funds case
-
నిధుల దుర్వినియోగం కేసు; బ్యాంకు మేనేజర్ అరెస్ట్
సాక్షి, అత్తిలి( పశ్చిమగోదావరి) : బ్యాంకు నిధులను దుర్వినియోగం చేసిన కేసులో చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్ పోతాప్రగడ రామ సూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు తణుకు సీఐ డి.ఎస్.చైతన్యకృష్ణ సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం అత్తిలి మండలం తిరుపతిపురం గ్రామంలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు బ్రాంచ్ మేనేజర్‌గా పనిచేసిన కిరణ్‌కుమార్ 2015–16 మధ్యకాలంలో బ్యాంకును మోసం చేసి రూ.37 లక్షలను స్వాహా చేశాడు. రైతుల ఆధార్‌కార్డులతో 11 జాయింట్ లయబిలిటి గ్రూపులను ఏర్పాటు చేసి, ఒక్కొక్క గ్రూపునకు రూ. 3 లక్షలు చొప్పున రూ.33 లక్షలతో పాటు మరో 8 మంది రైతుల పేరున రూ.4 లక్షలు పంట రుణాలుగా మంజూరు చేశాడు. రైతుల సంతకాలు, వ్యవసాయశాఖ మండల అధికారి సంతకాలను బ్యాంకు మేనేజర్ పోర్జరీ చేశాడు. తప్పుడు రికార్డులు సృష్టించి మొత్తం రూ.37 లక్షల బ్యాంకు నిధులను స్వప్రయోజనాల కోసం కిరణ్‌కుమార్ వాడుకున్నాడు. రైతులు పేరున తీసుకున్న రుణాలు తిరిగిచెల్లించకపోవడంతో తరువాత కాలంలో వచ్చిన మేనేజర్ రైతులకు నోటీసులు జారీ చేయడంతో నిధులు దుర్వినియోగం విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై బ్యాంకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. బ్యాంకు మేనేజర్ కిరణ్‌కుమార్ బ్యాంకు నిధులు దుర్వినియోగం చేసినట్లు నిర్ధారణకు వచ్చి 2019 సెప్టెంబర్ 14న అప్పటి మేనేజర్ జి.శ్రీనివాస్ అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు పోతాప్రగడ వెంకట రామసూర్య కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి తణుకు కోర్టుకు హాజరు పర్చగా, 2వ అదనపు జుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్.మేరి నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ చైతన్యకృష్ణ తెలిపారు. -
మింగింది కక్కాల్సిందే...
సాక్షి, మోర్తాడ్(నిజామాబాద్) : గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కేటాయించిన నిధులను పక్కదారి పట్టించిన అక్రమార్కులకు ఆడిట్ అధికారులు నోటీసులను జారీ చేస్తున్నారు. 2001 నుంచి 2018 వరకు పంచాయతీల ఆడిట్‌ను ఇటీవల పూర్తి చేసిన అధికారులు నిధులు పక్కదారి పట్టిన పంచాయతీలను గుర్తించి నోటీసులు అందిస్తున్నారు. 18 ఏళ్ల నుంచి గడచిన ఏడాది వరకు వివిధ పీరియడ్లలో సర్పంచ్‌లుగా వ్యవహరించిన వారికి కార్యదర్శులుగా పని చేసిన ఉద్యోగులలో బాధ్యులు ఎవరు ఉంటే వారికి నోటీసులు ఇవ్వాలని ఆడిట్ అధికారులు నిర్ణయించారు. జిల్లాలో పంచాయతీల పునరి్వభజన జరుగకముందు 393 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ అన్ని పంచాయతీల్లో ఆడిట్ అధికారులు జమా ఖర్చుల వివరాలను పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేసిన ఆంశాలను గుర్తించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. అలా జిల్లాలో 50,346 అభ్యంతరాలు వెల్లడయ్యాయి. ఈ అభ్యంతరాలకు సంబంధించి మొత్తం రూ.64.06 కోట్లు పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్జీఎఫ్, ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ల ద్వారా నిధులు కేటాయించేవి. అలాగే తలసరి నిధులతో పాటు పంచాయతీలకు ఇంటి పన్నులు, నీటి కుళాయి బిల్లులు, లైసెన్స్‌ల జారీ, తైబజార్ వేలం వల్ల కూడా ఆదాయం లభిస్తుంది. ప్రభుత్వం కేటాయించిన నిధుల ఖాతాలు, జనరల్ ఫండ్ ఖాతాల ద్వారా జరిపిన చెల్లింపులను ఆడిట్ అధికారులు పరిశీలించి అభ్యంతరాలను వ్యక్తం చేశారు. ఎంబీ రికార్డు సరిగా ఉన్నవాటిని మినహాయించి సరైన రసీదులు లేకుండా నిధులు ఖర్చు చేసిన వాటిపై అధికారులు ఆడిట్లో అభ్యంతరం తెలిపారు. -
గుప్తనిధుల కేసులో నలుగురు అరెస్ట్
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం సమీపంలోని బీటీపీరోడ్డు పక్కన పొలంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ మహానంది శుక్రవారం సాయంత్రం తెలిపారు. గురువారం మధ్యాహ్నం నలుగురిని అదుపులోకి తీసుకున్నామని, వారిని విచారించగా మొత్తం ఏడుగురికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిందన్నారు. వీరిలో రాయదుర్గానికి చెందిన రమేష్‌నాయక్, బోయ రామదాస్, చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన పూజారి చంద్ర, చంద్రగిరికి చెందిన వెంకటేశులును శుక్రవారం అరెస్టు చేసినట్లు చెప్పారు. పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల్లో పట్టణానికి చెందిన ఎలక్ట్రానిక్ చానల్ విలేకరి మున్నా, అతని బంధువు జాఫర్, జావేద్ ఉన్నట్లు చెప్పారు. వీరిని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు.