gambling centres
-
పేకాట స్థావరాలపై దాడులు
– 23 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ – రూ.26,500 నగదు స్వాధీనం హిందూపురం రూరల్ : మండలంలోని పూలకుంట-నరసాపురం గ్రామాల మధ్య చింతచెట్ల తోపులో పేకాట ఆడుతున్న వారిపై మంగళవారం దాడులు చేసి 23మందిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం రూరల్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. వారి నుంచి రూ.26,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ అక్బర్, కానిస్టేబుళ్లు రవి, వసంత్, వెంకటరామిరెడ్డి, విజయ్, మల్లి, నరేష్, షాకీర్ పాల్గొన్నారన్నారు. ముగ్గురు మట్కా బీటర్లు అరెస్ట్ తాడిపత్రి : పట్టణంలోని బండా మసీదు వద్ద మట్కా రాస్తున్న ఇనయతుల్లా, హాసన్వలి, హానీఫ్ను మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.22లక్షల నగదును పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్కారాస్తున్నారన్న సమాచారంతో పట్టణ సీఐ రామకృష్ణారెడ్డిఽ, ఎస్ఐ ఆంజనేయులు సిబ్బంది కలిసి దాడి చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాటరాయుళ్ల అరెస్ట్, 1.69లక్ష నగదు స్వాధీనం
గుంటూరు: జిల్లాలో ఎక్కడో ఒకచోట పేకాట శిబిరాలు వెలుస్తూనే ఉన్నాయి. పోలీసుల కంటపడకుండా ఇలాంటి శిబిరాలను యదేచ్ఛగా కొనసాగుతున్నాయి. తాజాగా గుంటూరు జిల్లాలోని తిప్పలవారిపాలెం మండలం సత్యనారాయణపురంలో పేకాట శిబిరాలపై శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు నిర్వహించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న నలుగురిని పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వారినుంచి 1.69లక్షల రూపాయల నగదు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
పేకాటస్థావరాలపై పోలీసుల దాడులు
హైదరాబాద్: నగర శివారు వనస్థలిపురం బ్రాహ్మణపల్లిలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు చేసి భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. జూదరుల నుంచి మూడు కార్లు, మూడు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల అదుపులో ఉప సర్పంచ్ సహా వార్డు మెంబర్ ఉన్నట్టు సమాచారం. సంకాంత్రి సందర్భంగా ఓ వైపు పూజా కార్యక్రమాలతో భక్తులు లీనమై ఉండగా, మరో వైపు జూదాలు, బెట్టింగ్లతో జూదరులు గడుపుతున్నారు.