గ్యాస్ట్రో కౌన్సెలింగ్
నేను నెల రోజుల క్రితం హెల్త్ చెకప్ చేయించుకున్నాను. అప్పుడు కడుపు స్కానింగ్ చేశారు. ఆ పరీక్షలో నాకు గాల్బ్లాడర్లో రాళ్లు ఉన్నాయని తేలింది. కానీ నాకు కడుపునొప్పి ఎప్పుడూ రాలేదు. కొందరు ఆపరేషన్ చేయించుకోవాలని అంటున్నారు. దయచేసి నాకు సరైన సలహా ఇవ్వగలరు.
- లక్ష్మి, హైదరాబాద్
మీరు చెప్పినదాని ప్రకారం మీకు అసింప్టమాటిక్ గాల్స్టోన్ డిసీజ్ ఉన్నదని చెప్పవచ్చు. ఇలా గాల్బ్లాడర్లో రాళ్లు ఉండి వ్యాధి లక్షణాలు లేనివారిలో ఏడాదికి నూటికి ఇద్దరికి మాత్రమే వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశం ఉంది. అంటే 98 శాతం మంది నార్మల్గానే ఉంటారు. కాబట్టి మీకు వ్యాధి లక్షణాలు లేకుండా ఉంటే, ఆపరేషన్ అవసరం లేదు. మీరు ఒకసారి మీ దగ్గరలోని గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ను కలిసి, మీ రిపోర్టులు చూపిస్తే సరైన సలహా ఇవ్వగలరు.
డాక్టర్ భవానీ ప్రసాద్ రాజు
కన్సల్టెంట్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్