, సోయాబీన్ నూనెను, అలాగే ఫస్ట్ క్లాస్ బ్రాండ్‌లో పామోలిన్, వనస్పతి విక్రయిస్తున్నాం. ఆహార పదార్థాల తయారీ కంపెనీలకు వీటితోపాటు ఇతర నూనెలు, కొవ్వులను సరఫరా చేస్తున్నాం. మే నెలలో రైస్‌బ్రాన్ ఆయిల్‌ను ప్యాకేజ్డ్ విభాగంలోకి తీసుకొస్తున్నాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ప్యాకేజ్డ్ సన్‌ఫ్లవర్ నూనె నెలకు 25-30 వేల టన్నులు అమ్ముడవుతోంది. ఇందులో ఫ్రీడంకు 27 శాతం వాటా ఉంది. మూడేళ్లలో 35 శాతం లక్ష్యంగా చేసుకున్నాం. ఒడిశాలో 31 శాతం వాటా చేజిక్కించుకున్నాం. నెలకు 30 వేల టన్నులు అమ్ముడవుతున్న కర్ణాటకలో 2017కల్లా 20 శాతం వాటా దక్కించుకుంటాం. అంతర్జాతీయ సంస్థ.. జెఫ్‌లో రుచి సోయా ఇండస్ట్రీస్‌కు ఉన్న 50 శాతం, ప్రమోటర్ల నుంచి 25 శాతం వాటాను ఇండోనేసియాకు చెందిన గోల్డెన్ అగ్రి సుమారు రూ.140 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసింది. పామాయిల్ తోటలు, రిఫైనరీలతో అంతర్జాతీయంగా పేరున్న గోల్డెన్ అగ్రి టర్నోవర్ రూ.60,000 కోట్లకుపైనే. వారి చేరికతో మార్కెట్ పరంగా, ఆర్థికంగా, టెక్నాలజీ పరంగా జెఫ్‌కు బలం చేకూరింది. పెద్ద ఎత్తున వృద్ధి చెందాలన్న లక్ష్యంతో భారత్‌లో ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు గోల్డెన్ అగ్రి సుముఖంగా ఉంది. మరో రిఫైనరీ.. కంపెనీకి కృష్ణపట్నం, కాకినాడ వద్ద రిఫైనరీలు ఉన్నాయి. కృష్ణపట్నం ప్లాంటు సామర్థ్యం రోజుకు 900 టన్నులు, కాకినాడ ప్లాంటు 250 టన్నులుంది. రెండు రిఫైనరీలకు ఇప్పటికే రూ.155 కోట్లు ఖర్చు చేశాం. వీటిని ఆధునీకరించేందుకు రూ.35 కోట్లు వెచ్చిస్తున్నాం. పశ్చిమ తీరంలో రూ.250 కోట్లతో రిఫైనరీని ఏర్పాటు చేస్తున్నాం. ఇందుకు మహారాష్ట్ర లేదా గుజరాత్‌ను పరిశీలిస్తున్నాం. ఆరు నెలల్లో స్పష్టత వస్తుంది. 2013-14లో జెఫ్ రూ.1,455 కోట్ల టర్నోవర్ నమోదు చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1,600 కోట్లు ఆశిస్తున్నాం. ఐదేళ్లలో 100 శాతం.. భారత్‌లో వంట నూనెల వినియోగం ఏటా 1.6 కోట్ల టన్నులుంది. ప్యాకేజ్డ్ విభాగం 20 శాతం వృద్ధితో 55-60 శాతానికి చేరింది. బ్రాండెడ్ నూనెలపట్ల కస్టమర్లలో అవగాహన పెరుగుతుండడంతో ఐదేళ్లలో ఈ విభాగం 100 శాతానికి చేరడం ఖాయం. ఇక నూనెల వినియోగం చూస్తే ప్రపంచ సగటు 21-22 కిలోలుంది. భారత్‌లో ఇది 15 కిలోలు మాత్రమే. 10 ఏళ్ల తర్వాత ప్రపంచ సగటును మించిపోవడం ఖాయం. ఆదాయాల పెరుగుదల, మారుతున్న ఆహారపుటలవాట్లు ఇందుకు కారణం.