funds corruptions
-
ప్రశ్నార్థకంగా సహారా రూ. 25 వేల కోట్లు
న్యూఢిల్లీ: సహారా గ్రూప్ అధినేత సుబ్రతో రాయ్ మరణించడంతో సహారా–సెబీ ఖాతాలోని రూ. 25,000 కోట్ల అంశం తాజాగా మరోసారి తెరపైకి వచ్చింది. రెండు గ్రూప్ సంస్థలు సమీకరించిన నిధులను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఇన్వెస్టర్లకు వాపసు చేసేందుకు సహారా గ్రూప్ ఈ నిధులను సెబీ ఖాతాల్లో జమ చేసింది. వివరాల్లోకి వెడితే.. సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ (ఎస్‌ఐఆర్‌ఈఎల్), సహారా హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (ఎస్‌హెచ్‌ఐసీఎల్) దాదాపు 3 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుంచి నిబంధనలకు విరుద్ధంగా సమీకరించిన నిధులను వాపసు చేయాలంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 2011లో ఆదేశించింది. 2012లో సుప్రీం కోర్టు కూడా సెబీ ఉత్తర్వులను సమర్థ్ధిస్తూ, 15 శాతం వడ్డీతో ఇన్వెస్టర్ల సొమ్మును తిరిగివ్వాలని ఆదేశాలు జారీ చేసింది. 95 శాతం మందికి రిఫండ్ చేసేశామని సహారా గ్రూప్ తెలియజేసినా, ఆ వాదనలను తోసిపుచ్చి రూ. 24,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లో జమ చేయాలంటూ ఉత్తర్వులు ఇచి్చంది. ప్రస్తుతం ఈ ఖాతాల్లో మొత్తం రూ. 25,000 కోట్లు ఉన్నాయి. ఈ 11 ఏళ్లలో సహారా గ్రూప్‌లో భాగమైన రెండు సంస్థల ఇన్వెస్టర్లకు సెబీ రూ. 138 కోట్లు వాపసు చేసింది. చాలా మటుకు ఇన్వెస్టర్ల వివరాలు సరిగ్గా లేకపోవడం, క్లెయిమ్‌లు రాకపోవడంతో మిగతా నిధులన్నీ సెబీ దగ్గరే ఉన్నాయి. అనారోగ్యంతో సుబ్రతో రాయ్ మరణించిన నేపథ్యంలో పంపిణీ చేయని ఈ సొమ్ము పరిస్థితి ఏమిటనేది చర్చనీయాంశంగా మారినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ప్యాకేజీ మింగేశారు.. 1.22 కోట్ల పేదల సొమ్ము టీడీపీ నేతల జేబుల్లోకి!
పోర్టు నిర్మాణంతో బతుకుదెరువు కోల్పోయి నిరాశ్రయులైన పేదలకు అందాల్సిన నిధులను టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ఆయన అనుచరులు స్వాహా చేశారు. అధికారంలోకి వచ్చిన టీడీపీ ఐదేళ్లు ఇదిగో.. అదిగో అంటూ ఊరించి కాలయాపన చేసింది. ఎన్నికల సమయంలో ముత్తుకూరు మండలంలో ఓట్ల కోసం హడావుడిగా నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీ నిధులను సోమిరెడ్డి మంజూరు చేయించారు. ఆ నిధులను ఆయన, అనుచరులే బొక్కేశారు. రికార్డుల్లో మాత్రం లబ్దిదారులకు అందినట్లు చూపించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగే అభివృద్ధిని అవినీతిగా ప్రచారం చేస్తూ నిత్యం ఎల్లో మీడియా పతాక శీర్షికల్లో ఉండే సోమిరెడ్డి తన అవినీతి నిర్వాకానికి మాత్రం సమాధానం చెప్పరు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్రానికే తలమానికంగా కృష్ణపట్నం పోర్టును 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. అప్పట్లో పోర్టు ఆధారిత పరిశ్రమల కోసం భూ సేకరణ చేశారు. దీంతో ఉపాధి కోల్పోయిన నిర్వాసితుల కోసం ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ప్రకటించారు. మత్స్యకార కుటుంబాల తరలింపునకు, కొంత కాలం ఉపాధి కోసం ఒక్కొక్కరికి రూ.1.20 లక్షల చొప్పున రూ.32 కోట్లు అందించారు. వీరితో పాటు మత్స్యకారేతరులను గుర్తించి వారికి ప్యాకేజీ అందించాలని వైఎస్సార్ నిర్ణయించారు. అయితే, వైఎస్సార్ అకాల మరణం నాన్ ఫిషర్మెన్ కుటుంబాల పాలిట శాపంగా మారింది. ఆ తర్వాత పాలన కొనసాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీని బుట్టదాఖలు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.43 వేలకుపైగా ప్యాకేజీ అందిస్తామని కొంత కాలం మభ్యపెట్టింది. అయితే ఇందులో ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే మూడు విడతల్లో ఇస్తానని చెప్పడంతో అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏకమైన మత్స్యకారేతర కుటుంబాలు రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా ఫలితం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదాలో ప్రజాసంకల్పయాత్ర చేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి మత్స్యకారేతర కుటుంబాల సమస్యను విన్నారు. అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ విషయంలో న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు వరకూ తెల్లరేషన్ కార్డు కలిగిన ప్రతి మత్స్యకారేతర కుటుంబానికి ప్యాకేజీ అందిస్తానని భరోసా ఇచ్చారు. ఎన్నికల ముందు హడావుడిగా.. టీడీపీ హయాంలో ఐదేళ్ల పాటు నాన్ ఫిషర్మెన్ ప్యాకేజీని పట్టించుకోని అప్పటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఎన్నికల సమయంలో వారి ఓట్ల కోసం కేవలం ఎస్సీ, ఎస్టీలకే అంటూ ప్రత్యేకంగా రూ.4.09కోట్లు మంజూరు చేయించారు. హడావుడి గా 3,550 కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10,500 వంతున రూ.3.87 కోట్లు పంపిణీ చేయించారు. ఇంకా రూ.1.22 కోట్లు పంపిణీ చేయకుండా అప్పట్లో ఆ నగదు పంపిణీలో సోమిరెడ్డి, ఆయన అనుచరులు చేతివాటం ప్రదర్శించారు. చెక్కుల రూపంలో పంపిణీ జరగడంతో రెవెన్యూ అధికారులు మాత్రం లబి్ధదారులకు పంపిణీ జరిగినట్లు చూపించారు. కానీ లబి్ధదారుల పేరుతో టీడీపీ నేతలే బ్యాంకు కెళ్లి డ్రా చేసుకుని ఆరగించారు. మండలంలోని పంటపాళెం, పైనాపురం, నేలటూరు, ముత్తుకూరు, దొరవులపాళెం గ్రామాల్లో దాదాపు 300 మందికి సంబంధించిన నగదును టీడీపీ నేతలే దిగమింగారు. నాకు ప్యాకేజీ ఇవ్వకుండానే.. నాకు నాన్‌ఫిషర్‌మెన్ ప్యాకేజీ కింద డబ్బులు పంపిణీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. నాకు మాత్రం అందలేదు. నా పేరు మీద చెక్కురాసి తీసేసుకున్నారు. టీడీపీ నేతలే ఈ పని చేశారు. మా కడుపులు కొట్టి ఇలా ప్రవర్తించడం వాళ్లకే చెల్లింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు ప్యాకేజీ మంజూరు చేశారు. మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాత్రం ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చూశారు. – కర్లపూడి సుబ్రహ్మణ్యం, ముత్తుకూరు ఇచ్చిన మాట ప్రకారం ప్యాకేజీ కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఎన్నికల ముందు ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి మా సమస్యను తీసుకెళ్లారు. అప్పుడు ఇచ్చిన హామీ ప్రకారమే మాకు నిధులు పంపిణీ చేయించారు. టీడీపీ హయాంలో ప్యాకేజీ పేరుతో మోసం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూసినా ఫలితం లేదు. ఎన్నికల సమయంలో మాకు నిధులు ఇస్తున్నట్లు చెప్పి మా పేర్లతో టీడీపీ నేతలు తినేశారు. – సుబ్బరాయుడు, దొరవులపాళెం కాకాణి చొరవతో 16,337 కుటుంబాలకు లబ్ధి వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపించారు. ప్రజాసంకల్పయాత్రలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పారదర్శకంగా 16,337 కుటుంబాలను లబ్ధిదారులను గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.25 వేల వంతున రూ.35.75 కోట్లు కేటాయించి, లబి్ధదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయించారు. టీడీపీ హయాంలో రూ.10,500 మాత్రమే లబ్ధి పొందిన వారికి సైతం మిగతా రూ.14,500 వంతున ప్యాకేజీ అందించారు. -
అక్రమార్కులకు ‘హామీ’
→ ‘ఉపాధి’ నిధుల దుర్వినియోగం → 30 మండలాల్లోనే రూ.13 కోట్లకు పైగా స్వాహా → సామాజిక తనిఖీల్లో బట్టబయలు → కూలీల పొట్ట కొడుతున్న అక్రమార్కులు → టీడీపీ అధికారంలోకి వచ్చాక మితిమీరిన అవినీతి ‘తిక్కోడి పెళ్లిలో తిన్నోడే బుద్ధిమంతుడు’ అన్నట్లు మారింది జిల్లా నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)పరిస్థితి. ఈ సంస్థలో నిధులకు ఏ మాత్రమూ కొదవలేదు. దీని ఆధ్వర్యంలో చేపడుతున్న పనుల్లో అక్రమార్కులు అందినకాడికి దండుకుంటున్నారు. ఈ క్రమంలో కూలీల పొట్టకొట్టేందుకు సైతం వెనుకాడడం లేదు. వలసల నివారణే ధ్యేయంగా అమలు చేస్తున్న ఉపాధి హామీ పథకాన్ని అవినీతికి కేరాఫ్‌గా మార్చేశారు. క్షేత్రస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎక్కడికక్కడ నిధుల దోపిడీయే లక్ష్యంగా పని చేస్తుండడంతో ఈ పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. అనంతపురం టౌన్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనుల్లో అక్రమాలు ఆగడం లేదు. ఏటా చేపడుతున్న సామాజిక తనిఖీల్లో ఈ విషయం బహిర్గతమవుతూనే ఉంది. అయినప్పటికీ అక్రమాల నివారణకు అధికారులు పటిష్ట చర్యలు చేపట్టలేకపోతున్నారు. జిల్లాలోని 63 మండలాల్లో చేపట్టిన ఉపాధి పనులపై ఇప్పటి వరకు ఎనిమిది విడతల సామాజిక తనిఖీలు ముగిశాయి. తనిఖీ బందాలు రూ.40 కోట్ల వరకు అవినీతిని గుర్తించాయి. అధికారులు మాత్రం రూ.3.60 కోట్లు జరిగినట్లు చెబుతున్నారు. ఇది వాస్తవ విరుద్ధం. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న తొమ్మిది, పదో విడత తనిఖీల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. 30 మండలాల్లో ముగిసిన తనిఖీలు 2014–15 ఆర్థిక సంవత్సరంలో చేపట్టిన పనులకు సంబంధించి తొమ్మిదో విడత, 2015–16లో జరిగిన పనులపై పదో విడత సామాజిక తనిఖీలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. తనిఖీ బందాలు క్షేత్రస్థాయిలో పనులు పరిశీలించి..గుర్తించిన అక్రమాలపై ఓపెన్ ఫోరం నిర్వహిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ప్రారంభమైన తనిఖీలు వచ్చే ఏడాది మార్చి 31 వరకు కొనసాగుతాయి. ఏప్రిల్‌లో బొమ్మనహాళ్, గాండ్లపెంట, తనకల్లు, శెట్లూరు, మేలో పరిగి, ఓడీ చెరువు, కంబదూరు, నార్పల, అనంతపురం, బుక్కరాయసముద్రం, గోరంట్ల, అమడగూరు, జూన్‌లో హిందూపురం, కదిరి, నల్లమాడ, కూడేరులో సామాజిక తనిఖీలు పూర్తయ్యాయి. జూలైలో పెనుకొండ, మడకశిర, గార్లదిన్నె, పుట్లూరు, సోమందేపల్లి, రామగిరి, గుంతకల్లు, కుందుర్పి, ఆగస్టులో తలుపుల, పెద్దవడుగూరు, పెద్దపప్పూరు, శింగనమల, రొళ్ల, తాడిపత్రి, సెప్టెంబర్‌కు సంబంధించి ఈ నెల 14వ తేదీ నాటికి కనగానపల్లిలో తనిఖీలు ముగిశాయి. రూ.కోట్లు కొల్లగొట్టారు! క్షేత్రస్థాయిలో పనులు పరిశీలిస్తున్న సామాజిక తనిఖీ బందాలు అక్రమాల పరంపరను చూసి అవాక్కవుతున్నాయి. పనులు చేయకున్నా చేసినట్లు రికార్డుల్లో చూపడం, కొలతల్లో తేడాలు, కూలీలు పనులకు రాకున్నా మస్టర్లు సష్టించడం.. ఇలా అనేక అక్రమాలు బయటపడుతున్నాయి. ప్రస్తుతం రూ.126.10 కోట్ల పనులకు సంబంధించి ఆడిట్ నిర్వహించగా.. ఏకంగా రూ.13.34 కోట్ల అవినీతి జరిగినట్లు గుర్తించారు. పైగా ఓపెన్ ఫోరం నిర్వహించి అవినీతిని బయటపెట్టాక.. రికవరీ చేసిన మొత్తం రూ.21 వేలు మాత్రమే. ఈ అవినీతి వ్యవహారం వెనుక ఫీల్డ్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరూ భాగస్వాములయ్యారన్న ఆరోపణలు బలంగా విన్పిస్తున్నాయి. ఇంకా 33 మండలాల్లో తనిఖీలు చేయాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితే మరో రూ.15 కోట్ల వరకు అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది.