breaking news
gangsters killed
-
సిగ్మా గ్యాంగ్ హతం
న్యూఢిల్లీ: బిహార్‌కు చెందిన కరుడుగట్టిన నేర ముఠా ‘సిగ్మా గ్యాంగ్’లోని కీలక వ్యక్తులు ఎన్కౌంటర్లో హతమయ్యారు. ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున ఢిల్లీ, బిహార్ పోలీసులు నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ (25)తోపాటు గ్యాంగ్ సభ్యులు బిమ్లేష్ మహతో అలియాస్ బిమ్లేష్ సాహ్ని (25), మనీశ్ పాఠక్ (33), అమన్ ఠాకూర్ (21) చనిపోయినట్లు ఢిల్లీ క్రైమ్ విభాగం జాయింట్ కమిషనర్ సుందర్ కుమార్ తెలిపారు. వీరంతా బిహార్‌లోని సితామర్హి జిల్లాకు చెందినవారు. గ్యాంగ్ నాయకుడు రంజన్ పాఠక్ తలపై రూ.50 వేల రివార్డు కూడా ఉంది. అతడిపై 8 క్రిమినల్ కేసులు ఉన్నాయి. డబ్బు కోసం ఓ వ్యక్తిని బెదిరించినందుకు ఈ నెల 13న కూడా అతడిపై కేసు నమోదైంది. రంజన్ ప్రమాదకరమైన నేరస్తుడని సుందర్‌కుమార్ తెలిపారు. బిహార్‌లో అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ గ్యాంగ్ భారీ దోపిడీలకు పాల్పడేందుకు కుట్ర చేసిందని చెప్పారు. వీరు కొద్దిరోజులుగా ఢిల్లీలో మకాం వేశారన్న విశ్వసనీయ సమాచారం అందటంతో నిఘా పెట్టామని, గురువారం తెల్లవారుజామున వారు ఓ కారులో వెళ్తున్నట్లు తెలియటంతో వెంబడించినట్లు పేర్కొన్నారు. రాత్రి 2.20 గంటల సమయంలో రోహిణిలోని బహదూర్ షా మార్గ్‌లో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని వెల్లడించారు. మృతులు 25 నుంచి 30 రౌండ్ల కాల్పులు జరుపగా, పోలీసులు 15 నుంచి 20 రౌండ్లు కాల్చారని వివరించారు. ఈ మూఠా ప్రయాణించిన కారు దోపిడీ చేసిందే. దాని నంబర్ ప్లేట్ కూడా నకిలీదేనని గుర్తించారు. అల్లర్లకు కుట్ర పన్ని హతం.. ఎన్కౌంటర్లో చనిపోయిన గ్యాంగ్స్టర్లు బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో భారీగా అలజడి సృష్టించేందుకు కుట్ర పన్నినట్లు బిహార్ పోలీసులు గుర్తించారు. కొద్దిరోజుల క్రితం ఈ కుట్రకు సంబంధించిన ఆడియో వెలుగు చూడటంతో పోలీసులు వీరిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ‘ఎన్నికల సందర్భంగా ఏదో ఒక సంచలనం సృష్టించేందుకు ఈ గ్యాంగ్ ప్రణాళిక వేసింది’అని బిహార్ డీజీపీ తెలిపారు. సీతామర్హి జిల్లాలో వీరు ఇటీవల ఐదు వరుస హత్యలకు పాల్పడ్డారు. 25 రోజుల క్రితం బ్రహ్మర్షి సమాజ్ జిల్లా అధ్యక్షుడిని హత్య చేశారు. ఈ గ్యాంగ్ సుపారీ హత్యలు కూడా చేసేది. #BigBreakingNews #Delhipolice #BiharPolice#EncounterIn the intervening night of 22-23.10.25, around 2:20 AM, a fierce shoot out took place on Bahadur shah marg from Dr Ambedkar Chowk to Pansali chowk, Rohini, Delhi between 4 suspected accused persons and joint team of Crime… pic.twitter.com/jZmT91isKg— Amit Bhardwaj (@AmmyBhardwaj) October 23, 2025 -
ఊరేగింపుగా ఎందుకు తీసుకెళ్లారు ?
న్యూఢిల్లీ: గ్యాంగ్‌స్టర్ అతీక్ అహ్మద్, అతని సోదరుడు అష్రాఫ్ కస్టడీలో ఉండగా పోలీసుల కళ్లెదుటే హత్యకు గురైన ఘటనపై సుప్రీంకోర్టు శుక్రవారం ప్రశ్నల వర్షం కురిపించింది. దీనిపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా పోలీసులు, యూపీ సర్కారుకు పలు ప్రశ్నలు సంధించింది. ‘ అతీక్‌ను ఆస్పత్రికి తీసుకొస్తారని నిందితులకు ముందే ఎలా తెలుసు ? మేం కూడా టీవీలో చూశాం. ఆస్పత్రి గేటు నుంచి వారిని లోపలికి అంబులెన్స్‌లో ఎందుకు తీసుకెళ్లలేదు. మీడియా సమక్షంలో వారిని ఎందుకు ఊరేగింపుగా నడిపిస్తూ తీసుకెళ్లారు?. అతీక్ పోలీసు కస్టడీలో ఉండగా మీడియా చూస్తుండగా షూటర్లు హత్యకు ఎలా తెగించగలిగారు?’ అని యూపీ సర్కార్ తరఫున హాజరైన సీనియర్ అడ్వకేట్ ముకుల్ రోహత్గీని జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ దీపాంకర్ దత్తాల ధర్మాసనం ప్రశ్నించింది. దర్యాప్తు పురోగతిపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. విద్వేష ప్రసంగాలపై కేసులు నమోదుచేయండి న్యూఢిల్లీ: దేశంలో మత సామరస్యానికి తీవ్ర భంగం వాటిల్లేలా విద్వేష ప్రసంగాలు చేసే వారిపై సుమోటో కేసులు నమోదుచేయాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. లేదంటే కోర్టు ధిక్కార చర్య తప్పదని డీజీపీలను హెచ్చరించింది. -
జైల్లో కత్తులు, మొబైల్ ఫోన్లు!
మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు జిల్లా జైల్లోని ఖైదీల నుంచి ఆరు కత్తులు, 16 మొబైల్ ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత సోమవారం ఈ జైల్లో జరిగిన ఘర్షణలో ఇద్దరు గ్యాంగ్‌స్టర్ ఖైదీలు హత్యకు గురయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు, జైలు అధికారులతో కూడిన దర్యాప్తు బృందం బుధవారం నుంచి మంగళూరు జైల్లో తనిఖీలు నిర్వహిస్తున్నది. ఈ తనిఖీల్లో ఖైదీల వద్ద కత్తులు, మొబైల్ ఫోన్లే కాకుండా ఏడు మెమరీ కార్డులు, మొబైల్ బ్యాటరీలు, సిమ్‌కార్డులు, లైటర్లు, ఎలక్ట్రిక్ హీటర్లు, మొబైల్ చార్జర్, ఎలక్ట్రిక్ వైర్, కారం వంటి వస్తువులు దొరికాయి. అయితే తనిఖీల్లో లభించిన కత్తులు ఇటీవలి ఇద్దరి హత్యల్లో వాడలేదని పోలీసులు ధ్రువీకరించారు. జైల్లో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేశామని చెప్పారు. సోమవారం జైల్లో జరిగిన ఘర్షణలో ప్రత్యర్థుల చేతిలో కరుడుగట్టిన నేరగాడు మదూర్ ఇసుబ్, అతని అనుచరుడు గణేశ్ షెట్టి హత్యకు గురయిన సంగతి తెలిసిందే. -
ఖైదీల మధ్య ఘర్షణ: ఇద్దరి మృతి
కర్ణాటకలోని మంగళూరు జైల్లో ఖైదీల మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు మరణించారు, మరో 12 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో జైలు సూపరింటెండెంట్ కూడా ఉన్నారు. అండర్ వరల్డ్‌తో సంబంధాలున్న మదూర్ ఇసుబు అనే ప్రమాదకరమైన ఖైదీతో పాటు, అతడి అనుచరుడైన గణేశ్ శెట్టి అనే అండర్‌ట్రయల్ ఖైదీ కూడా ఈ ఘర్షణలో మరణించాడు. తీవ్రంగా గాయపడిన 12 మంది ఖైదీలను వెన్లాక్ ఆస్పత్రికి తరలించారు. జైల్లోని రెండు వర్గాలకు చెందిన ఖైదీల మధ్య ఘర్షణ జరిగింది గానీ, దానికి కారణం ఏంటన్న విషయం మాత్రం తెలియలేదు. ఖైదీలందరూ ఉదయం టిఫిన్ చేయడానికి ఒకచోట చేరినప్పుడు ఈ ఘర్షణ మొదలైంది. ఇది కేవలం రెండు గ్యాంగుల మధ్య ఘర్షణే తప్ప వర్గపోరు కాదని పోలీసు కమిషనర్ ఎస్. మురుగన్ చెప్పారు. ఖైదీలకు సంబంధించిన వాళ్లు ఎవరో జైలు బయటనుంచి గోడ మీదుగా ఆయుధాలను లోపలకు విసిరి ఉంటారని, వాటితోనే వీళ్లు ఘర్షణ పడ్డారని తెలిపారు. ఈ ఘర్షణలో మరణించిన ఇసుబును 2010లో ఇంటర్‌పోల్ వర్గాలు రియాద్‌లో అరెస్టుచేసి మంగళూరుకు తీసుకొచ్చారు. అప్పటినుంచి అతడు ఈ జైల్లోనే ఉన్నాడు. అప్పట్లో బీజేపీ నాయకుడు సుఖానంద శెట్టి హత్య సహా పలు హత్యకేసుల్లో ఇసుబు నిందితుడు. ఇక 1994 నాటి మహేంద్రప్రతాప్ హత్యకేసులో నిందితుడైన షార్ప్ షూటర్ గణేశ్ శెట్టిని కూడా 2010లోనే అరెస్టు చేసి మంగళూరు జైలుకు తరలించారు.


