చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఒకరు శుక్రవారం ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం చంద్రమాకులపల్లికి చెందిన సి.గంగులప్ప టీడీపీ కార్యకర్త. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, స్వగ్రామంలోని తన భూమికి పట్టా ఇప్పించాల్సిందిగా చంద్రబాబును కోరేందుకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నాడు.
మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో లోనికి వెళ్లి పురుగులు మందు తాగి బాబు వస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం గంగులప్ప ఆరోగ్యం కుదుటపడినట్టు ఆసుపత్రి వర్గాలు పేర్కొంటున్నాయి.