fake case
-
"వీళ్లకు అది కూడా తెలియదా.." బాబును నవ్వులపాలు చేసిన రఘురామ
-
MP: గిరిజనుడి ఆవేదన.. సర్కార్‌పై పదివేల కోట్లకు దావా
తప్పుడు అభియోగాలతో చేయని నేరానికి జైలు శిక్ష అనుభవించాడతను. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆ గిరిజనుడు ఊరుకోలేదు. న్యాయపోరాటానికి దిగాడు. ఏకంగా ప్రభుత్వాన్నే కోర్టుకు ఈడ్చాడు. ఫేక్ రేప్ కేసులో ఇరికించారని, జైలు శిక్ష అనుభవించేలా చేసి తన జీవితం నాశనం చేశారంటూ పరిహారం కోసం సర్కార్‌పై పదివేల కోట్ల రూపాయలకు దావావేశాడు. ఇండోర్: మధ్యప్రదేశ్ ప్రభుత్వంపై ఓ గిరిజనుడు కోర్టుకు ఎక్కాడు. కంతూ అలియాస్ కంతూలాల్ బీల్(35)ను గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడనే ఆరోపణలతో జైలుకు పంపారు పోలీసులు. ఓ వివాహితను మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడనే అభియోగం నమోదు అయ్యింది అతనిపై. అక్టోబర్ 2018లో నమోదు అయిన కేసు అది. డిసెంబర్ 23, 2020 నుంచి రెండేళ్లపాటు శిక్ష అనుభవించాడతను. సుమారు 666 రోజుల శిక్ష తర్వాత.. అతను అమాయకుడని తేలడంతో రిలీజ్ అయ్యాడు.అన్యాయంగా అత్యాచార అభియోగాలతో తనను రెండేళ్లపాటు జైల్లో ఉంచారంటూ ఆ సమయంలో వాపోయాడతను. అయితే.. నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొవడం, జైలు శిక్ష తన జీవితాన్ని తలకిందులుగా చేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘‘దేవుడు ప్రసాదించిన జీవితంలో ఎన్నో విలువైన క్షణాలను దూరం చేసుకున్నా(ఉదాహరణకు శృంగార జీవితం)..’’ అంటూ పిటిషన్లో పేర్కొన్నాడతను. పరిహారంగా రూ. 10,006 కోట్ల రూపాయలకు అతను దావా వేసినట్లు తెలుస్తోంది. -
డబ్బులు ఇవ్వకుంటే నీపై కేసు పెడతాం.. మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
తిరువొత్తియూరు: అక్రమ కేసు నమోదు చేసిన పోలీసులు తనను అన్యాయంగా బెదిరిస్తున్నారంటూ ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వివరాలు.. మదురై బీపీ కులం ఇందిరా నగర్‌కు ఈశ్వరన్ (30). ఇతను గత 18వ తేదీ రాత్రి తల్లాకులం అవుట్‌పోస్టు అంబేడ్కర్ విగ్రహం వద్ద నిప్పు అంటించుకున్నాడు. ఇది చూసిన అక్కడ భద్రతలో వున్న పోలీసులు అతడిని మదురై ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులు అబద్దపు కేసు నమోదు చేసి ఓ తెల్లకాగితంలో సంతకం తీసుకోవడంతో ఈశ్వరన్‌పై నిప్పు అంటించుకున్నట్లు అతని బంధువులు తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరన్ ఒక వీడియోను విడుదల చేశాడు. అందులో తల్లకులం పోలీసులు తరచూ అబద్దపు కేసు నమోదు చేసి అరెస్టు చేసి తనకు నగదు ఇవ్వమని బెదిరిస్తున్నారని ఆరోపించాడు. లేకుంటే తనపై గంజా, మద్యం విక్రయం తదితర కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని బెదిరించారని వాపోయాడు. దీనివల్లే నిప్పు అంటించుకుని ఆత్మహత్యకు ప్రయతి్నంచానని తెలిపాడు. ఈవీడియో సామాజిక మాద్యమాల్లో వైరల్ అయ్యింది. ఈ క్రమంలో మదురై ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరన్ మంగళవారం రాత్రి మృతి చెందాడు. దీంతో ఈశ్వరన్ సోదరి శివగామి బాధ్యులైన పోలీసులను అరెస్టు చేయాలని ఫిర్యాదు చేశారు. -
నా భర్త వేధిస్తున్నాడు
నాగోలు: తన భర్త పోలీస్ ఉద్యోగంలో ఉండి పలుకుబడితో అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నాడని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించు కోవడంలేదని ఆరోపిస్తూ ఓ మహిళ తన ముగ్గురు కుమారులను తీసుకుని ఎల్బీనగర్లోని రాచకొండ సీపీ క్యాంపు కార్యాలయం వద్ద సోమవారం ఆమె కిరోసిన్ పోసుకుని, పిల్లలకు పోసి ఆత్మహత్యా యత్నం చేయగా అక్కడే ఉన్న పోలీసులు, మీడియా ప్రతినిధులు అడ్డుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల ప్రకారం రంగారెడ్డి జిల్లా కరణ్‌కోట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్ఐగా పనిచేస్తున్న కోలుకులపల్లి రాజయ్యతో అదే ప్రాం తానికి రేణుకాగౌడ్తో ఓ కేసు విషయంలో పరిచయం ఏర్పడింది. రాజయ్య తన భార్య చనిపోయిందని నమ్మించి 2009లో యాదాద్రిలో ఆమెను వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి తాండూరు, పరిగి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో కొంతకాలం కాపురం పెట్టారు. అతడికి నగరానికి బదిలీ కావడంతో కుటుంబ సభ్యులను తీసుకువచ్చి ఎల్బీనగర్ ప్రాంతంలోని మన్సూరాబాద్‌లో కాపురం పెట్టాడు. వీరికి ముగ్గురు కుమారులు రాజేష్, రాంచరణ్, నర్సింహులు ఉన్నారు. సీఐగా ప్రమోషన్ వచ్చిన అనంతరం రాజయ్య రేణుకతోపాటు పిల్లలను పట్టించుకోవడం లేదు. ఇదే విషయంపై రేణుక సరూర్‌నగర్ మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేశాడని ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడం లేదని, సరైన న్యాయం చేయడంలేదని ప్రస్తుతం సంగారెడ్డిలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాజయ్య తన పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని, మరోభార్యతో వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌లో తనపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేయిస్తున్నారని మనస్థాపం చెందిన ఆమె సోమవారం మధ్యాహ్నం ఎల్బీనగర్ సీపీ క్యాంపు కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. వెంటనే పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసు కున్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్, వనస్థలిపురం ఏసీపీని పిలిపించి విషయంపై ఆరాతీశారు. గతంలోనే వివాహం జరిగిన రాజయ్య రేణుకకు, అన్యాయం చేయడంతో పాటు ప్రస్తుతం మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు విచారించి బాధితురాలికి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని సీపీ తెలిపారు. -
సంచలనాలే లక్ష్యం!
సాక్షి ప్రతినిధి కడప: అధికారుల మెప్పుకోసం అనామకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారా.. సిబ్బంది మాటలు నమ్మి ఉన్నతాధికారులు తప్పులో కాలేస్తున్నారా.. సంచలనాల కోసమే అడ్డదారులు ఎంచుకున్నారా.. అంటే అవుననే పరిశీలకులు వెల్లడిస్తున్నారు. అందుకు సాక్ష్యాధారాలతో ఫారెస్టుశాఖ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. ఆపై ఏకంగా డీఎఫ్ఓను బురడీ కొట్టించారు. చెక్క డిపోల నుంచి వంట చెరుకు వినియోగించే పాత మొద్దులు తీసుకెళ్లి అడవిలో ఎర్రచందనం దుంగలు స్మగ్లింగ్ చేస్తుంటే పట్టుబడినట్లుగా 12 సెక్షన్లతో కేసులు నమోదు చేసిన వైనమిది. ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టడంలో ఎవరికి వారు ఫోకస్ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈక్రమంలో అనామకులను అక్రమ కేసుల్లో ఇరికించి పబ్బం గడుపుకుంటున్నారు. ఆపై అంతర్జాతీయ స్మగ్లర్లతో లింకులున్నాయంటూ వెల్లడిస్తూ మీడియాకు ఎక్కుతున్నారు. ఇటీవల ఫారెస్టు యంత్రాంగం నమోదు చేసిన ఓ కేసు ఈ కోవకే చెందింది. వేంపల్లె రేంజ్, వెల్లటూరు బీట్ పరిధిలో గంగనపల్లె రిజర్వు ఫారెస్టు పరిధిలో ఓబుళరెడ్డి చెరువు వద్ద పట్టుబడినట్లు ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. షాసూన్వల్లీ, షేక్ మౌలాలీ, కరీముల్లా, సాదు శ్రీనివాసులు, షేక్ రాజాలను అరెస్టు చేశారు. వీరంతాఆగస్టు 12 రాత్రి 11.40 గంటల ప్రాంతంలో వెల్లటూరు సమీపంలోని ఓబుళరెడ్డి చెరువు సమీపంలో అరెస్టు చేసినట్లు రిమాండ్ రిపోర్టులో రాశారు. ఆమేరకు కడప డీఎఫ్ఓ శివప్రసాద్ నేతృత్వంలో ఆగస్టు 13న మీడియా సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. వారిలో పాత మొద్దులు విక్రయించి జీవనం పోసుకునే ముగ్గురిపై అక్రమ కేసు బనాయించారని తేటతెల్లమౌతోంది. ఆమేరకు ఫారెస్టు యంత్రాంగం చొప్పంచిన కట్టుకథను సీసీ కెమెరా ఫుటేజీలు బట్టబయలు చేస్తున్నాయి. చెక్క డిపోల వారిపై తప్పుడు కేసులు.... ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన షేక్ మౌలాలీ (శ్రీనివాసనగర్), షేక్ కరీముల్లా (రాయల్ ఫంక్షన్ హాల్) సాదు శ్రీనివాసులు (దేవాంగపేట) ముగ్గురు చెక్క డిపోలను నిర్వహిస్తున్నారు. పాత మొద్దులు టన్ను రూ.470తో కొనుగోలు చేసి వాటిని కూలీలు ద్వారా వంట చెరుకుగా మార్చి టన్ను రూ.550తో విక్రయించి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల నుంచి పాతచెక్క కొయ్యలను సేకరించి విక్రయించే నిమిత్తం ఆయా ప్రాంతాల్లో నిల్వ చేసుకున్నారు. కాగా ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 7.40 నిమిషాలకు క్వాలిస్ వాహనంలో ఓ బృందం చెక్క డిపోల వద్దకు చేరింది. చెక్క డిపోలో ఉన్న పాత మొద్దులను పరిశీలించింది. 10నిమిషాల్లో కొన్ని పాత మొద్దులతో పాటు నిర్వాహకులను అదే వాహనంలో తీసుకొని వెళ్లారు. ఇదంతా కూడా అందుబాటులో ఉన్న సీసీ కెమెరా ఫుటేజీల్లో రికార్డు అయింది. ఆగస్టు 8 రాత్రి నుంచి ఆ ముగ్గురు ఫారెస్టు అధికారుల అదుపులో ఉన్నారు. కాగా ఆగస్టు 12వ తేదీ రాత్రి పై ముగ్గురితో పాటు మరో ఇద్దరు ట్రాక్టర్లో దుంగలు తరలిస్తూ ఫారెస్టు సిబ్బందిని చూసి పరారీ అవుతుంటే చుట్టుముట్టి అందర్నీ అదుపులోకి తీసుకున్నట్లు కేసు నమోదు చేశారు. అదే విషయాన్ని రిమాండ్ రిపోర్టులో పొందుపర్చారు. ఆ ఐదుగురిలో ఎవరు దుంగలు నరికారు, ట్రాక్టర్ డ్రైవింగ్ చేసిందెవరు అన్న విషయాలను పొందుపర్చలేదు. మరోవైపు చెక్క డిపోనుంచి స్వాధీనం చేసుకున్న పాత మొద్దులను తోపడా చేయించి (పై తాట తీయించి) పట్టుబడిన ఎర్రచందనం దుంగలుగా నమోదు చేయించారు. ఆపై 12 సెక్షన్లతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. తెలిసీ చేసినా తెలియక చేసినా ఎర్రచందనం దుంగలు అందుబాటులో ఉంచుకోవడం నేరమే కావచ్చు. కాకపోతే అందుబాటులో ఉన్న పాత మొద్దులే ఎర్రచందనం దుంగలుగా కేసు నమోదు చేస్తే ఎవ్వరికి అభ్యంతరం లేదు. పైగా అడవిలోకి వెళ్లి అక్రమంగా ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నట్లుగా 12 సెక్షన్లతో కేసు నమోదు చేయడాన్ని ప్రజాస్వామ్యవాదులు తప్పుబడుతున్నారు. సంచలనాల కోసం రివార్డుల కోసం తప్పుడు కేసులు నమోదు చేయడంపై ఆక్షేపిస్తున్నారు. విద్యాధికులు కుటుంబం వీధిపాలు.... ప్రొద్దుటూరు పట్టణానికి చెందిని షేక్ కరీముల్లా, కలీమా దంపతులు విద్యాధికులు. కరీముల్లా ఎంబీఏ చదివారు, కలీమా ఎంఏ చేసింది. ఇరువురు అన్యోన్యంగా జీవిస్తున్నారు. వారు నివాసం ఉంటున్న ఏరియాలో కరీముల్లా మంచి మనస్సు ఉన్న వ్యక్తిగా స్థానికులు వెల్లడిస్తున్నారు. కాగా ఆ దంపతులు పాలిట ఫారెస్టు యంత్రాంగం కర్కశకంగా వ్యవహరించిందని పలువురు ఆరోపిస్తున్నారు. చెక్క డిపో నిర్వహణలో తప్పులు దొర్లి ఉంటే ఆమేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటే ఎవ్వరు అభ్యంతరం చెప్పకపోవచ్చు. కాగా ఫారెస్టు యంత్రాంగం అక్రమంగా రిజర్వు ఫారెస్టులోకి చొరబడి ఎర్రచందనం దుంగలను స్మగ్లింగ్ చేసినట్లుగా 12సెక్షన్లతో కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపారు. భర్తపై అక్రమ కేసులో బనాయించి అరెస్టు చేసిన విషయం తెలుసుకున్న కలీమా తల్లడిపోయింది. గర్భిణిగా ఉన్న అమె ప్రీ మెచ్యూరీటీ పాపకు జన్మనిచ్చిందని స్థానికులు వాపోతున్నారు. విద్యాధికులుగా ఉన్న ఆ దంపతుల పట్ల ఫారెస్టు యంత్రాంగం దారుణ వైఖరిని ప్రదర్శించిందని పలువురు వాపోతున్నారు. నాకేమీ తెలియదు: ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ నాగరాజు ఈవిషయమై డీఎఫ్ఓ నాగరాజు వివరణ కోరగా రెగ్యులర్ డీఎఫ్ఓ శివప్రసాద్ సెలవులో వెళ్లారు. కేసు పూర్వపరాలు తనకేమీ తెలియవని ఇన్‌ఛార్జి డీఎఫ్ఓ నాగరాజు సాక్షి ప్రతినిధికి వెల్లడించారు. తప్పుడు కేసులు ఉపేక్షించవద్దు ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టాల్సిందే. ఈ క్రమంలో అనామకులపై తప్పుడు కేసులు ఏమాత్రం ఉపేక్షించరాదు. ఎర్రచందనం ఉన్నట్లు గుర్తిస్తే ఆమేరకు కేసులు నమోదు చేసే ఎవ్వరికీ అభ్యంతరం చెప్పాల్సిన పనిలేదు. చెక్కడిపోల ద్వారా వంటచెరుకు విక్రయించుకునే వారిపై తప్పుడు చేసులు నమోదు చేయడం అన్యాయం. ఫారెస్టు రిమాండ్ రిపోర్టులోనే డొల్లతనం తేటతెల్లం అవుతోంది. అక్రమ కేసులు బనాయించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. తప్పుడు కేసులు నమోదు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి.జయశ్రీ, మానవ హక్కులవేదిక జిల్లా కన్వీనర్ -
భర్తను వదిలించుకుని ప్రియుడితో పెళ్లి.. గ్యాంగ్ రేప్ డ్రామా!
సాక్షి, కర్ణాటక: ఎలాగైనా భర్తను వదిలించుకొని ప్రియుడిని పెళ్లి చేసుకొవడానికి గ్యాంగ్ రేప్ నాటకం ఆడింది ఓ యువతి. ఈ ఘటన బ్యాటరాయనపురలో చోటుచేసుకుంది. ఈ నెల 5న ఇంటి నుంచి గార్మెంట్స్‌కు బయలుదేరి నడుచుకుంటూ వెళ్తున్న తనని గుర్తు తెలియని వ్యక్తులు వ్యాన్ లోపలికి లాక్కొని అత్యాచారం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ఏడాదిన్నర కిందట 20 ఏళ్ల యువతికి ఓ వ్యక్తితో వివాహం జరిగింది. పెళ్లైన సదరు యువతి తన సొంత బంధువులకు చెందిన ఓ యువకుడిని ప్రేమించింది. ఎలాగైనా సరే ప్రియుడిని రెండో పెళ్లి చేసుకోవాలని పథకం పన్నింది. అయితే ఈనెల 5వ తేది ఉదయం ఇంటి నుంచి బయలుదేరి గార్మెంట్స్‌కు నడుచుకుని వెళ్తుండగా వ్యాన్‌లో వచ్చిన ఓ వ్యక్తి తనని లోపలకు లాక్కొన్నాడని, బంగారు నగలు తీసుకున్నారని, అనంతరం ముగ్గురు వ్యక్తులు తనపై అత్యాచారం చేశాడని బ్యాటరాయనపుర పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు దర్యాప్తు చేసిన పోలీసులకు విచారణలో ఆ మహిళ పొంతనలేని సమాధానం చెప్పింది. దీంతో పోలీసులు తమదైన శైలిలో అసలు విషయం రాబట్టారు. తనపై గ్యాంగ్‌రేప్ ఆరోపణలు వస్తే భర్త తనను వదిలించుకుంటారనే నమ్మకంతో ఈ గ్యాంగ్‌రేప్ కుట్ర రూపొందించినట్లు విచారణలో బయటపడింది. -
గ్యాంగ్‌రేప్ ... అంతా తూచ్
నోయిడా: తనను కిడ్నాప్ చేసి, అనంతరం కదులుతున్న కారులో రేప్ చేసి ఢిల్లీలో వదిలిపెట్టి పోయారని ఆరోపించిన ఓ మహిళ ఆ తరువాత మాట మార్చింది. కోపంతోనే ఇద్దరిపై తప్పుడు కేసు పెట్టానని పోలీసులకు చెప్పింది. అంతకు ముందు ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు గ్యాంగ్‌రేప్ కేసు నమోదుచేశారు. నోయిడా పోలీస్ పీఆర్వో మనీశ్ సక్సేనా వివరాలు వెల్లడిస్తూ... తప్పుడు కేసు పెట్టినట్లు సదరు మహిళ అంగీకరించిందని అన్నారు. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలు వెలుగులోకి తెచ్చేందుకు దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. మహిళ తనపై గ్యాంగ్‌రేప్ జరిగిందని ఫిర్యాదు చేసిన తరువాత ఆమెను వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి పంపితే పరీక్షలు చేయించుకోకుండానే ఇంటికి వెళ్లింది. ఆ తరువాత మళ్లీ ఆసుపత్రికి తీసుకెళ్తే వైద్య పరీక్షలకు నిరాకరించింది. అసలు పరీక్షలు చేయించుకోవడం ఇష్టం లేదని వైద్యులకు తేల్చిచెప్పింది. కోపంతోనే ఇద్దరిపై తప్పుడు కేసు పెట్టినట్లు ఆమె తమకు రాతపూర్వకంగా తెలియజేసిందని సక్సేనా తెలిపారు. తనపై ఎవరూ లైంగిక దాడిచేయలేదని, ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోరింది. అంతకుముందు...విధులు ముగించుకుని క్యాబ్ కోసం ఎదురుచూస్తుండగా ఓ కారు వచ్చి తన వద్ద ఆగిందని, చిరునామా అడుగుతూ అందులోని వ్యక్తులు తనను అపహరించి గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారని ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదుచేసింది. -
ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు
బికనీర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బికనీర్ రేప్ కేసు అవాస్తవమని రాజస్థాన్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా బడేల్ ప్రకటించారు. స్కూలు టీచర్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు బాలిక తండ్రి తప్పుడు కేసు పెట్టాడని, అతను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు. బికనీర్‌లో ఎనిమంది టీచర్లు 13 ఏళ్ల బాలికపై ఏడాదిన్నర పాటు అత్యాచారం చేశారని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఇతర మంత్రులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఈ అమ్మాయి స్కూలు మానేసి నాలుగేళ్లు అవుతోందని, ఆమెపై టీచర్లు లైంగికదాడి చేయలేదని విచారణలో తేలినట్టు మంత్రి చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్టు బాలిక తండ్రి అంగీకరించాడని తెలిపారు. గతంలో స్కూలు యాజమాన్యం ఆయనపై కేసు పెట్టినట్టు విచారణలో తేలిందని, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీచర్లపై అసత్య ఆరోపణలు చేశాడని చెప్పారు. సంబంధిత బాలికతో మాట్లాడనివ్వకుండా ఇంట్లో పెట్టి తాళం వేశాడని తెలిపారు. టీచర్లపై నమోదైన కేసును తొలగిస్తామని, బాలిక తండ్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. -
నా తండ్రిని పదేపదే వేధిస్తున్నారు
* ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత * ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరిక * ఎన్ని ఇబ్బందులు పెట్టినా వెనక్కి తగ్గరని స్పష్టీకరణ * సర్కారుపై తమకు నమ్మకం లేదని వెల్లడి సాక్షి, హైదరాబాద్: తన తండ్రి, ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని లక్ష్యంగా చేసుకుని పదేపదే వేధిస్తున్నారని, ఆయనకు ఏదైనా జరిగితే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ హెచ్చరించారు. ప్రభుత్వం తన తండ్రిని అణగదొక్కాలని చూస్తోందని ఆరోపించారు. ఆయనను ఎంతగా ఇబ్బందులు పెట్టాలని చూస్తే అంతగా ఎదుగుతారని, ఏ మాత్రం వెనక్కి తగ్గరని స్పష్టంచేశారు. ఆమె శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న తన తండ్రికి మధుమేహం, రక్తపోటు ఉన్నాయని, అలాంటి వ్యక్తిని హైదరాబాద్‌లోని ‘నిమ్స్’కు తరలించడాన్ని కూడా వివాదాస్పదం చేస్తున్నారని మండిపడ్డారు. కర్నూలు జిల్లా కలెక్టర్ ముగ్గురు డాక్టర్ల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్‌జైలుకు పంపి, వారి నివేదిక ప్రకారమే నిర్ణయం తీసుకుంటామనడం సరికాదన్నారు. ఆ బృందంలో హృద్రోగ నిపుణులు లేరని చెప్పారు. తమను వేధిస్తున్న ఈ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని తేల్చిచెప్పారు. ఓటుకు కోట్లు వ్యవహారంలో ప్రమేయం ఉన్న తెలంగాణ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు వెన్నునొప్పి ఉందనే కారణంతో హైదరాబాద్ నుంచి రాజమండ్రి ఆసుపత్రికి తరలించారని గుర్తుచేశారు. తన తండ్రికి హృద్రోగం, మధుమేహం, రక్తపోటు ఉన్నా ‘నిమ్స్’కు తరలించడానికి అభ్యంతరం ఏమిటని ఆమె సూటిగా ప్రశ్నించారు. పథకం ప్రకారమే...: ఒక పథకం ప్రకారం తన తండ్రిని ఎస్సీ/ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కేసులో ఇరికించారని అఖిలప్రియ ఆరోపించారు. ఆళ్లగడ్డలో శుక్రవారం జరిగిన సంఘటన ను ఆమె సవివరంగా తెలిపారు.తన హక్కులకు భంగం కలిగించినందునే పోలీసులను తన తరఫున తండ్రి నిలదీశారన్నారు. భూమాకు ఏదైనా జరిగితే బాబుదే బాధ్యత: బొత్స తమ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డికి ఆరోగ్యపరంగా ఏదైనా జరిగితే అందుకు సీఎం చంద్రబాబు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని వైఎస్సార్ సీపీ నేత బొత్స సత్యనారాయణ హెచ్చరించారు. ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. ఇటీవలే బైపాస్ సర్జరీ చేయించుకున్న భూమాను ఆరోగ్యరీత్యా హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించాలని వైద్యులు సలహాఇస్తే పొరుగు రాష్ట్రానికి పంపడానికి ఎస్కార్టు లేదని నిరాకరించడమేమిటని ఆగ్రహం వెలిబుచ్చారు. ఉమ్మడి రాజధానైన హైదరాబాద్ మరో రాష్ట్రం అవుతుందా? అని ప్రశ్నించారు. -
రూల్ బుక్ చూపించమంటే కేసు పెడతారా?
ఒక మహిళా ఎమ్మెల్యేను పోలింగ్ కేంద్రం నుంచి ఎలా వెళ్లగొడతారు, తాను ఆమె వెంట లేనప్పుడు ఎలా మాట్లాడతారని తన తండ్రి భూమా నాగిరెడ్డి అడిగినందుకే ఆయనపై కేసు పెట్టారని ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా నాగిరెడ్డి అరెస్టు, దాని పూర్వాపరాలపై ఆమె హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె ఏమన్నారంటే.. ఒక మహిళా ఎమ్మెల్యేని ఎలా అవమానిస్తారని నాగిరెడ్డి అడిగారు తప్ప.. అసలు ఆయనపై ఎస్సీ ఎస్టీ చట్టం పెట్టేలా ఒక్క మాట కూడా మాట్లాడలేదు నేను లేనప్పుడు ఎందుకు అడిగారు, ఎందుకు కూతురితో మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేని ఎలా వెళ్లగొడతారని అడిగారు రూల్ బుక్ చూపించాలని గట్టిగా అడిగారు అంతే తప్ప అన్ పార్లమెంటరీ భాష ఎక్కడా వాడలేదు కానీ సంబంధం లేకపోయినా ఆయనపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు సండ్ర వెంకట వీరయ్య మీద కేసు ఉన్నప్పుడు చిన్న నొప్పి ఉందని రాజమండ్రి ఆస్పత్రికి పంపారు. ఇప్పుడు నాన్న గుండె రోగి, ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. షుగర్ ఉంది, ఈ ఘటనతో ఆయనకు బీపీ వచ్చింది. అయినా నిమ్స్ కు పంపడానికి బోలెడంత సీన్ క్రియేట్ చేశారు గతంలో కూడా ముందు నంద్యాలకు, అక్కడి నుంచి కర్నూలుకు, తర్వాత నిమ్స్‌కు పంపారు ఇప్పుడు కలెక్టర్ ముగ్గురు వైద్యుల బృందాన్ని ఆళ్లగడ్డ సబ్ జైలుకు పంపారు. వాళ్లు ఇచ్చే నివేదికను బట్టే నిమ్స్‌కు పంపుతారట ఆ ముగ్గురిలో కార్డియాలజిస్టులు ఎవరూ లేరు. మాకు ప్రభుత్వం మీద నమ్మకం లేదు ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోంది, సిస్టమ్ సరిగా పనిచేయడం లేదు భూమా నాగిరెడ్డినే ఇబ్బందిపెడుతున్నాం, మిగిలిన వాళ్లు మాకొక లెక్కా అన్న సందేశాన్ని పంపుదామనుకుంటున్నారు కానీ ఇలా చేస్తే ఆయన ఇంకా రైజ్ అవుతారు తప్ప వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు అది ఈ ప్రభుత్వం తెలుసుకుంటే మంచిది నాన్న జైల్లో నిరాహార దీక్ష మొదలుపెట్టారు. షుగర్ లెవెల్స్ తగ్గుతున్నాయి రేపు ఆయనకేమైనా జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వానిదే అవుతుంది ఓటు వేయడానికి వెళ్తున్నప్పుడు నన్ను అడ్డుకున్నది కూడా పోలీసులే డీఎస్పీ నాతో ఎలా మాట్లాడారో, మేం ఎలా చెప్పామో అన్నీ తెలుస్తాయి మేం అసెంబ్లీలో హక్కుల తీర్మానం పెడతాం.