పేకాట స్థావరాలపై దాడులు
– 23 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
– రూ.26,500 నగదు స్వాధీనం
హిందూపురం రూరల్ : మండలంలోని పూలకుంట-నరసాపురం గ్రామాల మధ్య చింతచెట్ల తోపులో పేకాట ఆడుతున్న వారిపై మంగళవారం దాడులు చేసి 23మందిని అరెస్ట్ చేసినట్లు హిందూపురం రూరల్ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు. వారి నుంచి రూ.26,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పేకాట ఆడుతున్నారన్న పక్కా సమాచారం అందడంతో ఈ దాడులు నిర్వహించామన్నారు. దాడుల్లో హెడ్ కానిస్టేబుల్ అక్బర్, కానిస్టేబుళ్లు రవి, వసంత్, వెంకటరామిరెడ్డి, విజయ్, మల్లి, నరేష్, షాకీర్ పాల్గొన్నారన్నారు.
ముగ్గురు మట్కా బీటర్లు అరెస్ట్
తాడిపత్రి : పట్టణంలోని బండా మసీదు వద్ద మట్కా రాస్తున్న ఇనయతుల్లా, హాసన్‌వలి, హానీఫ్‌ను మంగళవారం అరెస్టు చేసి వారి నుంచి రూ.1.22లక్షల నగదును పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మట్కారాస్తున్నారన్న సమాచారంతో పట్టణ సీఐ రామకృష్ణారెడ్డిఽ, ఎస్‌ఐ ఆంజనేయులు సిబ్బంది కలిసి దాడి చేసి నిందితుల్ని అరెస్టు చేశారు. వారి నుంచి నగదు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నారు.