G Eswari
-
ప్రజల మనోభావాలు తెలిపితే కేసులా?
విశాఖపట్నం: గిరిజనులు, ఆదివాసీల మనోభావాలను తెలియజేసిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరిపై అక్రమంగా కేసులు పెట్టడం దారుణమని వైఎస్ఆర్ సీపీ విశాఖ జిల్లా అద్యక్షడు గుడివాడ అమర్ నాథ్ మండిపడ్డారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే కేసులు పెట్టాలి కాని, ప్రజల తరపున మాట్లాడితే కేసులు పెట్టడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీడీపీ నేతలు హత్యయత్నంతో సహా 5 కేసులను గిడ్డి ఈశ్వరి పై అన్యాయంగా బనాయించారని ఆయన విమర్శించారు. రాజ్యాంగం, న్యాయస్థాలు ఉన్నాయని, న్యాయం జరిగేంత వరకు వైఎస్ఆర్ సీపీ పోరాడుతుందని అమర్ నాథ్ అన్నారు. -
ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం
విశాఖపట్నం : బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా గిరిజనులు ఇంతగా ఉద్యమం చేస్తున్నా కనిపించడం లేదా అని చంద్రబాబు ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. గురువారం ఆంధ్రయూనివర్శిటీలో గిరిజన విద్యార్థులు చేపట్టిన రిలే దీక్ష శిబిరాన్ని ఆమె పరామర్శించారు. అనంతరం ఈశ్వరీ మాట్లాడుతూ... విశాఖ ఏజెన్సీలో టీడీపీ నేతలు కిడ్నాపైనా చంద్రబాబు స్పందించలేదని ఆమె గుర్తు చేశారు. బాక్సైట్ తవ్వకాలు ఆపకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని ఈశ్వరీ ఈ సందర్భంగా చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.