gadapa gadapaku YSR program
-
ప్రతి గడపకు సమయం కేటాయించాలి : సీఎం జగన్
-
గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొన్న మంత్రులు,ఎమ్మెల్యేలు
-
సీఎం జగన్ లాంటి నాయకుడు ఈ దేశంలోనే లేడు: విడదల రజిని
-
బాబు బూటక పాలన ఇంకెన్నాళ్లు?
గడపగడపకు వైస్సార్లో ప్రజాగ్రహం విశాఖపట్నం: రాష్ట్రంలో పాలన ఉందో లేదో అంతుపట్టడం లేదని.. ఈ పాలనను ఇంకెన్నాళ్లు భరించాలో అర్ధం కావడం లేదని పలువురు తీవ్రస్వరంతో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. రెండున్నరేళ్లయినా ఒక్కటంటే ఒక్క సమస్య కూడా పరిష్కారానికి నోచుకోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే ఈ ప్రభుత్వానికి తగిన శాస్తి చేస్తామని హెచ్చరించారు. గడపగడపకు వైఎస్సార్ ఉద్యమంలా సాగుతోంది. జిల్లాలో పలు నియోజకవర్గాల్లో మంగళవారం ఆయా కోఆర్డినేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది. విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తైనాల విజయకుమార్ జీవీఎంసీ 35వ వార్డు తాటిచెట్లపాలెం పరిధి సంతోషనగర్లో నిర్వహించిన గడపగడపకు వైఎస్సార్‌కు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. బాబును నమ్మి ఓట్లేస్తే మాకు సరైన బుద్ధి చెప్పాడని, బాబు పాలనలో ఒరిగిందేమీ లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 128 గడపలకు వెళ్లి బ్యాలెట్ పత్రాల్లో ప్రశ్నలకు జవాబులను అడిగి తెలుసుకున్నారు. నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, సత్తి రామకృష్ణారెడ్డి, బర్కత్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ కో ఆర్డినేటర్ కోలా గురువులు, రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీలు 21వ వార్డులో గడప గడపకు వైఎస్సార్ నిర్వహించారు. వార్డ్బాయ్ లైన్, తాడివీధి, ఏనుగులవీధి, జెండాచెట్టు తదితర ప్రాంతాల్లో ఈ కార్యక్రమం జరిగింది. ఆయా ప్రాంతాల్లోని 152 గడపలను సందర్శించి అధికార టీడీపీ వైఫల్యాలను, చంద్రబాబు చేపడుతున్న పలు ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. గాజువాక కో ఆర్డినేటర్ తిప్పల నాగిరెడ్డి 60వ వార్డు పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఇంటింటికీ వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన 100 హామీల వైఫల్యంపై వైఎస్సార్సీపీ రూపొందించిన ప్రజాబ్యాలెట్‌ను అందజేశారు. వైఎస్సార్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు పసుపులేటి ఉషాకిరణ్, నగర అధికార ప్రతినిధి ఉరుకూటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
బాబుకు తగిన బుద్ధిచెబుతాం
– ఎన్నికల్లో ఇచ్చిన హామీలను గాలికొదిలేశారంటూ మహిళలు ఆగ్రహం – గడప గడపకూ వైఎస్సార్‌లో తమ సమస్యలు విన్నవించిన ప్రజలు ఉదయగిరి: గత ఎన్నికల్లో అనేక హామీలిచ్చి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని, వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధిచెబుతామని పలువురు మహిళలు ఉదయగిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ముందు కుండబద్ధలు కొట్టారు. ఉదయగిరిలో బుధవారం జరిగిన ‘గడప గడపకూ వైఎస్సార్’లో అనేకమంది తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్.రాజశేఖర్‌రెడ్డి హయాంలో అన్నివిధాలుగా ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిపొందామని, టీడీపీ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఉదయగిరి మెయిన్‌రోడ్డు, బీసీ కాలనీలో ఇంటింటికి తిరిగి బాబు వాగ్దానాలపై ప్రజా బ్యాలెట్‌ను స్థానికులకు అందజేసి మార్కులు వేయించారు. ఎక్కువ శాతం హామీలు పూర్తిగా నెరవేర్చలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అబద్ధాలాడి అధికారం..మరచిన హామీలు అనంతరం స్థానిక పంచాయతీ బస్టాండు వద్ద జరిగిన సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చేందుకు అనేక అబద్ధాలాడి పగ్గాలు చేపట్టిన తర్వాత అందులో ఒక్కదాన్ని కూడా నెరవేర్చలేదన్నారు. నీరు–చెట్టు పనుల్లో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని తెలుగుతమ్ముళ్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. జన్మభూమి కమిటీలు అర్హులకు మొండిచేయి చూపించి ప్రభుత్వ పథకాలను టీడీపీ వారికే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. బీడుభూములు సస్యశ్యామలం చేసేందుకు వెలుగొండ ప్రాజెక్టులో అంతర్భాగమైన పెద్దిరెడ్డిపల్లి రిజర్వాయర్‌కు నిధులు మంజూరుచేయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి ఎంపీపీ చేజర్ల సుబ్బారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు బి.శ్రీనివాసులు, పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ మార్కెట్ సుభాని, అక్కి భాస్కర్‌రెడ్డి, ఖిల్జీ సలీం, గడియాల్చి ఎస్ధాని, షంషీర్, చేజర్ల సుధాకర్‌రెడ్డి,గౌస్‌మొహిద్దిన్, ఏడుకొండలు, గొల్లపల్లి తిరుపతి, సోమిరెడ్డి, రమణారెడ్డి, నియోజకవర్గ నేతలు గణపం బాలక్రిష్ణారెడ్డి, ఆండ్రా బాలగురవారెడ్డి, గుంటుపల్లి నాగభూషణం, షేక్.అలీఅహ్మద్, పావులూరి మాల్యాద్రిరెడ్డి,బొల్లినేని సత్యనారాయణ, పాలవెల్లి మాలకొండారెడ్డి, యారం నరసింహరావు,పి.విజయభాస్కర్‌రెడ్డి, జి.పుల్లయ్య, తదితరులున్నారు. -
సామాన్యులం బతకలేకున్నాం
కడప అగ్రికల్చర్ : తమ పార్టీ అధికారంలోకి రాగానే నిత్యావసర సరుకుల ధరలు తగ్గిస్తామని, ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత కల్పిస్తామని ఎన్నికల సమయంలో పదేపదే టీడీపీ నేతలు చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఆ విషయాన్నే పట్టించుకోవడం లేదని ప్రజలు వైఎస్సార్సీపీ నేతల ఎదుట వాపోయారు. శనివారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమంలో భాగంగా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలం సుంకేసులలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, పార్టీ మండల నాయకులు కొమ్మా పరమేశ్వరరెడ్డి, శివచంద్రారెడ్డి, మండల యూత్ కన్వీనర్ శివారెడ్డి, సర్పంచులు మనోహర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, ఎంపీటీసీ కృపాకర్‌రెడ్డి ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు. ఆ సమయంలో సుంకేసులకు చెందిన కూలీ నాగయ్య మాట్లాడుతూ కూలీ పనులు చేసుకునే తమలాంటి వాళ్లం ఇప్పుడున్న ధరల్లో నిత్యావసరాలను కొనలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వం ధరల తగ్గింపుపై ఏమాత్రం శ్రద్ధచూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఎర్రగుంట్ల మున్సిపాలిటీలో ఉన్న 17, 18 వార్డుల్లో పార్టీ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి, కౌన్సిలర్ దివ్య, మార్కెట్‌యార్డు మాజీ చైర్మన్ విశ్వభార్గవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సురేంద్రనాథరెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు గంగా శివారెడ్డిలు ప్రజలను కలుసుకుని 100 ప్రశ్నల కరపత్రాలను అందజేశారు. ఆ సమయంలో నాగేంద్రారెడ్డి అనే యువకుడు మాట్లాడుతూ యువతకు చిరు పరిశ్రమల ఏర్పాటుకు రుణాలు ఇస్తామని, అలాగే కొన్నేళ్ల పాటు ఆయా పరిశ్రమలు ఏర్పాటుకు భూమిని కూడా కేటాయిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఆ ఊసే ఎత్తలేదని దుయ్యబట్టారు. బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం పుల్లివీడులో పార్టీ సమన్వయకర్త డాక్టర్ వెంకటసుబ్బయ్య, ఎంపీపీ విజయప్రతాప్‌రెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు సి.బాషాలు గడపగడపకు వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పుల్లివీడులో వృద్ధురాలు గంగోజి మాట్లాడుతూ వేలిముద్రలు సరిపడలేదని రేషన్‌కార్డు, పింఛన్ తొలగించారని కన్నీళ్ల పర్యంతమైంది. రాజంపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు సాతుపల్లెలో జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ పోలా శ్రీనివాసులురెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి, మాజీ కౌన్సిలర్ దండు చంద్రలీల ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంలో పలువురు మహిళలు తమకు డ్వాక్రా రుణమాఫీ జరగలేదని, ఇప్పటికీ చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకున్నామని ప్రభుత్వంపై నిప్పులు చెరిగాయి. మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరు మండలం పెద్ద జొన్నవరంలో ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి, మండల అధ్యక్షురాలు కానాల చంద్రావతమ్మ, స్థానిక నాయకులు పాల్గొని ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ జాన్ మాట్లాడుతూ మైనార్టీ రుణాలు అందిస్తామని, దుల్హాన్ పథకం కింద పారితోషికం ఇస్తామని చెప్పినా తమకు మాత్రం అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు కార్యక్రమం ఇలా.. సాక్షి, కడప : జిల్లాలోని రాజంపేట, బద్వేలు నియోజకవర్గాల్లో ఆదివారం కూడా గడపగడపకు వైఎస్ఆర్ కార్యక్రమం జరగనుంది. అందుకు సంబంధించి రాజంపేట పట్టణంలోని రామ్‌నగర్‌లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొనున్నారు. అలాగే బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల మండలం బుళ్లివీడు గ్రామపంచాయతీలోని చెన్నారెడ్డిపేటలో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు సమన్వయకర్త వెంకటసుబ్బయ్యల ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ కార్యక్రమం జరగనున్నది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.