94 కిలోల గంజాయి స్వాధీనం
నర్సీపట్నం: చింతపల్లి నుంచి మైదాన ప్రాంతానికి తరలిస్తున్న 94 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని, నలుగుర్ని అరెస్ట్ చేసినట్టు పట్టణ సీఐ ఆర్.వి.ఆర్.కె.చౌదరి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.
మంగళవారం ఉదయం పట్టణ పొలిమేరలోని డిగ్రీ కళాశాల సమీపంలో వాహనాల తనిఖీ చేస్తుండగా చింతపల్లి వైపు నుంచి వస్తున్న కారులో గంజాయి ప్యాకెట్లను పోలీసులు గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న హైదరాబాద్కు చెందిన కాపోలు జగదీష్ , మణి రవి, గడ్డం గణేష్, మదిపల్లి సందీప్రెడ్డిను అరెస్టు చేశారు. గంజాయిని స్వా«ధీనం చేసుకుని, కారును సీజ్ చేశామని, గంజాయి విలువ రూ.సుమారు 3 లక్షలుంటుందని సీఐ చెప్పారు. నిందితులను కోర్టులో హాజరు పరిచినట్టు ఆయన తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్ఐ గోవిందరావు, సిబ్బంది పాల్గొన్నారు.