ganesh maharaj
-
వినాయకుడి గెటప్లోని ఈ నటుడెవరో మీకు తెలుసా?
Sri Vinayaka Vijayam Movie: కొన్ని సినిమాలు ఎప్పటికీ వన్నెతరగవు. అందుకే బుల్లితెరపై ఎన్నిసార్లు ప్రజెంట్ చేసినా వ్యూయర్స్ ఆదరిస్తూనే ఉంటారు. ముఖ్యంగా పండుగల లాంటి టైంలో వీటి ప్రత్యేకత ఏంటో జనాలకు తెలిసి వస్తుంది కూడా. అలాంటి సినిమాల్లో ‘శ్రీ వినాయక విజయం’ గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. ప్రతీ వినాయక చవితికి క్రమం తప్పకుండా ఈ సినిమా టీవీలో వస్తూనే ఉంటుంది. అయితే ఈ ఏడాది మళ్లీ టెలికాస్ట్ ప్రొమో రిలీజ్ కావడంతో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన చర్చ మొదలైంది. పూర్తి స్థాయిలో గణేషుడి కథను చూపిస్తూ తెలుగులో వచ్చిన మొదటి సినిమా ‘శ్రీ వినాయక విజయం’(1979). ఈ మూవీలో కృష్ణంరాజు, వాణిశ్రీలు శివపార్వతులుగా నటించారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో వినాయకుని జన్మ వృత్తాంతం చక్కగా వివరించే ప్రయత్నం చేశారు. ‘ఎవరవయ్యా.. ఎవరవయ్యా’ అంటూ సాగే గానం.. దేవులపల్లి రచన, సాలూరి స్వరాలు, సుశీలమ్మ పాడిన పాట ఇప్పటికీ పండపూట టీవీల్లో మారుమోగుతుంటుంది. అయితే ఆ వినాయకుడి గెటప్‌లో ఉన్న ఆర్టిస్ట్ ఎవరంటూ? గూగుల్‌ను ఆశ్రయించడంతో సినిమా ట్రెండింగ్‌లోకి వచ్చింది. శ్రీ వినాయక విజయం చిత్రం భారీ సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో బాల గణేషుడిగా కనిపించింది బేబీ లక్ష్మి సుధా. ఆ తర్వాత ఏనుగు తల గెటప్‌తోనూ కాసేపు ఈ చిన్నారి అలరించింది. ఇక పెద్దయ్యాక వినాయకుడి గెటప్‌లో నటించింది ఎంజీవీ మదన్‌గోపాల్ అనే ఆర్టిస్ట్. ఈయన గురించి పూర్తి సమాచారం, ఫొటో గురించి .. వెతకాలని ప్రయత్నిస్తున్నారు చాలామంది. కానీ, ఎలాంటి సమాచారం దొరకడం లేదు. అలా చాలా మంది వెతకడం వల్ల వినాయక విజయం మూవీ గూగుల్ ద్వారా సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రెండ్ అవుతోంది ఇప్పుడు. చదవండి: ‘తండ్రి ఎవరు?’.. ఫైర్ అయిన హీరోయిన్ -
ఆర్టీసీకి ‘చవితి’ ఆదాయం రూ. 6.5 కోట్లు
సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్న మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఎమ్మెమ్మార్టీసీ)పై వినాయకుడు చల్లని చూపు చూసినట్లు తెలుస్తోంది. గణేశ్ ఉత్సవాల సందర్భంగా అదనంగా నడిపిన బస్సుల వల్ల ఆర్టీసీకి ఏకంగా రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే ఇది రెట్టింపు అని ఆర్టీసీ వర్గాలు తెలిపాయి. ఏటా గణేశ్ ఉత్సవాల సమయంలో ముంబై, ఠాణే నుంచి లక్షలాది మంది కొంకణ్ వాసులు తమ స్వగ్రామాలకు తరలివెళతారు. పెరిగిన రద్దీని దష్టిలో ఉంచుకుని దాదాపు 12 రోజులపాటు కొంకణ్ రైల్వే విభాగం 60 ప్రత్యేక రైళ్లు నడపగా, ఆర్టీసీ అదనంగా రెండు వేల బస్సులు నడిపింది. అయినప్పటికీ ఇవి ఎటూ చాలలేదు. దీంతో ఠాణే, ముంబైలో ఉంటున్న కొంకణ్ వాసులు స్వగ్రామాలకు వెళ్లాలంటే ఉత్సవాల సమయంలో ప్రైవేటు బస్సులు, సుమోలు, కార్లు తదితర వాహనాలను ఆశ్రయించక తప్పలేదు. ప్రయాణికుల అవసరాల బట్టి ప్రై వేటు వాహన యజమానులు అడ్డగోలుగా చార్జీలు వసూలు చేయడంతో కొందరు నిలబడైనా సరే ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించడం మంచిదనుకున్నారు. దీంతో ఆర్టీసీ ఖజానాలోకి రూ.ఆరున్నర కోట్ల ఆదాయం వచ్చి చేరింది. ముంబై, ఠాణే నుంచి బయలుదేరిన బస్సుల ద్వారా రూ.నాలుగు కోట్లు, తిరుగు ప్రయాణంలో రూ. రెండున్నర కోట్లు వచ్చాయని ఆర్టీసీ రీజినల్ మేనేజరు రాహుల్ తోరో చెప్పారు.