Fuji Film
-
విజయా డయాగ్నొస్టిక్స్ విస్తరణ ప్రణాళిక
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వైద్యపరీక్షల సేవల సంస్థ విజయా డయాగ్నొస్టిక్స్ ఏటా 8–10 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మొత్తం 140 పైచిలుకు డయాగ్నొస్టిక్ సెంటర్స్ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా ఉన్నాయి. తమ డయాగ్నొస్టిక్ కేంద్రంలో ఫ్యూజిఫిల్్మకి చెందిన అధునాతన ఓపెన్ ఎంఆర్ఐ మెషీన్‌ను ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సంస్థ సీవోవో శేషాద్రి వాసన్ ఈ విషయాలు తెలిపారు. క్లోజ్డ్గా ఉండే ఎంఆర్ఐతో పోలిస్తే ఓపెన్‌గా ఉండే అపెర్టో లూసెంట్ మెషీన్.. పేషంట్లలో ఆదుర్దాను తగ్గించగలిగేలా ఉంటుందని ఫ్యూజి ఫిల్మ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (హెల్త్‌కేర్ విభాగం) చందర్ శేఖర్ సిబాల్ తెలిపారు. వచ్చే రెండేళ్లలో భారత్‌లోనూ తయారీ, అభివృద్ధి కార్యకలాపాలు ప్రారంభించే యోచనలో కంపెనీ ఉన్నట్లు వివరించారు. ఫ్యూజిఫిల్మ్ ఇండియా ఎండీ కోజీ వాడా తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ఫ్యుజిఫిల్మ్ నుంచి మూడు కొత్త ఉత్పత్తులు
హైదరాబాద్: ఫ్యుజిఫిల్మ్ ఇండియా కంపెనీ ఇన్స్టాక్స్ మిని రేంజ్లో మూడు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చింది. ఈ ఏడాది ఆరంభంలో ఇన్స్టాక్స్ సిరీస్ ఇన్స్టాక్స్ కెమెరాలను మార్కెట్లోకి తెచ్చామని, ఈ కెమెరాలకు మంచి స్పందన లభిస్తోందని ఫ్యుజిఫిల్మ్ ఎండీ యసునొబు నిషియమ పేర్కొన్నారు. మారుతున్న భారత యువ వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఈ ఉత్పత్తులను అందిస్తున్నామని తెలిపారు. ఇన్స్టాక్స్ మిని 70 కెమెరా ధర రూ.11,500 అని తెలిపారు. శాన్రియో కంపెనీ భాగస్వామ్యంతో ఇన్స్టాక్స్ మిని హెలో కిట్టీ కెమెరాను రూపొందించామని ధర రూ.8,900 అని పేర్కొన్నారు. ఈ రెండు కెమెరాల ఫీచర్లు దాదాపు ఒకటేనని చెప్పారు. ఇన్స్టాక్స్ కెమెరాల నుంచి తీసుకున్నట్లుగానే స్మార్ట్‌ఫోన్‌లో తీసిన ఫొటొలను ప్రింట్లుగా తీసిచ్చే స్మార్ట్‌ఫోన్ ప్రింటర్.. ఇన్స్టాక్స్ షేర్ ధర రూ.14,500 అని వివరించారు.