gandi temple
-
అంజన్న సాక్షిగా టీటీడీ పరిధిలోకి గండి
సాక్షి, చక్రాయపేట(కడప) : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చిన మేరకు జిల్లాలోని గండి ఆలయం టీటీడీ పరిధిలో చేరింది. రాయల సీమ జిల్లాల్లో పేరు ప్రఖ్యాతులు గాంచిన చక్రాయపేట మండలం,మారెళ్ల మడక గ్రామం గండి క్షేత్రంలో వెలసిన శ్రీవీరాంజనేయ స్వామి ఆలయ బాధ్యతలను బుధవారం టీటీడి అధికారులకు గండి ఆలయ అధికారి అప్పగించారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం ఉదయం 10 గంటలకు ముందుగా సిద్ధం చేసిన ఫైళ్లపై ఆలయ అధికారి పట్టెం గురుప్రసాద్ తొలి సంతకం చేయగా టీటీడీ డిప్యూటీæ ఈఓ గోవింద రాజన్ రెండవ సంతకం చేసి ఆలయాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆలయంతో పాటు గుడికి సంబందించిన స్థిర,చరాస్థులు,బంగారు,వెండితో పాటు ఇక్క డ పనిచేస్తున్న అందరు ఉద్యోగులను టీటీడీకి అప్పగిస్తున్నట్లు గురుప్రసాద్ ప్రక టించి సంబంధిత ఫైల్‌ను టీటీడీ డిప్యూటీ ఈవోకు అందజేశారు.ఆలయాన్ని టీటీడి వారికి అప్పగించే సమయానికి ఎఫ్డీలు,బ్యాంక్ అకౌంట్లతో కలపి రూ. 4,33,71,153 నగదు,సుమారు 900 గ్రాముల బంగారు,వంద కిలోల వెండితో పాటు సుమారు13 ఎకరాల భూమిని ఉన్నట్లు గురుప్రసాద్ విలేకరుల సమావేశంలో తెలిపారు .ఇదంతా కూడా ఇకపై టీటీడీ వారి ఆధ్వర్యంలోనే ఉంటాయని వాటి బాధ్యత కూడా వారిదే నని చెప్పారు. టీటీడీ ఎస్టేట్ అధికారి విజయసారధి,సాధారణ పరిపాలనా విభాగం డిప్యూటీ ఈవో సుధారాణి,ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్,ఏవిఎస్వో పవన్ కుమార్‌తో పాటు రెవెన్యూ,జ్యువెలరి,హెల్త,విద్యుత్ తదితర శాఖలకు చెందిన అధికారులు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వ జీఓపై హైకోర్టుస్టే: గండి ఆలయాన్ని టీటీడీలో విలీనం చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి అనే భక్తుడు జీవో రద్దు చేయాలని కోరుతూ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.దీనిపై కోర్టు జీవో రద్దు చేసింది. దీనిపై తాము నిర్ణయించుకున్న సమయం మేరకు ఉదయం 10 గంటలకే ఆలయాన్ని విలీనం చేసుకున్నామని అలాంటప్పుడు మధ్యలో జీవో రద్దు ఎలా చేస్తారని టీటీడీ∙తరపు న్యాయవాది వాదించడంతో స్టే వెకేట్ చేసుకొనేందుకు పిటీషన్ వేసుకోవాలని.. కేసును 30వ తేదీకి వాయిదా వేసింది.దీంతో టీటీడీ,దేవదాయ శాఖల అధికారులు కోర్టులో పిటీషన్ వేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
చక్రాయపేట : గండి క్షేత్రం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలిలోకి వెళ్తే... చిలేకంపల్లెకు చెందిన సుబ్బరాయుడు(29) ట్రిపుల్ ఐటీలో సెక్యూరిటీ గార్డుగా పని చేసే వాడు. ఆయన డ్యూటీ ముగించుకొని తన మామ లక్కిరెడ్డిపల్లె మండలం చెంచోళ్లపల్లెకు చెందిన వెంకటేశ్వర్లుతో కలిసి వస్తున్నారు. మార్గం మధ్యలోని అద్దాలమర్రి క్రాస్ సమీపాన సుబ్బరాయుడు మూత్ర విసర్జన చేస్తుండగా ఆటో వచ్చి వెనుక నుంచి ఢీకొనడంతో మృతి చెందాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇడుపులపాయ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
గండికి భారీ ఆదాయం
చక్రాయపేట : జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి వీరాంజనేయస్వామి ఆలయ హుండీని బుధవారం లెక్కించారు. ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో రూ. 25, 21, 685లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. శ్రావణ మాసం కావడంతో ఈ నెలలో భారీ సంఖ్యలో భక్తులు అంజన్నను దర్శించుకున్నారు. హుండీలో నగదుతోపాటు 60గ్రాముల బంగారం, 1.872గ్రాముల వెండి, 26 అమెరికా డాలర్లు, 12సింగపూర్ డాలర్లు, పదిజర అరబిక్ హంసలు, 31కువైట్ డాలర్లు వచ్చాయని అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మెన్ రాజారావుతోపాటు పాలకమండలి సభ్యులు, బ్యాంకు సిబ్బంది, ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గండి జనసంద్రం
చక్రాయపేట : ప్రసిద్ధి గాంచిన శ్రీ గండి వీరాంజనేయస్వామి ఆలయం భక్తజన సంద్రంగా మారింది. శ్రావణ మాస ఆఖరి శనివారం కావడంతో జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచి పాపాఘ్ని నదిలో వాటర్ షవర్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించి స్వామి దర్శనానికి క్యూలైన్లలో నిలుచున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్‌లు ఆంజనేయస్వామి మూలవిరాట్‌ను ప్రత్యేకంగా తమలపాకులు, పూలతో అలంకరించారు. త్రికాల ఆరాధన, అభిషేకం, మహా నైవేద్యం, కుంకుమార్చన, ఆకు పూజ తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ సహాయ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, దేవస్థాన చైర్మన్ వి.రాజారావులతోపాటు పాలక మండలి సభ్యులు భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు. రాత్రి ఒంటె వాహనంపై హనుమంతుడిని కొలువు దీర్చి క్షేత్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. వీరపునాయునిపల్లె మండలం ఇందుకూరుకు చెందిన చప్పిడి నాగార్జునరెడ్డి, గండి అంజన్న స్వామి శాశ్వత ఉభయదారులు రూ.1.50 లక్షలను ఉత్సవ విగ్రహానికి పూలమాలలు, బాణా సంచా, వివిధ రకాల వాటికి విరాళంగా ఖర్చు చేశారు. భక్తుల కాలక్షేపం కోసం హరికథలు, బుర్రకథలు, చెక్కభజనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. పాపాఘ్ని నదిలో వివిధ రకాల రంగుల రాట్నాలు, వివిధ రకాల అడవి జంతువులు బొమ్మలు ఆకట్టుకున్నాయి. ఆలయానికి వివిధ రకాల రూపంలో దాదాపు రూ.14 లక్షల మేర ఆదాయం వచ్చినట్లు అసిస్టెంటు కమిషనర్ తెలిపారు. ఆలయ సమీపంలో చక్రాయపేట వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో మెడికల్ క్యాంపు నిర్వహించారు. పులివెందుల సీఐ ప్రసాద్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్ఐలు మధుమల్లేశ్వరరెడ్డి, గోవిందరెడ్డ, సయ్యద్ హాసం, అనిల్‌కుమార్, నరేంద్ర, మస్తాన్ బాషాలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.