భర్తను వదిలించుకుని ప్రియుడితో పెళ్లి.. గ్యాంగ్ రేప్ డ్రామా! | gagrape drama to marry with lover | Sakshi
Sakshi News home page

భర్తను వదిలించుకుని ప్రియుడితో పెళ్లి.. గ్యాంగ్ రేప్ డ్రామా!

Published Mon, Jan 8 2018 9:47 PM | Last Updated on Mon, Jan 8 2018 9:49 PM

gagrape drama to marry with lover - Sakshi

సాక్షి, కర్ణాటక: ఎలాగైనా భర్తను వదిలించుకొని ప్రియుడిని పెళ్లి చేసుకొవడానికి గ్యాంగ్‌ రేప్‌ నాటకం ఆడింది ఓ యువతి. ఈ ఘటన బ్యాటరాయనపురలో చోటుచేసుకుంది.  ఈ నెల 5న  ఇంటి నుంచి గార్మెంట్స్‌కు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్న తనని గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్‌ లోపలికి లాక్కొని అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర కిందట 20 ఏళ్ల యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన సదరు యువతి తన సొంత బంధువులకు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఎలాగైనా సరే ప్రియుడిని రెండో పెళ్లి చేసుకోవాలని పథకం పన్నింది. అయితే ఈనెల 5వ తేది ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గార్మెంట్స్‌కు నడుచుకుని వెళ్తుండగా వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి తనని లోపలకు లాక్కొన్నాడని, బంగారు నగలు తీసుకున్నారని,  అనంతరం ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశాడని బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు  విచారణలో ఆ మహిళ పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అసలు విషయం రాబట్టారు. తనపై గ్యాంగ్‌రేప్‌ ఆరోపణలు వస్తే భర్త తనను వదిలించుకుంటారనే నమ్మకంతో  ఈ గ్యాంగ్‌రేప్‌ కుట్ర రూపొందించినట్లు విచారణలో బయటపడింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement