Gang Rape Attempt
-
మహారాష్ట్రలో దారుణం.. సమాజం ఎటు పోతోంది!
దేశంలో రోజురోజుకు మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఏదో ఒక చోట కొందరు మృగాలు రెచ్చిపోతూ దారుణాలను పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబై నగరంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముగ్గురు యువకులు ఓ వివాహితపై లైంగిక దాడికి పాల్పడి అనంతరం.. పైశాచికత్వం ప్రదర్శించారు. వివరాల ప్రకారం.. ముంబైలోని కుర్లా ప్రాంతంలో బాధితురాలు నివాసం ఉంటోంది. కాగా, బుధవారం తెల్లవారుజామున అదే ప్రాంతానికి ముగ్గురు యువకులు ఆమె ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం, ఆమెను కత్తిలో బెదిరించారు. ఈ క్రమంలోనే ఆమెపై ముగ్గురు యువకులు.. ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. అకృత్యానికి పాల్పడుతూనే మహిళ పట్ల పైశాచికత్వం ప్రదర్శించారు. లైంగిక దాడి చేస్తున్న క్రమంలో ఆమె ప్రైవేటు భాగాలపై సిగరెట్‌తో కాల్చుతూ రక్షసానందం పొందారు. ఆమె ఛాతీ, రెండు చేతులపై పదునైన ఆయుధంతో దాడి చేశారు. నిందితులలో ఒకరు ఈ సంఘటనను వీడియో చేశారు. అనంతం, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని బెదిరింపులకు గురి చేశారు. కాగా, బాధితురాలు తనకు జరిగిన అన్యాయం మరొకరి జరగొద్దనే కారణంతో ఎన్జోవోలను ఆశ్రయించింది. దీంతో, నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముగ్గురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్), 376డి (గ్యాంగ్ రేప్), 377 (అసహజ సెక్స్), 324 (ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపరచడం), ఇతర నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసు బృందాలు గాలిస్తున్నట్టు స్పష్టం చేశారు. -
నిజామాబాద్‌లో దారుణం!
సాక్షి, నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కోటగల్లీ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికను బెదిరించి గత ఏప్రిల్ 25న పక్కింటి అబ్బాయి అత్యాచారం చేశారు. ఆ దృశ్యాలను తన సెల్ఫోన్లో చిత్రీకరించి.. అప్పటినుంచి బాలికను బ్లాక్‌మెయిల్‌ను చేస్తున్నాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఆరు నెలల కిందట బర్త్ డే పార్టీ పేరుతో మాయమాటలు చెప్పి నిందితుడు మరో ముగ్గురితో కలిసి.. బాలికను తమ వెంట తీసుకెళ్లాడు. నాగారం ప్రాంతానికి తీసుకెళ్లిన నలుగురు నిందితులు బాలికపై సామూహిక అత్యాచార యత్నం చేశారు. బాలిక ఎలాగోలా వారి నుంచి తప్పించుకుంది. ఈ ఘటన గురించి బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆలస్యంగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దీంతో సంపత్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదుచేసినట్టు నిజామాబాద్ సీఐ సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
ఆ నలుగురినీ నడివీధిలో చెప్పులతో..
-
ఆ నలుగురినీ నడివీధిలో..
సాక్షి, భోపాల్ : యువతిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన నలుగురు రేపిస్టులను పోలీసులు భోపాల్ పట్టణ వీధుల్లో బహిరంగంగా పరేడ్ చేయించారు. 20 ఏళ్ల కాలేజ్ విద్యార్థిని మహారాణా ప్రతాప్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఉదయం ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు అదేరోజు నిందితులను అదుపులోకి తీసుకుని పట్టణ వీధుల్లో తిప్పారు. రేపిస్టులపై ఈ సందర్భంగా పలువురు యువతులు, మహిళలు చెప్పులతో దాడి చేశారు. నిందితుల్లో ఒకరైన 21 ఏళ్ల శైలేంద్ర దంగి బాధితురాలి కాలేజ్‌లో ఆమె కన్నా ఏడాది సీనియర్. శనివారం ఎంపీ నగర్ ప్రాంతంలో ఉన్న ఓ రెస్టారెంట్‌కు రావాలని ఆమెను కోరాడు. రెస్టారెంట్లో కలుసుకున్న వీరిద్దరికీ ఓ విషయంలో వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఆమె సెల్‌ఫోన్ లాక్కున్న శైలేంద్ర బాధితురాలిని అక్కడకు సమీపంలోని తన స్నేహితుడు సోనూ దంగీ రూమ్‌కు తీసుకువెళ్లాడు. అప్పటికే సోనూతో పాటు అక్కడ మరో ఇద్దరు స్నేహితులు ధీరజ్ రాజ్పుట్, చిమన్ రాజ్పుట్లున్నారు. సోను, చిమన్లు సహకరించగా శైలేంద్ర, ధీరజ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆమెను విడిచిపెడుతూ ఈ విషయం ఎవరికైనా చెబితే తనను, తన కుటుంబాన్ని హతమారుస్తామని హెచ్చరించారు. ఆదివారం ఉదయం ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో భోపాల్ పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులందరూ నేరాన్ని అంగీకరించడంతో వారిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మహిళల్లో ధైర్యాన్ని నింపి వేధింపుల ఘటనలపై వారు ఫిర్యాదు చేసేందుకు ముందుకొస్తారనే ఉద్దేశంతోనే నిందితులను వీధుల్లో తిప్పామని భోపాల్ ఐజీ జైదీప్ కుమార్ చెప్పారు. -
భర్తను వదిలించుకుని ప్రియుడితో పెళ్లి.. గ్యాంగ్ రేప్ డ్రామా!
సాక్షి, కర్ణాటక: ఎలాగైనా భర్తను వదిలించుకొని ప్రియుడిని పెళ్లి చేసుకొవడానికి గ్యాంగ్ రేప్ నాటకం ఆడింది ఓ యువతి. ఈ ఘటన బ్యాటరాయనపురలో చోటుచేసుకుంది. ఈ నెల 5న ఇంటి నుంచి గార్మెంట్స్‌కు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్న తనని గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్ లోపలికి లాక్కొని అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర కిందట 20 ఏళ్ల యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన సదరు యువతి తన సొంత బంధువులకు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఎలాగైనా సరే ప్రియుడిని రెండో పెళ్లి చేసుకోవాలని పథకం పన్నింది. అయితే ఈనెల 5వ తేది ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గార్మెంట్స్‌కు నడుచుకుని వెళ్తుండగా వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి తనని లోపలకు లాక్కొన్నాడని, బంగారు నగలు తీసుకున్నారని, అనంతరం ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశాడని బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు విచారణలో ఆ మహిళ పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అసలు విషయం రాబట్టారు. తనపై గ్యాంగ్‌రేప్ ఆరోపణలు వస్తే భర్త తనను వదిలించుకుంటారనే నమ్మకంతో ఈ గ్యాంగ్‌రేప్ కుట్ర రూపొందించినట్లు విచారణలో బయటపడింది. -
యువతిపై సామూహిక అత్యాచారయత్నం
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని పశువుల ఆసుపత్రి వద్ద సోమవారం అర్ధరాత్రి ఓ యువతిపై నలుగురు యువకులు అత్యాచారానికి యత్నించారు. దాంతో యువతి గట్టిగా అరవడంతో స్థానికులు వెంటనే స్పందించి యువతిని యువకుల వద్ద నుంచి కాపాడే ప్రయత్నం చేశారు.ఆ క్రమంలో సదరు యువతికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యాచారానికి యత్నించిన యువకులపై స్థానికలు గట్టిగా ఎదురు దాడికి దిగారు. దాంతో యువకులు అక్కడి నుంచి పరారైయ్యారు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని యువతిని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.