friendly cricket match
-
స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్‌లో... రాజ్యసభపై లోక్‌సభ విజయం
న్యూఢిల్లీ: పార్లమెంట్లో పరస్పరం వాగ్వాదానికి దిగే ఎంపీలు ఆదివారం ఉల్లాసంగా గడిపారు. పరస్పరం పోటీపడ్డారు. కానీ, పార్లమెంట్ లోపల కాదు, బయట మాత్రమే. క్షయవ్యాధి (టీబీ)పై అవగాహన పెంచడానికి లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల మధ్య స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. ఢిల్లీలోని మేజర్ ధ్యాన్‌చంద్ నేషనల్ స్టేడియంలో జరిగిన టీ20 మ్యాచ్‌లో రాజ్యసభ చైర్మన్ ఎలెవన్ జట్టుపై లోక్‌సభ స్పీకర్ ఎలెవన్ విజయం సాధించింది. రాజ్యసభ జట్టుకు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు, లోక్‌సభ టీమ్‌కు కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ కెపె్టన్లుగా వ్యవహరించారు. పక్కా ప్రొఫెషనల్స్‌ను తలపిస్తూ ఇరు జట్లూ హోరాహోరీగా తలపడటం విశేషం. తొలుత బ్యాటింగ్ చేసిన లోక్‌సభ ఎలెవన్ ఏడు వికెట్ల నష్టానికి ఏకంగా 250 పరుగులు సాధించింది. కెపె్టన్ ఠాకూర్ సెంచరీ (111 పరుగులు) చేయడం విశేషం. లక్ష్యఛేదనలో రాజ్యసభ ఎలెవన్ 8 వికెట్ల నష్టానికి 178 పరుగులు మాత్రమే చేయగలిగింది. రాజ్యసభ జట్టు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెపె్టన్ మహమ్మద్ అజారుద్దీన్ 42 బంతుల్లో 74 పరుగులు సాధించారు. ఆయనతో పాటు హర్బజన్‌సింగ్, యూసుఫ్ పఠాన్ రూపంలో మ్యాచ్‌లో ముగ్గురు మాజీ ఇండియా ఆటగాళ్లు తలపడటం విశేషం. లోక్‌సభ సభ్యులు దీపేందర్ హుడా(కాంగ్రెస్)కు బెస్ట్ బౌలర్, నిషికాంత్ దూబే(బీజేపీ)కి బెస్టు ఫీల్డర్ అవార్డులు లభించాయి. బీజేపీ ఎంపీ మనోజ్ తివారీకి సూపర్ క్యాచ్ అవార్డు దక్కింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవార్డులను ప్రదానం చేశారు. అంతకుముందు మ్యాచ్ ఆరంభించిన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాసేపు సరదాగా బ్యాట్ పట్టి అలరించారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, శర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా, మన్సుఖ్ మాండవీయ, గజేంద్రసింగ్ షెకావత్, సురేశ్ గోపీ, చిరాగ్ పాశ్వాన్, ఎంపీలు రాఘవ్ చద్దా (ఆప్), డెరెక్ ఓబ్రియాన్ (టీఎంసీ) తదితరులు మ్యాచ్‌లో పాల్గొన్నారు. -
3 ఫోర్లు.. 18 పరుగులు!
సిద్దిపేట ఎడ్యుకేషన్: మంత్రి హరీశ్‌రావు క్రికెట్ బ్యాట్ పట్టి సిద్దిపేట వాసులను అలరించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి టీ–20 ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. సిద్దిపేట– హైదరాబాద్ క్రీడాకారుల మధ్య ఈ పోటీ కొనసాగింది. సిద్దిపేట జిల్లా జట్టుకు మంత్రి హరీశ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హైదరాబాద్ మెడికవర్ డాక్టర్స్ జట్టుకు డాక్టర్ కృష్ణకిరణ్ సారథ్యం వహించారు. ఇక టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకోవడంతో హరీశ్‌రావు నేతృత్వంలోని సిద్దిపేట జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హరీశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో హరీశ్‌రావు జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది.(చదవండి: పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం
జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మణ్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పోలీస్ జట్టు విజయం రన్నరప్‌గా రెవెన్యూ జట్టు వరంగల్æ: విధి నిర్వహణలో ఉద్యోగులకు ఎదురయ్యే ఒత్తిళ్లు అధిగమించడంతో పాటు మానసిక ప్రశాంతతకు క్రీడలు దోహదం చేస్తాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్షణ్ అన్నారు. హన్మకొండలోని పోలీసు పరేడ్ గ్రౌండ్లో మం గళవారం జరిగిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ – జిల్లా రెవెన్యూశాఖల మధ్య జరిగిన ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సం దర్భంగా ఆయన కొద్ది సేపు బ్యాటింగ్, బౌ లింగ్ చేశారు. కమిషనరేట్ జట్టుకు సీపీ సుధీర్‌బాబు, రెవెన్యూ జట్టుకు జేసీ ప్రశాంత్ జీవన్ పాటిల్ నాయకత్వం వహించారు. టాస్ గెలిచి పోలీస్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. మెుదట బ్యాటింగ్ చేసిన రెవెన్యూ జట్టు నిర్ణీత 16 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేసింది. బౌలింగ్‌లో కమిషనర్ సుధీర్‌బాబు వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ చేసిన పోలీస్ జట్టు 15.5 ఓవర్లలో 119 పరుగులు చేసి రెవెన్యూ జట్టుపై విజయం సాధించింది. ఆఖరు ఓవర్లో మెుత్తం ఏడు పరుగులు చేయాల్సి ఉంది. ఆఖరు బాల్‌కు ఆరు పరుగులు కావాల్సి ఉండగా కోర్ టీం కానిస్టేబుల్ ఖాలిద్ సిక్సర్ కొట్టడంతో విజయం సాధించారు. ఖాలిద్ 76 పరుగులు చే సి కమిషనరేట్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అనంతరం పోలీస్ కమిషనరేట్, ఎలక్ట్రానిక్ మీడియా జట్ల మధ్య మరో ఫ్రెండ్లీ మ్యాచ్ జరిగింది. ఇందులో పోలీస్ జట్టు మీడియా జట్టుపై విజయం సాధించింది. కార్యక్రమంలో ఏసీపీలు మహేందర్, శోభన్‌కుమార్, జనార్ధన్, సురేంద్రనాథ్, ఈశ్వర్రావు, రవీందర్రావు, తహశీల్దార్లు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు గడ్డం కేశవమూర్తిలు పాల్గొన్నారు.