Full of water
-
తెలంగాణ: వేసవిలోనూ చెరువులకు జలకళ!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా వేసవిలోనూ చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. కాళేశ్వరం ద్వారా గోదావరి జలాల ఎత్తిపోత ఆరంభమైన నేపథ్యంలో ప్రస్తుత యాసంగి సీజన్లో ఆయకట్టు పంటలకు ఎలాంటి నీటి కొరత లేకుండా చెరువులు, చెక్‌డ్యామ్‌ల్లో నీటి నిల్వలు పెంచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎల్లంపల్లి దిగువ నుంచి కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్ వరకు ఎన్ని వీలైతే అన్ని చెరువులను వంద శాతం నీటితో నింపాలన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనల మేరకు ఇరిగేషన్ శాఖ పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళుతోంది. ఇప్పటికే చెరువుల్లో నీటిని నింపే ప్రక్రియ మొదలవగా, మొత్తంగా 2,074 చెరువులకు నింపేలా ప్రణాళిక రచించింది. ఈ చెరువుల ద్వారా 1.20 లక్షల ఎకరాల మేర నీరందించనుంది. చదవండి: (ఆ ప్రాజెక్టులకు నిధులు ఆగొద్దు: కేసీఆర్) ఎస్సారెస్పీ కింద చెరువులకు జలకళ... ముఖ్యంగా ఎస్సారెస్పీ ప్రాజెక్టులో నీటి నిల్వ పుష్కలంగా ఉండటంతో ఆ నీటి ద్వారా లోయర్ మానేరు డ్యామ్ (ఎల్ఎండీ) వరకు కాల్వల ద్వారా పంటలకు నీరిస్తున్నారు. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎస్సారెస్పీలో నీటి నిల్వలు ఉంచడం మేలనే ఉద్దేశంతో ఎల్ఎండీ దిగువన కాళేశ్వరం ఎత్తిపోతల నీటిని వాడుతున్నారు. ఇక ఎల్ఎండీ దిగువన ఎస్సారెస్పీ స్టేజ్–1 కింద సుమారు మరో 3.50 లక్షల ఎకరాలకు నీరందించేలా ఇప్పటికే కాల్వల ద్వారా నీటి విడుదల జరగ్గా, దీని కింద 942 చెరువులున్నాయి. ఈ చెరువులకు నీటిని అందించేందుకు తొలి ప్రాధాన్యం ఇస్తూ నీటి విడుదల కొనసాగుతోంది. ఇప్పటికే చాలా చెరువులకు నీరందించేలా తూముల నిర్మాణం పూర్తయిన దృష్ట్యా, వాటి ద్వారా నీటి విడుదల కొనసాగిస్తున్నారు. ఈ చెరువులను నింపడం ద్వారా వాటికింద ఉన్న సుమారు 80 వేల ఎకరాల ఆయకట్టు సాగులోకి రానుండగా, 10 టీఎంసీల మేర నిల్వలు సాధ్యపడనున్నాయి. ఇక ఎస్సారెస్పీ స్టేజ్–2 కింద మొత్తంగా 3.52 లక్షల ఎకరాలకు నీరందించనుండగా, 866 చెరువుల పరిధిలో కనీసంగా 30 వేల ఎకరాల మేర ఆయకట్టు ఉంది. ఈ చెరువులన్నింటినీ ముందుగా నింపేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇటీవలే నిర్వహించిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనలు చేశారు. చదవండి: (ప్రధాని మాటలు ఆచరణలోకి రావాలి: కేటీఆర్) మిడ్‌మానేరు దిగువన... ఇక మిడ్‌మానేరు దిగువన అనంతగిరి రిజర్వాయర్ మొదలు కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్‌కు పుష్కలంగా నీటి లభ్యత ఉంది. ఈ నీటితో మొత్తంగా 266 చెక్‌డ్యామ్‌లు, చెరువుల్లో నీటిని నింపేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే కొన్ని చెరువులను నీటితో నింపుతున్నారు. ఈ మొత్తం చెరువులు, చెక్‌డ్యామ్‌ల కింద 18 వేలకు పైగా ఎకరాలకు నీరందే అవకాశం ఉండగా, 8.60 టీఎంసీల మేర నీటి నిల్వలకు అవకాశం ఉంది. ఇందులో అనంతగిరి కింద బెజ్జంకి మండల పరిధిలో 16, ఇల్లంతకుంటలో 9, రంగనాయక్‌సాగర్ కింద చిన్నకోడూరు మండలంలో 23, నంగనూర్–49, నారాయణ్‌పేట–22, సిద్దిపేట–4, ఇల్లంతకుంట–3, తంగనపల్లి–10, ముస్తాబాద్–5 చెరువులు, వీటితో పాటు మరో 35 చెక్‌డ్యామ్‌లు ఉన్నాయి. మల్లన్నసాగర్లో తవ్విన ఫీడర్ చానల్ ద్వారా తొగుట–6, దుబ్బాక–సిద్దిపేట–25, ముస్తాబాద్–6, కొండపోచమ్మసాగర్ పరిధిలో జగదేవ్‌పూర్ కెనాల్ ద్వారా మర్కూక్–23, జగదేవ్‌పూర్–5, తుర్కపల్లి కెనాల్ ద్వారా మర్కూక్–5, ఎం.తుర్కపల్లి–9, బొమ్మలరామారం–5. గజ్వేల్ కెనాల్ ద్వారా మర్కూక్–3, గజ్వేల్–1 చెరువులను నింపుతున్నారు. -
నెరవేరిన వైఎస్సార్ స్వప్నం
ఆధునిక పరిజ్ఞానంతో నిర్మితమైన రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తికి పన్నెండేళ్లు జలయజ్ఞం ఫలాలు రైతుల దరికి చేరాయి. బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో అప్పటి ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి పునాదిరాయి వేసిన ప్రాజెక్టులు పూర్తయి జలకళను సంతరించుకోవడంతో ప్రజల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రామగుండం మండలం ఎల్లంపల్లి వద్ద ఆయన శంకుస్థాపన చేసిన శ్రీపాదఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తిగా అందుబాటులోకి రావడంతో ఆయన ఆశయం నెరవేరినట్లయ్యింది. – రామగుండం జలయజ్ఞం కార్యక్రమంలో భాగంగా 2004 జూలై 28న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పునాదిరాయి వేశారు. మూడేళ్లలో పూర్తిచేయాలని నిర్ణయించి రూ.2,744 కోట్లు కేటాయించారు. ప్రాజెక్టు పనులను రూ.408.85 కోట్లకు బెంగళూరుకు చెందిన ఎస్పీఎంఎల్ ఐటీడీ సిమెంటేషన్ దక్కించుకుంది. రూ.191 కోట్లతో స్పిల్‌వే పియర్స్‌పై ఫ్యాబ్రికేషన్ గేట్ల పనులను ఎస్ఈడబ్ల్యూ (స్యూ), ఓం మెటల్స్ కంపెనీలు పొందాయి. ఎల్ఎస్నం.1/2004–05, 07–11–2004 ఉత్తర్వుల ప్రకారం ప్రాజెక్టును స్టేజ్–1, స్టేజ్–2గా విభజించారు. మొదటి స్టేజీలో ఫేజ్–1, ఫేజ్–2గా విభజిస్తూ ఫేజ్–1లో ప్రాజెక్టు నిర్మాణాన్ని ఐటీడీ సిమెంటేషన్, ఫేజ్–2లో 6.5 టీఎంసీల నీటిని ఎన్టీపీసీకి పైపులైన్లతో నీటి సరఫరా చేసేందుకు ఎస్పీఎంఎల్ కంపెనీ దక్కించుకుంది. ఇదీ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి విద్యుత్ అవసరాల దష్ట్యా ఎన్టీపీసీకి 6.5 టీఎంసీల నీటి సరఫరా. రెండు టీఎంసీలు మంథనికి ఎత్తిపోతల పథకం ద్వారా కమాన్‌పూర్, మంథని నియోజకవర్గ పరిధిలో 20వేల ఎకరాలకు సాగునీరు అందించడం. ఇందులో ఏడువేల ఎకరాలు స్థిరీకరణ. కమాన్‌పూర్ మండలంలో నాలుగు గ్రామాల్లో 1,380 ఎకరాలు, ముత్తారం మండలంలోని 17 గ్రామాల్లో 18,620 ఎకరాలకు నీరందించడం. ప్రాజెక్టు ఎగువ భాగంలో కడెం ఎత్తిపోతల పథకం కింద మూడు టీఎంసీల నీటిని నిల్వ చేసి 30వేల ఎకరాలు స్థిరీకరించడం. ఏడు నియోజకవర్గాల్లోని 19 మండలాల్లోని 206 గ్రామాల పరిధిలో రెండు లక్షల ఎకరాలకు సాగు, తాగునీరు అందించడం. ఇందు కోసం వేంనూర్‌లో 12 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు పంపుహౌస్ నిర్మాణం. 160 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించతలపెట్టిన ప్రాణహిత–చేవెళ్ల భారీ ప్రాజెక్టుకు ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉపయోగించుకోవడం. అబ్దుల్ కలాం సుజల స్రవంతి పథకంలో భాగంగా 10 టీఎంసీల నీటిని గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల నిమిత్తం పైపులైన్ల ద్వారా సరఫరా చేయడం. పూడిక తొలగింపునకు ఆధునిక పరిజ్ఞానం 20 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ రిజర్వాయర్‌లోకి భారీ వర్షాలకు పూడిక చేరితే తొలగించేందుకు ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. 42 నుంచి 45వ బ్లాక్ వరకు అడుగుభాగంలో (రివర్స్ స్లూయిస్) గేట్లను ఏర్పాటు చేశారు. ఈ విధానం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు లేకపోవడంతో అందులో సగానికిపైగా పూడిక పేరుకుపోయింది. దీంతో ప్రాజెక్టు సామర్థ్యం భారీగా తగ్గిపోయింది. కానీ.. ఈ ప్రాజెక్టులో చుక్కనీరు లేకుండా బయటకు పంపించే వెసులుబాటు కల్పించారు. ప్రాజెక్టులోకి మట్టి చేరినా.. నీటి ప్రవాహంలో కొట్టుకుపోయేలా గేట్లను అమర్చారు. అందుబాటులోకి ప్రాజెక్టు 2004లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు వైఎస్సార్ మరణానంతరం అనేక ఆటుపోట్లను ఎదుర్కొంది. ప్రజల ఆందోళనలు, ప్రజాప్రతినిధుల ఒత్తిడి నేపథ్యంలో వైఎస్సార్ తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన ముఖ్యమంత్రులు ఈ ప్రాజెక్టును ఎట్టకేలకు పూర్తిచేయగలిగారు. గతేడాదే అందుబాటులోకి వచ్చినా.. వర్షాలు లేకపోవడం.. రాయపట్నం వద్ద నిర్మించతలపెట్టిన నూతన వంతెన పూర్తికాకపోవడంతో నీటిని నిల్వ చేయలేకపోయారు. ఈ ఏడు వర్షాలు సమృద్ధిగా కురవడం.. వంతెన పూర్తికావడంతో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తోంది. తాజాగా ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయడంతో ఈ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వరదనీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ఈ దృశ్యాన్ని చూసేందుకు గోదావరిఖని, రామగుండం పరిసర ప్రాంత ప్రజలు తరలివస్తున్నారు. ‘ఇదంతా వైఎస్సార్ చలవే..’ అంటూ మననం చేసుకుంటున్నారు. అయితే రెండు రోజులుగా ఎకధాటిగా వర్షం కురుస్తుండడంతో ముర్మూర్ నుంచి ప్రాజెక్టు వరకు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. బురదలో వాహనాలు చిక్కుకుపోతుండడంతో కొంతమంది వాహనాలతో ముర్మూర్లోనే నిలిపివేసి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా గుర్తించేందుకు పలు రకాల అభివద్ధి పనులు చేపట్టాల్సి ఉందన్నారు. -
చెరువులకు పూజలు
శామీర్‌పేట్: వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు నిండిన చెరువుల వద్ద మండలంలోని ప్రజాప్రతినిధులు శనివారం గంగమ్మ పూజలు నిర్వహించారు. శామీర్‌పేట్ కట్టమైసమ్మ దేవాలయం వద్ద అమ్మవారికి జెడ్పీటీసీ బాలేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో నర్సింహ, ఐలయ్య, భూమయ్య, రవి పాల్గొన్నారు. అలియాబాద్ శ్రీరామాలయం వద్ద పొంగిపొర్లుతున్న వాగులో సర్పంచ్ గాదేగౌరికుమారి పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ హృదయ్‌కుమార్, వార్డుసభ్యులు పాల్గొన్నారు. -
3884 చెరువులకు జలకళ
మత్తడి పోస్తున్న 1708 చెరువులు పూర్తిగా నిండినవి 1208.. 22 చోట్ల గండ్లు వరంగల్ : నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి. జిల్లాలో మొత్తం 5837 చెరువులున్నాయి. గురవారం నాటికి జిల్లాలోని 5550 చెరువుల వివరాలు అధికారులకు అందాయి. అందులో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో 3884 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. గత వారం కురిసిన వర్షాలతో 1389 చెరువులకు మత్తళ్లు పడగా, ప్రస్తుతం 1708 చెరువులు పొంగి ప్రవహిస్తున్నాయి. గత ఐదేళ్లుగా నిండని చెరువులు సైతం ఇప్పుడు నిండుకుండల్లా మారడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఐబీ డివిజన్ పరిధిలో 15, మహబూబాబాద్ డివిజన్ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. విస్తారంగా వర్షాలు పడడంతో గురువారం నాటికి 22 చెరువులకు గండ్లు పడినట్లు అదికారులు తెలిపారు. మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా రెండు విడతలుగా చెరువుల పునరుద్ధరణ పనులు చేపట్టడం వల్ల బండ్ పటిష్టం కావడంతో చెరువుల్లో నీటి నిల్వలు పెరిగాయి. దీంతో అన్ని చెరువుల్లో జలకళ ఉట్టిపడుతోంది. మహబూబాబాద్ డివిజన్లో భారీ సంఖ్యలో చెరువులు నిండిపోయాయి. ఈ డివిజన్ పరిధిలో 7 చెరువులకు గండ్లు పడ్డాయి. ములుగు, స్పెషల్ ఎంఐ డివిజన్ల పరిధిలోని మండలాల్లోని చెరువులే ఎక్కువగా మత్తళ్లు పోస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని చెరువులన్నీ దాదాపుగా నిండిపోయినందున మళ్లీ భారీ వర్షాలు కురిస్తే కట్టలు తెగే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్లుగా నీటి ఎద్దడితో ఇబ్బంది పడిన ప్రజలకు ఇక ఆ సమస్య ఉండదు. నిండుకుండల్లా నగరంలోని చెరువులు... గ్రేటర్ వరంగల్ పరిధిలోని చెరువులు నిండుకుండల్లా తయారయ్యాయి. పట్టణ ప్రాంతంలో మొత్తం 166 చెరువులు ఉన్నాయి. వీటిలో ఇప్పటి వరకు 119 చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. ఇందులో మినీ ట్యాంక్ బండ్లుగా రూపుదిద్దుకుంటున్న భద్రకాళి, రంగసముద్రంతో పాటు పలు చెరువులు మత్తళ్లు పోస్తున్నాయి. నగర పరి««ధిలోని చెరువులన్నీ ఫుల్ ట్యాంక్ లెవల్‌కు చేరుకున్నట్లు ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. -
’వైఎస్ కృషి వల్లే నేడు ప్రాజెక్టులు జలకళ’