నెక్లెస్‌రోడ్డులో ‘ఫ్రీడం వాక్’
హైదరాబాద్: రెయిన్బో హోమ్స్ ఆధ్వర్యంలో బాలికలను సంరక్షించాలంటూ ఫ్రీడం వాక్ నిర్వహించారు. నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజా దగ్గర శనివారం ఉదయం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెయిన్బో హోమ్స్ సంస్థ చిన్నారుల విద్య కోసం దేశవ్యాప్తంగా చేస్తున్న సేవలను కొనియాడారు.
హైదరాబాద్ ఇంఛార్జ్ కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ కాలకృత్యాలకు ఆరుబయటకు వెళ్లకుండా మరుగుదొడ్లను వినియోగించుకోవాలన్నారు. రుబెల్లా వ్యాధి టీకాలను త్వరలో అన్ని విద్యాసంస్థలకు అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా 70 మీటర్ల పొడవైన జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు.