Gaanja Shankar Movie
-
ఒక్క మెసేజ్‌తో ఇద్దరు చిన్నారులను ఆదుకున్న సాయిధరమ్ తేజ్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇద్దరు చిన్నారులకు సాయం చేసి మంచి మనసు చాటుకున్నారు. తనకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత జీవితం అంటే ఏమిటో తెలిసింది అని చెప్పిన ఆయన ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూనే.. సోషల్ సర్వీసులో కూడా ముందుంటాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఓ అనాథ ఆశ్రమంలో ఉండే ఇద్దరు చిన్నారులకు అవసరమైన వైద్య ఖర్చులను ఆయన చెల్లించారు. ఈ విషయాన్ని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు సోషల్‌మీడియా వేదికగా తెలిపారు. సూర్యాపేట జిల్లాలోని చార్లెట్ అనాథ ఆశ్రమం నుంచి ఇద్దరు పిల్లల ట్రీట్మెంట్ కోసం సాయం కోరుతూ తనకు ఒక ఫోన్ కాల్ వచ్చిందని సినిమాటోగ్రాఫర్ ఆండ్రూ బాబు తెలిపారు. వారికి సాయం అందించాలంటే తనకు వెంటనే గుర్తుకు వచ్చిన పేరు సాయిధరమ్ తేజ్ మాత్రమే అని ఆయనకు ఒక్క మెసేజ్ చేస్తే.. వెంటనే ఆ పిల్లలకు ఆయన సాయం చేశారని ఆండ్రూ తన సోషల్ మీడియా ద్వారా చెప్పాడు. సాయిధరమ్ చేసిన సాయానికి ఒక వీడియో ద్వారా ఆ పిల్లలు కృతజ్ఞతలు చెప్పారు. గతంలో కూడా సాయి ధరమ్ తేజ్ ఇలాంటి సహాయాలు చాలా చేశాడు. విజయవాడలో వృద్ధుల కోసం ప్రత్యేకంగా ఆశ్రమం కట్టించాడు. తన పుట్టినరోజు సందర్భంగా గతేడాది అక్టోబరులో సైనిక కుటుంబాలతో పాటు ఏపీ, తెలంగాణ పోలీసులకు రూ.20 లక్షల సాయం చేసిన సంగతి తెలిసిందే. ఇలా పలు సందర్భాల్లో తన వంతు సాయం చేస్తూ మనసు చాటుకున్నారు. బ్రో, విరూపాక్షలతో మెప్పించిన సాయిధరమ్ ప్రస్తుతం సంపత్ నంది దర్శకత్వంలో 'గాంజా శంకర్'చేస్తున్నారు. కానీ గాంజా అనే పదాన్ని తొలగించాలని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో పోలీసులు ఇటీవల నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. Thank you @IamSaiDharamTej your kind help for them, children sent you thank you wishes❤️❤️❤️ pic.twitter.com/gwrzmZQYR7 — I.Andrew babu (@iandrewdop) February 22, 2024 -
ఊరమాస్‌గా సాయి ధరమ్ తేజ్.. గత్తరలేపిన ‘గాంజా శంకర్’ గ్లింప్స్
మెగా మేనల్లుడు, సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్, సంపత్ నంది దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు(అక్టోబర్ 15) సాయి తేజ్ బర్త్‌డే సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌ని వదిలారు. ఈ చిత్రానికి ‘గాంజా శంకర్’ అని టైటిల్ ఖరారు చేశారు. మాస్‌కి నిర్వచనం ఇవ్వొద్దని, ఫీల్ అవ్వమని చెబతూ ‘గాంజా శంకర్’ వీడియో గ్లింప్స్ ప్రారంభం అవుతుంది. ‘స్పైడర్ మ్యాన్ సూపర్ మ్యాన్ కాదు నాన్నా... మన లోకల్ మ్యాన్ కథ ఏదైనా ఉంటే చెప్పు' అని ఓ చిన్నారి అడగటంతో 'గాంజా శంకర్' ఇంట్రో మొదలైంది. హీరో పాత్ర ఎలా ఉండబోతుందో ఈ ఇంట్రోలో చూపించారు. గంజాయి అని పేరు చెప్పలేదు కానీ.. హీరో గాంజా అమ్ముతాడనే విషయాన్ని మాత్రం ఈ వీడియో ద్వారా చెప్పేశారు. మొత్తానికి సాయి తేజ్ పూర్తి మాస్ పాత్రలో కనిపించబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఏ.ఎస్. ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్నారు.