కౌగిలించుకోవచ్చు..ముద్దు పెట్టుకోవచ్చు
అవకాశాలేవీ వెతుక్కుంటూ రావు. వాటిని మనమే కల్పించుకోవాలి. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలనేది విజ్ఞుల మాట. వీటిలో రెండో కోవకు చెందిన జీవీ వెయిల్ చిత్రానికి సంగీతాన్ని అందించే అవకాశం రాగా దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఫలితం ఇప్పుడు ప్రముఖ యువ సంగీత తరంగంగా మారారు.
అలాగే కథా నాయకుడిగా అవకాశం వచ్చినప్పుడు నేనేంటి హీరోనేమిటి అన్న జీవీ ప్రకాష్‌కుమార్ ఇప్పుడు నాలుగైదు చిత్రాల కథా నాయకుడు. మొన్నటి వరకు పాత ముఖాలను తెరపై చూసిన ప్రేక్షకులకు జీవీ నటన వేసవిలో చల్లని పానీయం తాగినంత అనుభూతిని కలిగించింది. దీంతో ఇప్పటి వరకు సంగీతంతో ఆడుకుంటూ వచ్చిన జీవీ ఇప్పుడు నటనలోను, సయ్యాటలాడుకుంటున్నారు. రెండు పడవల్లో జోరుగా సాగుతున్న జీవీతో మినీ ఇంటర్వ్యూ.
ప్ర: కథానాయకుడిగా బిజీ అవుతున్నారు. ఇక సంగీతం మాటేమిటి?
జ: నన్ను సంగీత ప్రియులకు పరిచయం చేసింది సంగీతమే. ఇప్పుడు నటుడిగా అవతారమెత్తినా సంగీతానికి లోటు రానీ యను. నా కంతా సంగీతమే. ఇప్ప టి వరకు 48 చిత్రాలకు సంగీతాన్ని అం దించాను. నటుడిగా బిజీగా వున్నా ఇప్పుడు మూడు చిత్రాలకు సంగీ తాన్ని అందిస్తున్నాను. పులి చిత్రంతో పాటు విజయ్ తదుపరి చిత్రానికి నేనే సంగీతాన్ని అందించనున్నాను. ఇది నాకు 50వ చిత్రం అవుతుంది.
ప్ర: పెన్సిల్ చిత్రం ప్రత్యేకత ఏమిటి?
జ: ఇది పాఠశాల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథా చిత్రం. ఇందులో నాయకి శ్రీ దివ్యకు నాకు మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యిందని ప్రేమ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని దర్శకుడు అన్నారు.
ప్ర: శ్రీ దివ్య నటన గురించి?
జ: ఆమె తన పాత్ర ఏమిటన్నది స్పష్టంగా తెలుసుకుని అందుకు తగ్గట్టుగా నటించి ప్రశంసలు అందుకోవాలని భావిస్తారు. ఈగో అంటే తెలియని నటి. తాను తన పని అన్నట్టుగా ఉంటారు.
ప్ర: తాజా చిత్రం త్రిష ఇల్లన్నా నయనతార పేరేకొత్తగా ఉందే?
జ: ప్రస్తుతం సినిమాలో గట్టిపోటీ నెలకొంది. అన్నింటి కంటే ముఖ్యం ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలి. అందుకోసం కొత్తదనాన్ని ఆశ్రయించా ల్సి వస్తోంది. అం దులో భాగంగానే పేరు చిత్ర కథ కూడా వైవిధ్యంగా ఉంటుంది.
ప్ర: నూతన నటుల పోటీని ఎలా ఎదుర్కొంటున్నారు?
జ: నా రూటు సపరేటు. సిచ్యువేషన్‌కు తగ్గ ట్టు సాహిత్యం, రాగానికి తగ్గట్టు ట్యూన్ చేసినట్లు, నాకు తగిన కథా పాత్రల్లోనే నటిస్తాను. ప్రేక్షకులు కూడా చిన్న చిత్రం, పెద్ద చిత్రం అనే తారతమ్యాలు చూడటం లేదు. వారికి నచ్చితే చిత్రాలను చూస్తున్నారు. సంగీత దర్శకుడిగా వారి ఫీలింగ్స్ గ్రహించి న వాడిని. నటుడిగాను అదేబాటలో పయనిస్తున్నా.
ప్ర: కథా నాయికలతో కౌగిలింతలు, ముద్దు లు లాంటి వాటికి దూరంగా ఉండాలంటూ మీ అర్ధాంగి షరతులు విధించారట?
జ: అదంతా అసత్యం. సైంధవి పాటలు, రికార్డింగ్‌లు అంటూ తన పని తాను చూసుకుంటోంది. నేను నా పని చేసుకుంటున్నాను. హీరోయిన్లను కౌగిలించుకోకూడదు, ముద్దులు పెట్టుకోకూడదన్న షరతులేవీ విధించలేదు. తనకు మంచి భర్తగా ఉంటే చాలు, సినిమాలో మం చి పేరు తెచ్చుకోవాలి అంటూ నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చింది. అందువలన తెరపై ప్రేమ సన్నివేశాలలో దుమ్ము రేపాలని నిర్ణయించుకున్నాను. నా తదుపరి చిత్రం చూస్తే ఈ విషయం మీకే అర్థం అవుతుంది.