ఇల్లు కూలి వృద్ధుడు మృతి
సిరికొండ(నిజామాబాద్): భారీ వర్షాలకు ఇల్లు కూలి ఓ వృద్ధుడు మృతిచెందాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా సరికొండ మండలం కొండాపూర్ గ్రామ పరిధిలోని గడ్డమీదితండాలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. తండాకు చెందిన కిష్టయ్య(65) శనివారం రాత్రి తన గుడిసెలో నిద్రిస్తుండగా.. ఒక్క సారిగా ఇల్లు కుప్పకూలింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు.