ఫుల్ క్లారిటీ...
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్‌తేజ్‌ను కథానాయకునిగా తెరపై చూడాలని మెగా అభిమానులందరూ ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించే సమయం ఆసన్నమైంది. ఇంకొన్ని రోజుల్లోనే వరుణ్ తొలి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అతని తొలి సినిమా షూటింగ్ ఆ మధ్య మొదలైన విషయం తెలిసిందే. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ అడ్డాల దర్శకుడు. నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మాత.
లియో ప్రొడక్షన్స్ పతాకంపై ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతోంది. ఈ నెలాఖరుకి టాకీ పూర్తవుతుందని, మూడు పాటల చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంటాయని యూనిట్ సభ్యుల సమాచారం. గోదావరి జిల్లాల్లోని భీమవరం, అమలాపురం... తదితర అందమైన ప్రదేశాల్లో 35 రోజుల పాటు తీసిన సన్నివేశాలు సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయట.
కుర్రాళ్ల భావోద్వేగాలు, వాళ్లకుండాల్సిన ఫుల్ క్లారిటీ నేపథ్యంలో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలావుంటే... ఈ సినిమాకు ‘గొల్లభామ’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. నిజానికి ఈ సినిమాకు ఇప్పటివరకూ టైటిల్‌ని ఖరారు చేయలేదన్నది విశ్వసనీయ సమాచారం. ప్రస్తుతం పలు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాజర్, ప్రకాశ్‌రాజ్, బ్రహ్మానందం, రావురమేశ్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్, కెమెరా: మణికందన్.