
సిద్దిపేట ఎడ్యుకేషన్: మంత్రి హరీశ్‌రావు క్రికెట్ బ్యాట్ పట్టి సిద్దిపేట వాసులను అలరించారు. జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బుధవారం రాత్రి టీ–20 ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. సిద్దిపేట– హైదరాబాద్ క్రీడాకారుల మధ్య ఈ పోటీ కొనసాగింది. సిద్దిపేట జిల్లా జట్టుకు మంత్రి హరీశ్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. హైదరాబాద్ మెడికవర్ డాక్టర్స్ జట్టుకు డాక్టర్ కృష్ణకిరణ్ సారథ్యం వహించారు.
ఇక టాస్ గెలిచిన హైదరాబాద్ జట్టు బౌలింగ్‌ను ఎంచుకోవడంతో హరీశ్‌రావు నేతృత్వంలోని సిద్దిపేట జట్టు బ్యాటింగ్‌కు దిగింది. హరీశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన మంత్రి 12 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసి ప్రేక్షకులను అలరించి వెనుదిరిగారు. ఈ మ్యాచ్‌లో హరీశ్‌రావు జట్టు 16 పరుగుల తేడాతో గెలిచింది.(చదవండి: పాండ్యా మెరుపులతో... బుమ్రా మలుపుతో...)
Comments
Please login to add a commentAdd a comment