టీపీఏడీ ఆధ్వర్యంలో రక్తదానానికి విశేష స్పందన
డల్లాస్:
తెలంగాణ పీపుల్స్ అసోసియేషన్ ఆఫ్ డల్లాస్(టీపీఏడీ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. 'బ్లడ్ డ్రైవ్- లైఫ్ సేవింగ్' నినాదంతో టీపీఏడీ మూడో ఏడాది రక్తదాన శిబిరాన్ని డల్లాస్లోని ఫ్రిస్కోలో ఏర్పాటు చేసింది. కార్టల్ బ్లడ్ కేర్, వైబ్రంట్ డల్లాస్ ఫోర్ట్ వర్త్ కమ్యూనిటీలతో కలిసి టీపీఏడీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది.
200 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి రిజిస్టర్ చేసుకున్నా, పరిధిదాటడంతో 100 మంది దాతల నుంచి రక్తాన్ని సేకరించారు. సమాజానికి ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే ముఖ్య ఉద్దేశ్యంతో టీపీఏడీ ఈ రక్తదాన కార్యక్రమాన్ని చేపట్టింది. 2016లో నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తంతో 78 మంది ప్రాణాలు కాపాడగలిగింది. ఈ ఏడాదిలో మే 13న వనభోజనాలు, జూలై 8న ఫుడ్ డ్రైవ్, సెప్టెంబర్ 23న బతుకమ్మ, దసరా సంబరాలు, నవంబర్11న షామ్-ఈ-మెహ్ఫిల్ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడానికి టీపీఏడీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
టీపీఏడీ ప్రెసిడెంట్ కరణ్ పోరెడ్డి, సెక్రటరీ రమణ లష్కర్, చంద్ర పోలీస్, లింగారెడ్డి అల్వ, రవికాంత్ మామిడి, టీపీఏడీలో ఫౌండేషన్ కమిటీ అధ్యక్షులు ఉపేందర్ తెలుగు, వైస్ ఛైర్మన్ మహేందర్ కామిరెడ్డి, అజయ్ రెడ్డి, రావు కల్వల, రఘువీర్ బండారు, జానకి రామ్ మందాడి, రాజ్వర్ధన్ గోందీ, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఛైర్మన్ అశోక్ కొండాల, బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వైస్ ఛైర్మన్ మనోహర్ కోసాగ్ని, మాధవి సుంకిరెడ్డి(కో ఆర్డినేటర్), రామ్ అన్నాడీ, గంగదేవర, పవన్ గంగాధరా, ప్రవీణ్ బిల్ల, రాజేందర్ తొడిగాల, ఇంద్రాణి పంచార్పుల, శ్రీనివాస్ వేముల, శ్రీని దర, సత్య పెర్కారి, సతీష్ జనుంపల్లి, సురేందర్ చింతల, రోజా ఆడెపు, రూపాకన్నయ్యగరి, శరత్ యెర్రం, టీపీఏడీ సలహాదారులు వేణు భాగ్యనగర్, విక్రం జనగం, నరేష్ సుంకిరెడ్డి, రవి శంకర్ పటేల్, జయ తెలకలపల్లి, సంతోష్ కోరె, అర్వింద్ ముప్పిడి, మాధవి లోకిరెడ్డి, సతీష్ నాగిల్లలు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో తమవంతుగా కృషి చేశారు.