శామ్సంగ్ డ్యూయల్ స్క్రీన్ ‘గెలాక్సీ గోల్డెన్’
న్యూఢిల్లీ: శామ్సంగ్ కంపెనీ గెలాక్సీ సిరీస్‌లో మరో కొత్త ఫోన్, గెలాక్సీ గోల్డెన్‌ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 3.7 అంగుళాల రెండు స్క్రీన్లు (డ్యూయల్ స్క్రీన్)ఉన్న ఈ బం గారం కలర్ ఫ్లిప్ ఫోన్ ధర రూ.51,900. పైన ఉన్న స్క్రీన్‌తో యూజర్లు కాల్స్ చేయవచ్చు. అంతేకాకుండా కాల్స్‌ను రిసీవ్ చేసుకోవచ్చు. ఇక లోపల ఉన్న ఇన్నర్ స్క్రీన్‌లో 3గీ4 కీ ప్యాడ్ ఉం టుంది. దీనిలో పెద్ద సైజ్ కీలు ఉండడం విశేషం.
ఫోన్‌ను ఉపయోగించడం సులభతరం చేయడానికే ఇలాంటి డిజైన్ ఉన్న ఫోన్‌ను అందిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఈ సింగిల్ సిమ్ ఫోన్లో ఉన్న హిడెన్ రిసీవర్ కారణంగా ఫోల్డర్‌ను తెరవకుండానే కాల్స్ రిసీవ్ చేసుకోచ్చని వివరించింది. ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్లో 1.7 గిగాహెర్ట్జ్ డ్యూయల్-కోర్ ప్రాసెసర్, 1.5 జీబీ ర్యామ్, 8 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 1.9 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 16 జీబీ ఇంటర్నల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి. టచ్, టైప్ అనుభవాన్నిచ్చే అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ ఇదని శామ్సంగ్ మొబైల్స్ అండ్ ఐటీ కంట్రీ హెడ్ వినీత్ తనేజా చెప్పారు.