ganapathi puja
-
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్!
విలేజ్ అండ్ వింటేజ్ స్టైల్‌ని ఇప్పుడు యూత్ ఫాలో అవుతోంది. ఫోక్ సాంగ్స్‌ని ఆనందించినట్టే ఫోక్ డ్రెస్సింగ్‌తో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. ట్రెండ్‌ను ఫాలో అవ్వద్దు, ట్రెండ్‌సెట్టర్‌గా ఉండాలి అనే ట్యాగ్‌తో కొంత వెస్ట్రన్ టచ్‌ని జత చేసి మరీ మెరిసిపోతున్నారు. ఈ గణపతి నవరాత్రులకు మనదైన కళతో వెలిగి పోవాలనుకునేవారికి ఈ స్టైల్ సరైన ఎంపిక అవుతుంది. ధోతీ ప్యాంట్స్‌లో ఎన్నో మోడల్స్ వచ్చాయి. ఇవి అబ్బాయిల కోసమే అనేది పాత మాట. ప్రాచీన జానపద మూలాంశాలతో మనదైన సంప్రదాయ కళతో రూపొందింది ఈ స్టైల్. టులిప్ ప్యాంట్‌గా టర్న్ అయిన ఈ స్టైల్ ఈ నవరాత్రి వేడుకలలో హైలైట్ కానుంది. హెవీ ఎంబ్రాయిడరీ, పొట్లీ, షెల్ లేస్ ఉన్న ఫ్లెయిరీ కేడియా టాప్ నవరాత్రి ఉత్సవంలో రాక్ అండ్ రోల్ చేయడానికి పర్ఫెక్ట్ అవుట్‌ఫిట్. ఇవి విదేశాలలోనూ చాలా ప్రాచుర్యం పొందాయి. చందేరీ, మధుబని, బ్లాక్ ప్రింట్లతో కలిపి ఈ ప్రత్యేకమైన దుస్తులను సిద్ధం చేస్తున్నారు డిజైనర్లు. షర్ట్ అండ్ స్కర్ట్ ప్రింటెడ్ స్కర్ట్ లేదా పలాజో స్కర్ట్, కాలర్ నెక్ షర్ట్ సౌకర్యంగానూ ఉంటుంది. విలేజ్ స్టైల్‌కి వెస్ట్రన్ టచ్ ఇచ్చినా సంప్రదాయ లుక్‌తో ఆకట్టుకుంటుంది. ట్రైబల్ జ్యువెలరీ ధరిస్తే చాలు న్యూ లుక్‌తో మెరిసిపోతారు. చెక్స్ శారీస్.. సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా మనదైన సంస్కృతిని ప్రతిబింబించేది చీరకట్టు. మామూలు రోజుల్లో ఎలా ఉన్నా, పండగలు, ప్రత్యేక రోజుల్లో మాత్రం చీర ధరించడం ఇప్పటికీ చూస్తుంటాం. అయితే.. వింటేజ్, విలేజ్‌తో పాటు ఫోక్ స్టైల్ కూడా కట్టులో తీసుకురావాలంటే మాత్రం చెక్స్ కాటన్ శారీ, సిల్వర్ జ్యువెలరీ మంచి ఎంపిక అవుతుంది. మనవైన హ్యాండ్లూమ్స్ ఇక్కత్, బ్లాక్ ప్రింట్ అనార్కలీ, అంగరఖా, లాంగ్ గౌన్లు విలేజ్ స్టైల్లో ఆకట్టుకుంటాయి. ఘాగ్రా లేదా ఏదైనా పట్టు లెహంగా వంటివి ధరించినప్పుడు పటోలా దుపట్టాలు వేసుకుంటే విలేజ్ స్టైల్‌కి దగ్గరగా ఉన్నట్టే కాదు ప్రత్యేకంగానూ కనిపిస్తారు. (చదవండి: ఏకే ఫ్లవర్ కాదు ఫైర్ బోల్ట్ -
గాందీ భవన్లో గణపతి పూజ
-
ప్రపంచమంతటా ప్రథమ దేవుడు
సృష్టికి సంకేతం - గణపతి. అందుకే, ఆయనకు ప్రథమ పూజ చేస్తాం. సాక్షాత్తూ, ఈశ్వరుడు కూడా ఏ యుద్ధానికి వెళ్ళినా, ముందుగా గణపతి పూజ చేసి వెళ్ళేవాడని మన పురాణాలు చెబుతున్నాయి. ముక్కోటి దేవతలను ఒక్కటిగా పూజించే సంస్కృతి మన దేశానిది. అయితే, ప్రధానంగా ఏ దేవీదేవతలను ఆరాధిస్తున్నమన్న దాన్ని బట్టి ఆరు వైదికమతాలుగా పేర్కొన్నారు. ఈ షణ్మతాలలో గణపతిని ఆరాధించే వారు ‘గాణాపత్యులు’. గణపతి పేరు చెప్పగానే హిందువుల దేవుడనీ, మన దేశానికే పరిమితమనుకొంటే పొరపాటే. చైనా, జపాన్, శ్రీలంక, ఇండొనేసియా, థాయిలాండ్, కంబోడియా, ఇరాన్లలో గణపతి విగ్రహాలు, ఆరాధన కనిపిస్తాయి. జైనం, బౌద్ధాల్లోనూ వినాయకారాధన ఉంది. జైనంలో.. బౌద్ధంలో.. విఘ్నాధిపతే! మన విఘ్నాలకు అధిపతిగా కొలుచు కొనే గణపతికి సంపదలనిచ్చే కుబేరుడి గుణాలను కూడా జైన మతంలో ఆపాదించారు. ఏ కొత్త పని మొదలెట్టాలన్నా స్వామిని పూజించి, ఆ తరువాతే పని చేపట్టాలనే పద్ధతిని ఇవాళ్టికీ శ్వేతాంబర జైనులు పాటిస్తారు. బౌద్ధమతంలోనూ వినాయకుడున్నాడు. రాగతాళయు క్తంగా నృత్యం చేస్తున్న ‘నృత్త గణపతి’గా ఆయన బొమ్మలు కనిపిస్తాయి. అక్కడా విఘ్నాలను తొలగించే దేవుడిగానే ఆయనను కొలుస్తారు. జపాన్‌లో ప్రేమికుల దైవం గణపయ్యను జపాన్‌లో ‘కాంగిటెన్’ అంటారు. వారి దృష్టిలో అదృష్టప్రదాత. అక్కడి పెద్దవాళ్ళ దృష్టిలో ఆయన వ్యాపారంలో విజయమిచ్చే విఘ్నాధిపతైతే, ప్రేయసీప్రియులకు ‘ప్రణయదేవుడు’. ప్రేమ ఫలించడానికి వారు గణేశుణ్ణి పూజిస్తారు. థాయిలాండ్‌లో... ఫైనార్ట్స్ చిహ్నంలో... విద్య, వాణిజ్యం, కళలకు సంబంధించిన దేవుడు కాబట్టి, థాయి లాండ్లో ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనార్ట్స్’ చిహ్నంలోనూ గణేశుడి బొమ్మ ఉంటుంది. వ్యాపారానికీ, దౌత్యానికీ గణేశుడే అధిపతి అని బ్యాంకాక్ ప్రజల విశ్వాసం. అక్కడ ‘వరల్డ్ ట్రేడ్ సెంటర్’లో ఆయన విగ్రహముం టుంది. ఇక ఇండొనేసియాలో గణపతిని జ్ఞానప్రదాతగా కొలుస్తారు. ఇలా దేశదేశాల్లో గణపతి ఆరాధనున్నా, ప్రత్యేకించి భాద్రపద మాసంలో గణపతిని ప్రధానదైవంగా అర్చించే సంప్రదాయం మనది. ఇప్పటికీ ఏ దేవతా పూజ చేసినా మొదట గణపతి పూజ చేయకుండా చేయం కాబట్టి, మనందరం గాణాపత్యులమే. ఆయనే పరబ్రహ్మ స్వరూపమ్. ‘తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీ మహి, తన్నో దంతిః ప్రచోదయాత్’. - రెంటాల జయదేవ -
బందోబస్తుకొస్తే అన్నీ బాధలే..!
దాదర్, న్యూస్‌లైన్: ‘గణపతి ఉత్సవాల బందోబస్తు నిమిత్తం నగరానికి వస్తే, ఎలాంటి సౌకర్యాలు కల్పించలేదు. పగలంతా డ్యూటీ..రాత్రి పూట దోమలు బెడద. క్రీమ్‌లు, మస్కిటో కాయిల్, నెట్లకు తమ సొంత డబ్బులు వెచ్చిస్తున్నాం. వర్షం వస్తే నీరంతా గది లోపలికి వస్తోంది. ఆ రాత్రంతా నిద్ర ఉండదు, లగేజీలకు భద్రతల లేదు. వంద గొడుగులు అందించాలని నగర పోలీసు అధికారులకు మొరపెట్టుకొన్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు ఒక్క గొడుగు అందజేయలేదు’అని గుజరాత్ బీఎస్ఎఫ్ జవాన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొర సౌకర్యాలు ముంబైలోని ప్రసిద్ధ లాల్బాగ్ చా రాజా గణేషుడి బందోబస్తులో పాల్గొన్నగుజరాత్‌కు చెందిన బార్డర్ సెక్యురిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) జవాన ్లకు నగర పోలీసుల ఎలాంటి సౌకర్యాలు కల్పించకపోవడంతో ఈ దుస్థితి దాపురించింది. భక్తులకు భద్రతను అందించేందుకు దాదాపు 200 మంది జవాన్లు అరకొర సౌకర్యాల మధ్య ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. పరేల్ లోని బృహన్ముంబై మున్సిపల్ పాఠశాలను వీరికి కేటాయించారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. గదులు చిన్నపాటి వర్షం వచ్చినా కురుస్తున్నాయి. దోమల బెడద తీవ్రంగా ఉండడంతో ఫ్లోర్‌పై నిద్ర పోవాల్సి వస్తుంద ని, తరచూ అనారోగ్యానికి గురవుతున్నామని జవాన్లు వాపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు మాత్రం వీరి గురించి ఆలోచించిన పాపాన పోలేదు. డ్యూటీ అయిపోయి గుడారానికి వస్తే అక్కడా అసౌకర్యాలతో అవస్థలు తప్పడం లేదని జవాన్లు వాపోతున్నారు. సమస్య పరిష్కారానికి కృషి : డీసీపీ ముంబై పోలీస్ అధికార ప్రతినిధి, డీసీపీ ధనుంజయ్ కులకర్ణి మాట్లాడుతూ..సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని, ఈవిషయమై ఉన్నతాధికారులతో మాట్లాడుతానని చెప్పారు. ఈ అంశాన్ని తక్షణమే పరిశీలించి, ఇందుకు సంబంధించిన చర్యలు చేపడుతామని లాల్బాగ్చ రాజా వద్ద భద్రతను పరిశీలిస్తున్న డీసీపీ అశోక్ డుధే తెలిపారు. -
గణపతి పూజ చేయండిలా...
-
నీ రూపం.. అపురూపం..