మొయినాబాద్ రూరల్, న్యూస్‌లైన్: మహానాడు సభావేదిక పనులకు శ్రీకాళహస్తి దేవాలయ మాజీ ఛైర్మన్ పీఆర్.మోహన్, చేవెళ్ల టీడీపీ సమన్వయకర్త సామ భూపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గ ద్దె బాబురావు గురువారం ఉదయం పూజలు నిర్వహించారు. ఈ సభావేదికను కర్నాటక రాష్ట్రం బెంగుళూరుకు చెందిన రాజా ఎంటర్ ప్రైజెస్ వారు అలంకరిస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మ హానాడుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ప్రతినిధులు తరలిరానున్నట్లు తెలిపా రు. అందుకోసం సభావేదిక ఏర్పాట్లను పటిష్టంగా నిర్మిస్తున్నామన్నారు. ఈ పూజా కార్యక్రమంలో రాష్ట్ర వికలాంగుల సంస్థ మాజీ చెర్మైన్ ఏవీ.రమణ, కోట్ల నరోత్తంరెడ్డి, కొమ్మిడి వెంకట్‌రెడ్డి, కంజర్ల శేఖర్, సత్యలింగంగౌడ్, రాజుగౌడ్, తదితరులున్నారు.
‘మహానాడు’ స్థలాన్ని పరిశీలించిన పోలీస్ ఉన్నతాధికారులు
గండిపేట ఎన్టీఆర్ కుటీరంలో ఈనెల 27, 28వ తేదీల్లో నిర్వహించనున్న ‘మహానాడు’ పరిసర ప్రాం తాలను సైబరాబాద్ సంయుక్త పోలీస్ కమిషనర్ వై.గంగాధర్, శంషాబాద్ డీసీపీ రమేష్‌నాయుడు, సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, తదితరులు గురువారం సాయంత్రం 5 గంటలకు సందర్శించారు. మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామంలోని గండిపేట కుటీరంలో భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గతంలో ఏర్పాటు చేసిన మహానాడులో 10 వేల మంది కోసం నిర్వహణ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం 20 వేల మంది ప్రతి నిధులకు సరిపడే ఏర్పాట్లను చేస్తున్నట్లు వివరించారు.
మహానాడుకు వచ్చే వారికి ఎలాంటి ఇ బ్బందులు కలుగకుండా పూర్తి బాధ్యతలతో బందోబస్తు నిర్వహించాలని సబ్బందిని ఆదేశించారు. మహానాడు సభావేదికపైకి అనుమతి ఉన్నవారినే పంపించాలని సూచించారు. అనంతరం మహానాడు సభావేదిక పార్కింగ్ స్థలాలను, పరిసర ప్రాంతాలను పర్యటించారు. మహానాడు వేదిక ఏర్పాట్లను పరిశీలించిన వారిలో సెక్కురిటీ అడిషనల్ డీసీపీ నారాయణ, రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, ట్రాఫిక్ ఏసీపీ మధ్యపాటి శ్రీనివాస్, మొయినాబాద్ సీఐ రవిచంద్ర, ఎస్సైలు సైదులు, శ్రీనివాస్‌రావు, మండల టీడీపీ నాయకులు కోట్ల నరోత్తంరెడ్డి, కొమ్మిడి వెంకట్‌రెడ్డి, కంజర్ల శేఖర్ ఉన్నారు.
‘మహానాడు’ వేదిక పనులు ప్రారంభం
Published Fri, May 23 2014 12:39 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
Advertisement