Gadde Babu Rao
-
అందుకే పార్టీకి రాజీనామా : గద్దె బాబూరావు
సాక్షి, విజయనగరం : జిల్లాలో తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే గద్దె బాబూరావు టీడీపీకి గుడ్‌బై చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ప్రకటన చేశారు. గద్దె బాబూరావు మీడియాతో మాట్లాడుతూ... ‘పార్టీలో పరిస్థితులు బాగోలేదు. సుదీర్ఘ కాలంగా టీడీపీలో పనిచేసినా గుర్తింపు లేదు. ఆత్మ గౌరవం.. ఆత్మ స్థైర్యంతో పుట్టిన పార్టీ ప్రస్తుతం కరుమరుగైంది. అందుకే రాజీనామా చేస్తున్నా. ఎన్టీఆర్ ఉన్నప్పుడు పార్టీ వేరు. చంద్రబాబు నాయుడు మాలాంటి వారికి గౌరవం ఇవ్వడం లేదు. నేను చాలా పేద కుటుంబం నుంచి వచ్చాను. చాలా కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నా. 1978లో నా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టాను. కాంగ్రెస్‌లో ఉన్న నేను, ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత టీడీపీలో చేరారు. అక్కడ నుంచి ఆయన అడుగు జాడల్లో నడిచాను. చీపురుపల్లి ప్రజల సహకారంతోనే నేను ఈ స్థాయిలో ఉన్నాను. పార్టీ కోసం అంకిత భావంతో పని చేశాను. అప్పట్లో ఎన్టీఆర్ శ్రీకాకుళం, విజయనగరం ఎమ్మెల్యే స్థానాల బీ ఫారాలు నా చేతికే ఇచ్చేవారు. కానీ అప్పటి టీడీపీకి ఇప్పటి టీడీపీకి చాలా తేడాలు వచ్చాయి. 2004 నుంచి ఇప్పటివరకూ గద్దె బాబూరావు ఉన్నాడో లేడో కూడా టీడీపీ నాయకత్వం గుర్తించడం మానేసింది. నాకు ఎవరి మీద విమర్శలు చేయడం ఇష్టం లేదు. ఆత్మ గౌరవము, ఆత్మ సంతృప్తి కోల్పోయిన తర్వాత చాలా బాధ కలిగి ఇవాళ టీడీపీకి రాజీనామా చేస్తున్నా. నాకు ఎంతో గౌరవం ఇచ్చిన పార్టీలో నేడు గుర్తించే వారు లేకపోవడం నాకు చాలా బాధ కల్గించింది. ఎంతోమంది నచ్చజెప్పారు కానీ నా రాజీనామా నిర్ణయం మార్చుకోదల్చుకోలేదు.’ అని స్పష్టం చేశారు. కాగా గద్దె బాబూరావు ఒకసారి ఎమ్మెల్సీ, రెండుసార్లు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌గా పని చేశారు. ఎన్టీఆర్‌తో గద్దె బాబూరావు (ఫైల్ ఫోటో) -
‘మహానాడు’ వేదిక పనులు ప్రారంభం
మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మహానాడు సభావేదిక పనులకు శ్రీకాళహస్తి దేవాలయ మాజీ ఛైర్మన్ పీఆర్.మోహన్, చేవెళ్ల టీడీపీ సమన్వయకర్త సామ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ ద్దె బాబురావు గురువారం ఉదయం పూజలు నిర్వహించారు. ఈ సభావేదికను కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన రాజా ఎంటర్ ప్రైజెస్ వారు అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ హానాడుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ప్రతినిధులు తరలిరానున్నట్లు తెలిపా రు. అందుకోసం సభావేదిక ఏర్పాట్లను పటిష్టంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ మాజీ చెర్మైన్ ఏవీ.రమణ, కోట్ల నరోత్తంరెడ్డి, కొమ్మిడి వెంకట్‌రెడ్డి, కంజర్ల శేఖర్, సత్యలింగంగౌడ్, రాజుగౌడ్, తదితరులున్నారు. ‘మహానాడు’ స్థలాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు గండిపేట ఎన్టీఆర్ కుటీరంలో ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న ‘మహానాడు’ పరిసర ప్రాం తాలను సైబరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ వై.గంగాధర్, శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, తదితరులు గురువారం సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలోని గండిపేట కుటీరంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గతంలో ఏర్పాటు చేసిన మహానాడులో 10 వేల మంది కోసం నిర్వహణ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం 20 వేల మంది ప్రతి నిధులకు సరిపడే ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు. మహానాడుకు వచ్చే వారికి ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా పూర్తి బాధ్యతలతో బందోబస్తు నిర్వహించాలని సబ్బందిని ఆదేశించారు. మహానాడు సభావేదికపైకి అనుమతి ఉన్నవారినే పంపించాలని సూచించారు. అనంతరం మహానాడు సభావేదిక పార్కింగ్ స్థలాలను, పరిసర ప్రాంతాలను పర్యటించారు. మహానాడు వేదిక ఏర్పాట్లను పరిశీలించిన వారిలో సెక్కురిటీ అడిషనల్ డీసీపీ నారాయణ, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మధ్యపాటి శ్రీనివాస్, మొయినాబాద్ సీఐ రవిచంద్ర, ఎస్సైలు సైదులు, శ్రీనివాస్‌రావు, మండల టీడీపీ నాయకులు కోట్ల నరోత్తంరెడ్డి, కొమ్మిడి వెంకట్‌రెడ్డి, కంజర్ల శేఖర్ ఉన్నారు. -
గద్దె కొత్త కాపురం సాగేనా!
చీపురుపల్లి, న్యూస్‌లైన్: చీపురుపల్లి నియోజకవర్గంలో సంఖ్యా బలమున్న ఓ సామాజిక వర్గం గత కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే గద్దే బాబూరావును వ్యతిరేకిస్తూ వస్తోంది. తమ సామాజిక వర్గానికి చెందిన బొత్సను వ్యతిరేకించి, తెలుగుదేశం పార్టీలో ఉండి, గద్దెకు మద్దతిస్తే అలాంటి తమను నాలుగేళ్లుగా వదిలి పెట్టి, ఎక్కడున్నామో పట్టించుకోకుండా, తీరా ఎన్నికల సమయానికి సీటు కోసం వస్తే ఊరుకునేది లేదని ఆ వర్గానికి చెందిన మండల స్థాయి నేతలు హెచ్చరిస్తున్నప్పటికీ గద్దెను తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం పై ఆ పార్టీ నాయకులకు పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా ఓటర్లు ఉన్న తూర్పుకాపు సామాజి క వర్గానికి ప్రాధాన్యమివ్వాలి తప్ప లాబీయిం గ్లకు ప్రాధాన్యమివ్వడం దారుణమని ఆ పార్టీ కి చెందిన వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే జరిగితే పలువురు పార్టీని వీడడం ఖాయమని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. గద్దె తెలుగుదేశంలో ప్రస్థానం..... తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి, ఆపార్టీ ప్రతిపక్షంలో ఉంటే పక్కకు తప్పుకోవడం, మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి ఎమ్మెల్యే టిక్కెట్ కోసం పార్టీలో చేరడం గద్దే బాబూరావుకు అలవాటని దేశం పార్టీ నేత లు విమర్శిస్తున్నారు. రాజకీయంగా ఎలాంటి వారసత్వం, కుల బలం లేని గద్దె బాబూరావు ను రెండు సార్లు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా చేసింది. 1996 నుంచి 2004 వరకు చీపురుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. మూడోసారి 2004లో జరిగిన ఎన్నికల్లో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణపై 10 వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓటమి పాల య్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ ప్రజల కు దూరమయ్యారు. పలుమార్లు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటనలు చేశారు. 2009లో మరోసారి బొత్సపై 5 వేల ఓట్లు తేడాతో ఓటమి చెందారు. తరువాత పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో అప్పట్లో నియోజకవర్గంలోని కార్యకర్తలంతా.... పార్టీకి రాజీనామా చేయవద్దని, తమను ఆదుకునే వారు ఎవ్వరూ లేరని ప్రాథేయపడ్డారు. వారి విన్నపాలను పట్టించుకోకుం డా తనకు రాజకీయం చేసే ఓపిక లేదని, వయ స్సు మీరిపోయిందని రాజీనామా చేసి, కార్యకర్తలకు దూరమయ్యారు. అంతేకాకుండా నియోజకవర్గంలోని తెలుగుదేశం మండల స్థాయి క్యాడర్‌పై తన వద్ద డబ్బులు తీసుకుని, తనకు వ్యతిరేకంగా పని చేశారంటూ తీవ్ర స్థాయిలో ఆరోపణలు కూడా చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లోకి.... 2009 ఎన్నికలు తరువాత రెండేళ్ల పాటు రాజకీయాలకు దూరంగా ఉన్న గద్దె తిరిగి తెలుగుదేశంలోకి వెళ్లేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన ఆ పార్టీ క్యాడర్ గద్దె రాకను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించింది. దీంతో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. పార్టీలో చేరిననాటి నుంచి తనకే ఎమ్మెల్యే టిక్కెట్ ఖరారు చేయాలని ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం. అం దుకు ఆ పార్టీ నిరాకరించడంతో పార్టీలో ఉన్న క్యాడర్‌ను తీసుకుని వెళ్లిపోయేందుకు ఒక సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అయితే పార్టీని వీడేందుకు క్యాడర్ అంగీకరించలేదు. దీంతో ఆయన ఒక్కరే పార్టీకి రాజీనామా చేశారు. ప్రస్తుత పరిస్థితి.... దాదాపు ఐదేళ్లగా తెలుగుదేశం పార్టీకి దూరం గా ఉండి, ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమవడంతో దేశం లో లుకలుకలు ప్రారంభమయ్యాయి. జిల్లాకు చెందిన పార్టీ పెద్ద, పొలిట్‌బ్యూరో సభ్యుడు పి.అశోక్‌గజపతిరాజు, పార్టీ అధినేత చంద్రబాబునాయుడు సమక్షంలో ఈ నెల 3న హైదరాబాద్‌లో తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకుంటున్నట్లు స్వయంగా బాబూరావు ప్రకటించారు. తన నివాసం వద్ద, పట్టణంలోని వివిధ సెంటర్ల లో అశోక్, చంద్రబాబు, ఎన్టీఆర్‌ల ఫొటోలు, ఫ్లెక్సీలతో నింపేశారు. అయితే అదే పార్టీలో ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కె.త్రిమూర్తులురాజు వర్గానికి ఈ పరిణామం మిం గుడుపడడం లేదు. గద్దె పార్టీని వీడినప్పటి నుంచి కె.త్రిమూర్తులురాజు కార్యకర్తలకు అండగా నిలిచారు. నాలుగేళ్లుగా పార్టీకి వెన్నం టి ఉంటూ కార్యక్రమాలు నిర్వహిస్తూ, చివరకు తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేశారు. ఇక తనకే ఎమ్మెల్యే సీటు వస్తుందనుకుంటున్న తరుణంలో బాబూరావు పార్టీలో చేరుతుండడంతో కేటీఆర్‌కు పోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇంతా కష్టపడి పని చేస్తే తమ శ్రమను గుర్తించని అధిష్టానం, పార్టీను కాదని వెళ్లిన వ్యక్తిని ఎలా చేర్చుకుంటుందంటూ కేటీఆర్ వర్గీయులు గుర్రుగా ఉన్నారు. గద్దే పార్టీలో చేరితే ఆయన వ్యతిరేక క్యాడర్ పార్టీకి దూరంకావడం ఖాయమని పరిశీలకులు భావిస్తున్నారు.