యుద్ధ నౌకలో ఏటీఎం
న్యూఢిల్లీ: భారత అతిపెద్ద యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం తొలిసారిగా ఏటీఎం సేవలు ప్రారంభించారు. ఎస్బీఐ నిర్వహించే ఈ ఏటీఎం సేవలను నౌకలో విధులు నిర్వర్తిస్తున్న సుమారు 15 వందల మందికి పైగా సిబ్బంది, అధికారులు వినియోగించుకుంటారు.
నగదు ఉపసంహరణ, బదిలీ, క్రెడిట్ కార్డు చెల్లింపులు తదితర సేవలు ఈ ఏటీఎంలో అందుబాటులో ఉన్నాయని సమీప భవిష్యత్తులో దీన్ని నగదు డిపాజిట్ మెషీన్గా కూడా తీర్చిదిద్దుతామని ఓ అధికారి తెలిపారు. అలాగే నగదురహిత లావాదేవీలకు ప్రోత్సాహించే దిశగా రాబోయే రోజుల్లో ఈ యుద్ధ నౌకలో పీఓఎస్ను కూడా నెలకొల్పుతామని చెప్పారు.