'తలరాత అతడిముందు తలొంచింది'
బ్రెజిల్: ఆలోచన శక్తితో పుట్టిన మానవుడి మెదడు పనిచేసేంత వరకు ఏ శక్తి, ఏ వైకల్యం అతడి పురోగతిని ఆపలేదని మరోసారి రుజువైంది. పుట్టుకతోనే కాళ్లు, చేతులు లేకుండానే జన్మించిన బ్రెజిల్ కుర్రాడు గేబ్ అడామ్స్ చరిత్ర సృష్టించి ఇదే అంశాన్ని నిరూపించాడు. అతడు వీల్ చైర్‌కే పరిమితంకాకుండా ఎంతో శ్రమకూర్చి తన చుట్టుపక్కలవారికి ఆదర్శంగా నిలిచాడు. కాళ్లుచేతులు లేకపోయినా తన కాలేజ్ ఫ్రెండ్స్ తో డ్యాన్స్ కాంపిటేషన్ షోలో పాల్గొని అబ్బురపరిచాడు.
అంతేకాకుండా వారికి అతడే స్వయంగా డ్యాన్స్ లో మెళకువలు బోధించుకున్నాడు. గేబ్ కాళ్లు చేతులు లేకుండానే జన్మించాడు. అతడు ఓ అనాథ ఆశ్రమంలో పెరుగుతుండగా చిన్నతనంలోనే ఓహియోకు చెందిన దంపతులు అతడిని దత్తత తీసుకెళ్లారు. అప్పటికే వారికి 13 మంది సంతానం. అలా తీసుకెళ్లినవారు అతడిని జాగ్రత్తగా చూసుకోవడంపై మాత్రమే దృష్టి పెట్టారు. కానీ, గేబ్ మాత్రం ఏదో చేయాలని తాపత్రయపడ్డారు. కనీసం ఓ చంటి పిల్లాడిలా కూడా పనిచేయలేకపోతే తన జీవితం వృథా అనుకున్నాడు. స్కూల్‌కు వెళ్లే రోజుల్లో కాలేజీకి వెళుతున్నప్పుడు ఎన్నో ఆలోచనలు అతడిని నిత్యం కొత్త కార్యాచరణ చేపట్టే వ్యక్తిగా తీర్చిదిద్దాయి.
పన్నేండేళ్ల వయసులో ఉన్నప్పుడే తనకు తాను డ్యాన్స్ పాఠాలు చెప్పుకోవడం ప్రారంభించాడు. ఇంట్లో వాళ్లకెవరికీ ఈ విషయం చెప్పకుండా రహస్యంగా ఉంచుకున్నాడు. అనూహ్యంగా అతడు చదువుతున్న పాఠశాల కేస్విల్లే కార్యక్రమానికి తన కుటుంబాన్ని ఆహ్వానించి 29 మందితో కలిసిన డ్యాన్స్ బృందంతో చేరి వేదికపై అనూహ్యంగా కనిపించాడు. మెరుపులాగా డ్యాన్స్ చేస్తూ తన కుటుంబీకులను ఆశ్యర్యంలో ముంచెత్తాడు. ఇతడు ఒక్క డ్యాన్స్ మాత్రమే కాదు.. పరుగెత్తగలడు, స్వయంగా మెట్లు ఎక్కగలడు, ఫాస్ట్ గ డైవింగ్ కూడా చేయగలడు. డైవింగ్ లో కూడా ఇప్పటి వరకు చాలా బహుమతులు పొందాడు.