లోక్ అదాలత్‌పై ప్రచారం అవసరం
సాక్షి, హైదరాబాద్: న్యాయమూర్తులు, పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు సమిష్టిగా కృషి చేసినప్పుడే సామాన్యుడికి సత్వర న్యాయం అందుతుందని హైకోర్టు న్యాయమూర్తి, లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జస్టిస్ జి.రోహిణి అన్నారు. ఈనెల 23న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని నిర్వహించనున్న సందర్భంగా నాంపల్లి క్రిమినల్ కోర్టుల సమావేశ మందిరంలో న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవాదులు, పోలీసు అధికారులతో గురువారం ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
సుప్రీం కోర్టు నుంచి తాలూకా స్థాయి వరకు పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం కోసం లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నామని, న్యాయవాదులను నియమిం చుకునే స్థోమత లేనివారు లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరించుకోవచ్చన్నారు. లోక్ అదాలత్‌లపై విసృ్తత ప్రచారం చేయాలని, అప్పుడే కక్షిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుందన్నారు. తరచూ నేరాలకు పాల్పడేవారి కేసులను లోక్‌అదాలత్‌లో పరిష్కరించరాదని నగర పోలీసు అదనపు కమిషనర్ సందీప్ శాండిల్య విజ్ఞప్తి చేశారు. లోక్ అదాలత్ ద్వారా కేసులను పరిష్కరిం చేందుకు వీలుగా ఇప్పటికే 880 మం దికి సమన్లు జారీచేశామన్నారు.
కార్య క్రమంలో మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి శ్యాంప్రసాద్, లీగల్ సర్వీస్ అథా రిటీ సభ్య కార్యదర్శి వెంక ట్‌రెడ్డి, న్యాయమూర్తులు గెడ్డన్న, ఎంవీ రమేష్, లక్ష్మీపతి, ధర్మారావు, చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ రాధాదేవి, శైలజ, ఆంజనేయశాస్త్రి, లీగల్ సర్వీస్ అథారిటీ కార్యదర్శి రాజేశ్వరి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉప్పు బాలబుచ్చయ్య, అదనపు పీపీలు యుగంధర్‌రావు, గంగరాజు ప్రసాద్, గోపాల్‌సింగ్, ఏపీపీలు క్రిష్ణమోహన్, శ్రీవాణి, జ్యోతి రామకృష్ణ, లక్ష్మీ లావణ్య, ఉప నిషత్ వాణి, లక్ష్మీ మనోజ్ఞ, నిర్మల, సుశీల, బార్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్య దర్శులు ప్రభాకర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, న్యాయ వాదులు త్రిగుణాత్మ, వినోద్ కుమార్, రూపా సింగ్, సంపూర్ణదేవి, తిరుపతివర్మ తదితరులు పాల్గొన్నారు.