Gail India Limited
-
క్యూ1లో గెయిల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం గెయిల్ ఇండియా లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. క్యూ1(ఏప్రిల్–జూన్)లో నికర లాభం 500 శాతం దూసుకెళ్లి రూ. 1,530 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) క్యూ1లో దాదాపు రూ. 256 కోట్లు మాత్రమే ఆర్జించింది. కోవిడ్–19 కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ విధింపు కారణంగా గత క్యూ1లో కార్యకలాపాలకు విఘాతం కలిగిన విషయాన్ని ఈ సందర్భంగా కంపెనీ ప్రస్తావించింది. అయితే తాజా క్వార్టర్లోనూ మహమ్మారి సెకండ్ వేవ్ తలెత్తినప్పటికీ తీవ్ర ప్రతికూలతలు ఎదురుకాలేదని తెలియజేసింది. మొత్తం ఆదాయం సైతం 44 శాతం జంప్‌చేసి రూ. 17,387 కోట్లను తాకింది. లాభాల తీరిలా సొంత పైప్లైన్ల ద్వారా గ్యాస్ రవాణా పెరగడంతో ఈ విభాగం నుంచి లాభదాయకత 27 శాతం పుంజుకుని రూ. 915 కోట్లకు చేరినట్లు వివరించింది. కాగా.. గ్యాస్‌పై మార్జిన్లు బలపడటంతో రూ. 378 కోట్లు ఆర్జించింది. గత క్యూ1లో రూ. 545 కోట్లకుపైగా నష్టాలు వాటిల్లాయి. ఇక పెట్రోకెమికల్ బిజినెస్ సైతం రూ. 138 కోట్ల లాభం సాధించగా.. గతంలో రూ. 154 కోట్ల నష్టం నమోదైంది. భాగస్వామ్య సంస్థలతో కలసి 8,000 కిలోమీటర్ల పైప్‌లైన్ ప్రాజెక్టులను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 38,000 కోట్లవరకూ వెచ్చిస్తోంది. మరోపక్క మహారాష్ట్రలోని ఉసార్‌లో పీడీహెచ్పీపీ యూనిట్ ద్వారా పాలీప్రొపిలీన్ సామర్థ్యాన్ని 5,00,000 టన్నులమేర విస్తరిస్తోంది. ఇదేవిధంగా యూపీలోని పాటాలో 60,000 పీపీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇందుకు రూ. 10,000 కోట్ల పె ట్టుబడులను కేటాయించింది. మొత్తం పెట్టుబడు ల్లో ఈ ఏడాది రూ. 6,600 కోట్లు సమకూర్చనుంది. ఫలితాల నేపథ్యంలో గెయిల్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు యథాతథంగా రూ. 143 వద్ద ముగిసింది. -
గెయిల్(ఇండియా) లిమిటెడ్‌లో 220 పోస్టులు
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న భారత ప్రభుత్వ రంగ మహారత్న సంస్థ.. గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్(గెయిల్).. వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 220 ► పోస్టుల వివరాలు: మేనేజర్, సీనియర్ ఇంజనీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్. ► విభాగాలు: మార్కెటింగ్, కెమికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్ స్ట్రుమెంటేషన్, సివిల్, హెచ్ఆర్, లా తదితరాలు. ► అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, ఇంజనీరింగ్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిప్లొమా, సీఏ/సీఎంఏ (ఐసీడబ్ల్యూఏ) ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. ► ఎంపిక విధానం: షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థుల్ని గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 05.08.2021 ► వెబ్సైట్ : https://www.gailonline.com -
గెయిల్ చరిత్రాత్మక లాభం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ గెయిల్ మార్చి త్రైమాసికంలో రూ.1,122 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న లాభంతో పోలిస్తే ఇది 10 శాతం అధికం. ఆదాయం సైతం రూ.15,430 కోట్ల నుంచి రూ.18,764 కోట్లకు వృద్ధి చెందింది. 2018–19 ఆర్థిక సంవత్సరానికి రూ.74,808 కోట్ల ఆదాయం (39 శాతం అధికం)పై రూ.6,026 కోట్ల లాభాన్ని (30 శాతం వృద్ధి) నమోదు చేసింది. వాటాదారుల వద్దనున్న ప్రతీ షేరుకు మరొక షేరును బోనస్‌గా ఇవ్వాలని, అలాగే, ప్రతీ షేరుకు రూ.1.77చొప్పున తుది డివిడెండ్ ఇచ్చేందుకు బోర్డు సిఫారసు చేసింది. 2018–19లో రికార్డు స్థాయిలో ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో రూ.8,344 కోట్లను విస్తరణపై ఖర్చు చేశామని, వచ్చే 2–3 ఏళ్లలో మరో రూ.54,000 కోట్లను గ్యాస్ పైపులైన్ల ఏర్పాటుపై ఖర్చు చేయనున్నట్టు గెయిల్ చైర్మన్, ఎండీ బీసీ త్రిపాఠి తెలిపారు. గెయిల్‌కు దేశవ్యాప్తంగా 14,000 కిలోమీటర్ల పొడవు పైపులైన్ మార్గాలు ఉన్నాయి. కొత్తగా రూ.32,000 కోట్లతో 6,000 కిలోమీటర్ల మేర పైపులైన్లు నిర్మిస్తోంది. దీంతో తూర్పు, దక్షిణ భారత్‌లో అనుసంధానం లేని ప్రాంతాలకు చేరుకోగలదు. అలాగే, వారణాసి, పాట్నా పట్టణాలకు పైపు ఆధారిత సహజవాయువు సరఫరా చేసేందుకు గాను రూ.12,000 కోట్లతో పంపిణీ నెట్‌వర్క్‌ను కూడా నిర్మిస్తోంది. మరో రూ.10,000 కోట్లను పెట్రోకెమికల్స్ వ్యాపార విస్తరణపై వెచ్చించనుంది. -
గెయిల్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు
ఉద్యోగాలు: గెయిల్ ఇండియా లిమిటెడ్ సీనియర్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తులు కోరుతోంది. ఖాళీల సంఖ్య: 61 విభాగాలు: కెమికల్, పీసీ ఆపరేషన్స్, మెకానికల్ - పీసీ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పీసీ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్ - పీసీ ఓఅండ్ఎం, మెకానికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఎలక్ట్రికల్ - పైప్‌లైన్ ఓఅండ్ఎం, ఇన్స్ట్రుమెంటేషన్- పైప్‌లైన్ ఓఅండ్ఎం అర్హతలు: సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్లైన్ రిజిస్ట్రేషన్: ఆగస్టు 11 - 25 వెబ్సైట్: www.gail.nic.in భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కింద పేర్కొ న్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. - డిప్యూటీ ఇంజనీర్ (సివిల్) అర్హత: మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (సివిల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. - డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) అర్హతలు: మొదటి శ్రేణిలో బీఈ/ బీటెక్ (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణతతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి. వయసు: 28 ఏళ్లకు మించకూడదు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఆగస్టు 20 వెబ్సైట్: www.bel-india.com ప్రవేశాలు: అన్నా యూనివర్సిటీ చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎంఎస్, పీహెచ్డీ ప్రోగ్రాముల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది. విభాగాలు: ఇంజనీరింగ్/ టెక్నాలజీ, సైన్స, హ్యుమానిటీస్, మేనేజ్మెంట్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్. అర్హతలు: సంబంధిత విభాగంలో 55శాతం మార్కులతో ఎంఎస్ ప్రోగ్రాముకు బీఈ/ బీటెక్; పీహెచ్డీ ప్రోగ్రాముకు మాస్టర్స డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తులకు చివరితేది: ఆగస్టు 30 వెబ్సైట్: https://cfr.annauniv.edu నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ కాలికట్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖా స్తులు కోరుతోంది. పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ సిస్టమ్ డిజైన్ (పీసీ-100) అర్హత: బీఈ/ బీటెక్ (ఈఈ/ ఈఈఈ/ ఐఅండ్‌సీ/ఈసీ/ఏఈఅండ్ఐ/ఇన్స్ట్రు మెంటేషన్/ మెకట్రానిక్స్/ సీఎస్ఈ). అడ్వాన్స్డ్ డిప్లొమా-పీఎల్సీ/స్కాడా/ డీసీఎస్ - (పీసీ - 500) అర్హత: డిప్లొమా, ఎమ్మెస్సీ (ఇన్స్ట్రు మెంటే షన్/ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్) లేదా బీఈ/ బీటెక్ ఉండాలి. వెబ్సైట్: http://calicut.nielit.in