'సమ్మె విరమించాల్సిందే'
విజయవాడ: తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కక్షపూరిత చర్యలకు పాల్పడుతోంది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు సమ్మె విరమించాలని శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్లకు అల్టిమేటం జారీ చేశారు. శుక్రవారం సాయంత్రం సమ్మె విరమించని పక్షంలో కాంట్రాక్ట్ లెక్చరర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా సమ్మె కాలంలో ఉద్యోగులకు వేతనాలు కూడా ఇవ్వమని తేల్చి చెప్పారు.
ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే కాంట్రాక్ట్ లెక్చరర్ల ఉద్యోగాలు క్రమబద్దీకరిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు ఆ మాటను గాలికొదిలేశారు. తమకు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్న లెక్చరర్లపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు.