ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు | Bikaner rape case stands fake, girl's father concocted charges: Rajasthan Minister | Sakshi
Sakshi News home page

ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు

Published Tue, Mar 28 2017 8:35 AM | Last Updated on Tue, Sep 5 2017 7:20 AM

ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు

ప్రతీకారం తీర్చుకునేందుకు.. రేప్ కేసు పెట్టాడు

బికనీర్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బికనీర్‌ రేప్ కేసు అవాస్తవమని రాజస్థాన్ మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి అనితా బడేల్ ప్రకటించారు. స్కూలు టీచర్లపై ప్రతీకారం తీర్చుకునేందుకు బాలిక తండ్రి తప్పుడు కేసు పెట్టాడని, అతను చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని చెప్పారు.

బికనీర్‌లో ఎనిమంది టీచర్లు 13 ఏళ్ల బాలికపై ఏడాదిన్నర పాటు అత్యాచారం చేశారని ఆ అమ్మాయి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ కేసుపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజె, ఇతర మంత్రులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా ఈ అమ్మాయి స్కూలు మానేసి నాలుగేళ్లు అవుతోందని, ఆమెపై టీచర్లు లైంగికదాడి చేయలేదని విచారణలో తేలినట్టు మంత్రి చెప్పారు. తప్పుడు ఫిర్యాదు చేసినట్టు బాలిక తండ్రి అంగీకరించాడని తెలిపారు. గతంలో స్కూలు యాజమాన్యం ఆయనపై కేసు పెట్టినట్టు విచారణలో తేలిందని, దీనికి ప్రతీకారం తీర్చుకునేందుకు టీచర్లపై అసత్య ఆరోపణలు చేశాడని చెప్పారు. సంబంధిత బాలికతో మాట్లాడనివ్వకుండా ఇంట్లో పెట్టి తాళం వేశాడని తెలిపారు. టీచర్లపై నమోదైన కేసును తొలగిస్తామని, బాలిక తండ్రిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement