Gambling Club
-
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
కర్నూలు : కర్నూలు జిల్లా, బేతంచర్లలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. వివరాలు.. బేతంచర్ల మండల కేంద్రంలో గురువారం అర్థరాత్రి ఒక పరిశ్రమలో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు స్థావరంపై దాడి చేసి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఐదు సెల్ఫోన్లు, రూ.2.06లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. (బేతంచర్ల) -
పేకాట శిబిరంపై పోలీసులు దాడి
సికింద్రాబాద్: వారణాసి గూడ ప్రాంతంలో పేకాట శిబిరంపై శనివారం పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్టు చేశారు. వీరిలో ఓ ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కూడా ఉన్నాడు. పోలీసులు నిందితుల నుంచి రూ. 16 వేల నగదు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించామని పోలీసులు తెలిపారు. -
ట్రాక్టర్‌పై పేకాటరాయుళ్లు ఊరేగింపు
కర్నూలు: కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండల కేంద్రంలోని పేకాట క్లబ్‌పై మంగళవారం పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు. ఈ సందర్బంగా 50 మంది పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాటరాయుళ్ల వారి వద్ద నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లుతోపాటు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పేకాటరాయుళ్లను ట్రాక్టర్‌పై ఊరేగిస్తూ... పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొలిమిగుండ్లలో పేకాటరాయుళ్లు నిత్యం పేకాట క్లబ్లో కాలం వెళ్లబుచ్చుతున్నారు. దాంతో వారి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ క్రమంలో పోలీసులు ముకుమ్మడి దాడులు నిర్వహించారు.